భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
వాతావరణ సూచన మరియు విపత్తు నిర్వహణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం
Posted On:
27 JUL 2023 3:45PM by PIB Hyderabad
రీజినల్ అసోసియేషన్ II ప్రాంతంలో తుఫాను సంబంధిత సమాచారాన్ని, సలహాలను పంచుకోవడానికి మరియు నిర్దిష్ట వర్షపాతాన్ని అంచనా వేయడానికి నౌకాస్ట్ టెక్నిక్‌ను అభివృద్ధి చేయడానికి భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సెప్టెంబర్-2021లో గూగుల్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
పై వాటితో పాటు..
వ్యవసాయ సేవలకు సంబంధించిన సూచన మరియు హెచ్చరిక సందేశాల వ్యాప్తి కోసం, భారత వాతావరణ విభాగంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వాడుకలో ఉంది.
స్వదేశీ రాడార్‌ల అభివృద్ధికి, శాఖ ద్వారా ప్రైవేట్ రంగం నుండి సహకారం తీసుకోబడుతుంది.
ఉరుములు మరియు మెరుపు సంబంధిత వాతావరణ సేవల కోసం, భారత వాతావరణ విభాగం క్లైమేట్ రెసిలెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్ఓపీసీ) సహకారంతో పని చేస్తోంది.
వివిధ మెట్ అప్లికేషన్లు మరియు సేవల అభివృద్ధిలో మద్దతు అందించడం కోసం, భారతీయ స్టార్టప్‌ల నుండి ప్రతిపాదనలు ఆహ్వానించబడ్డాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) నుండి సాంకేతికత బదిలీతో బారోమెట్రిక్ ప్రెజర్ సెన్సార్ మరియు ఇన్శాట్ కమ్యూనికేషన్‌తో కూడిన శాటిలైట్ ట్రాక్డ్ లాగ్రాంజియన్ డ్రిఫ్టర్ స్వదేశీకరించబడింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్) అవసరాన్ని బట్టి సమాచారాన్ని సేకరించే సంస్థ. భారత వాతావరణ విభాగం మెరుగైన ఖచ్చితత్వంతో ఎగువ గాలి గాలి డేటాను పొందడానికి పాత ఆప్టికల్, ఓడోలైట్-ఆధారిత పైలట్ బెలూన్ సిస్టమ్‌ను తాజా జీపీఎస్ -ఆధారిత పైలట్ సోండే సిస్టమ్‌లతో భర్తీ చేసే అవకాశాన్ని అన్వేషించింది. ఈ సాంకేతికత డేటా నష్టాన్ని తగ్గించడానికి మరియు వాతావరణ సూచన సేవలను మరింత మెరుగుపరచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కాకుండా, దేశంలో తయారు చేయబడిన అనేక పరిశీలనాత్మక పరికరాలు (డాప్లర్ వాతావరణ రాడార్లు, ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు మొదలైనవి) ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విధానానికి మద్దతుగా, అవసరాన్ని బట్టి కొనుగోలు చేయబడ్డాయి.
కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1943610)