ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, వ్యూహాత్మక స్పష్టత లేకపోవడం వల్ల సెమీకండక్టర్ల రంగం వెనుకబడింది. శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
చిప్‌ల తయారీ సాంకేతికతలో భారతదేశం 12 తరాలు వెనుకబడి ఉంది : మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
కొన్ని దేశాలు 30 సంవత్సరాల కాలంలో సాధించలేని అభివృద్ధిని రానున్న 10 సంవత్సరాలలో భారతదేశం సాధిస్తుంది..కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
27 JUL 2023 3:50PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలో దేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం చర్యలు అమలు చేస్తున్నదని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రేపు ప్రారంభం కానున్న సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ రెండో ఎడిషన్ సమావేశంలో పాల్గొడానికి వచ్చిన మంత్రి ఈరోజు మీడియాతోమాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటిగా భారతదేశం గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుతం సెమీకండక్టర్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. సెమీకండక్టర్ రంగంలో ఉన్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని అభివృద్ధి సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
“ సెమీకండక్టర్ రంగంలో అభివృద్ధి సాధించడానికి చర్యలు ప్రారంభించి 19 నెలలు అయ్యింది.గతంలో రాజకీయ దార్శనికత లోపించడం వ్యూహాల కొరత, అసమర్ధత వల్ల అభివృద్ధి సాధించడానికి వీలు లేకుండా పోయింది.గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల సెమీకండక్టర్ రంగంలో భారతదేశం వెనుక పడింది. సెమీకండక్టర్ రంగంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని పొరుగు దేశాలు 30 సంవత్సరాల కాలంలో సాధించలేని అభివృద్ధిని 10 సంవత్సరాల కాలంలో సాధించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది” అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో నేటి సాంకేతికతతో నడిచే ప్రపంచంలో సెమీకండక్టర్ల పాత్ర కీలకంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ,సెమీకండక్టర్స్ సరఫరా వ్యవస్థలో భారతదేశం ఒక ప్రధాన పాత్రధారిగా రూపాంతరం చెందుతుంది అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
“ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఉత్పత్తులు , సేవలకు డిమాండ్ పెరుగుతోంది. .ఎలక్ట్రానిక్స్ నిత్య జీవితంలో ప్రధాన అంశంగా మారాయి.ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీకండక్టర్లు ప్రధాన భాగంగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని . ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్స్రంగం అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకరిగా భారతదేశం గుర్తింపు పొందింది. సెమీకండక్టర్ రంగంలో 2014 నాటికి భారతదేశం ఉనికి లేదు. ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల పరిస్థితి మారింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం వాటా గణనీయంగా పెరిగింది ”అని మంత్రి తెలిపారు.
1960ల నుంచి భారతదేశం జారవిడుచుకున్న అవకాశాలను శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. సెమీకండక్టర్ రంగం ప్రాధాన్యత గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.
“ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో భారతదేశం అనేక అవకాశాలు కోల్పోయింది. వ్యూహాత్మక మరియు రాజకీయ దృష్టి లేకపోవడం, అసమర్థత దీనికి ప్రధాన కారణాలు. ఇంటెల్‌కు పూర్వగామి అయిన ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్స్, ప్యాకేజింగ్ యూనిట్ నెలకొల్పడానికి 1957లో భారతదేశానికి వచ్చింది. అయితే, అప్పటి ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్యాకేజింగ్ యూనిట్ మలేషియాలో ఏర్పాటయింది. ప్రస్తుతం ఆసియాలో అతిపెద్ద ప్యాకేజింగ్ హబ్‌గా మారింది. మూసి పడిన సిలికాన్, జెర్మేనియం ట్రాన్సిస్టర్‌ల కోసం ప్రభుత్వం ఫ్యాబ్‌ని ఏర్పాటుచేసింది. ప్రధాన VLSI సౌకర్యం గా రూపుదిద్దుకున్న , సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL) 1989లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా 1997 వరకు ఉత్పత్తి నిలిపివేసింది. 1987 వరకు భారతదేశం తాజా చిప్ తయారీ సాంకేతిక రంగం కేవలం రెండు సంవత్సరాలు వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారతదేశం ఈ రంగంలో మనం 12 తరాలు వెనుకబడి ఉంది. ”అని మంత్రి పేర్కొన్నారు.
పొరుగు దేశాలు సెమీకండక్టర్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంతో సంస్థలు ఆ దేశాల్లో ఏర్పాటు అయ్యాయని తెలిపిన మంత్రి దీనివల్ల దేశం ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, తాజా పెట్టుబడుల వల్ల దేశంలో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి సాదిస్తుందని మంత్రి అన్నారు.
“అంతర్జాతీయ సెమీకండక్టర్ దిగ్గజం దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించి . నిపుణులను నియమించి , క్లీన్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రాజెక్టు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది.. ఈ ప్రాజెక్టు చివరికి చైనాకు తరలి వెళ్ళిపోయింది. దీని ఫలితంగా భారతదేశానికి సెమీకండక్టర్ సౌకర్యం , 4,000 ఉద్యోగాలు పోయాయి. సెమీకండక్టర్ మెమరీ స్పేస్‌లో ప్రపంచ మేజర్ అయిన మైక్రోన్, గుజరాత్‌లో దాని $2.75 Bn ATMP ప్రాజెక్ట్ కనీసం 5,000 ప్రత్యక్ష 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది' అని మంత్రి తెలిపారు.
ప్రతిభను పెంపొందించడానికి సమగ్ర పాఠ్యాంశాలను రూపొందించడంలో ప్రభుత్వం గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపిన శ్రీ చంద్రశేఖర్ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్‌లకు సహకారం అందిస్తుందని అన్నారు. ' పరిశ్రమ సహకారంతో 85,000 అత్యంత ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన ప్రపంచ ప్రతిభావంతులను రూపొందించడానికి కృషి జరుగుతోంది. . సెమీకాన్ఇండియా ఫ్యూచర్‌డిజైన్ కింద భారతదేశంలో 30కి పైగా సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్‌లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో కొన్ని సిలికాన్ వ్యాలీకి చెందిన సెమీకండక్టర్ సంస్థలు ఉన్నాయి. ఐదు స్టార్టప్‌లు ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందాయి. మరో 25 స్టార్టప్‌లు తదుపరి తరం ఉత్పత్తులు, పరికరాల కోసం అందించిన ప్రతిపాదనలు పరిశీలన దశలో ఉన్నాయి ”అని మంత్రి చెప్పారు.
సెమికాన్ ఇండియా సదస్సును రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సెమీకండక్టర్ పరిశ్రమలో మైక్రోన్ టెక్నాలజీ, అప్లైడ్ మెటీరియల్స్, లామ్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలు సదస్సులో పాల్గొంటాయి.
***
(Release ID: 1943600)