కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

భవన & ఇతర నిర్మాణ కార్మికుల పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు అర్హత ప్రమాణాలు

Posted On: 27 JUL 2023 3:40PM by PIB Hyderabad

భవన & ఇతర నిర్మాణ కార్మికులు (ఉపాధి నియంత్రణ, సేవల నిబంధనలు) చట్టం-1996లోని సెక్షన్ 12 నిబంధనల ప్రకారం, 18 సంవత్సరాలు నిండిన - 60 ఏళ్ల వయస్సు లోపున్న భవన కార్మికుడు గత 12 నెలల్లో 90 రోజులకు తక్కువ కాకుండా ఏదైనా భవనం లేదా నిర్మాణంలో పాల్గొంటే, ఈ చట్టం కింద రాష్ట్ర సంక్షేమ బోర్డులో లబ్ధిదారునిగా పేరు నమోదు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. చట్టంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయి.

ప్రతి భవన & ఇతర నిర్మాణ కార్మికుడు బీవోసీ కార్మికుడిగా పేరు నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న షరతులను నెరవేర్చాలి, లబ్ధిదారుగా కొనసాగడానికి నమోదు పునరుద్ధరించుకోవడం తప్పనిసరి.

భవన & ఇతర నిర్మాణ కార్మికుల కోసం ఒక నమూనా సంక్షేమ పథకాన్ని అన్ని రాష్ట్రాలు/యూటీలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. ఆ పథకం అమలు యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను కూడా నిర్దేశించింది. కార్మికుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి పని చేస్తుంటే, అతని అసలు నివాస ప్రాంతాన్ని కారణంగా చూపి నమోదును తిరస్కరించవద్దని రాష్ట్రం/యూటీ ప్రభుత్వాలకు సూచించింది.

వలస బీవోసీ కార్మికులు బీవోసీడబ్ల్యూ (ఆర్‌ఈ&సీఎస్‌) చట్టం-1996 కింద పేరు నమోదు చేసుకునేందుకు వీలుగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వలస బీవోసీ కార్మికులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. నమోదు, ప్రయోజనాల పంపిణీలో వాళ్లు ఎలాంటి వివక్ష ఎదుర్కోకుండా చూసుకోవాలని నిర్దేశించింది.

నమోదు ప్రక్రియను సులభంగా మార్చడానికి నమోదిత బీవోసీకార్మికులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించడం, స్థానిక/మున్సిపల్/పంచాయతీ స్థాయిలో సమర్థులైన అధికార్ల నియామకం, స్వీయ-ధృవీకరణను అనుమతించడం, తరచూ క్యాంపులు నిర్వహించడం, ప్రముఖ కార్మిక కూడళ్లు, అడ్డాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు, బీవోసీకార్మికులకు గుర్తింపు కార్డుల జారీ వంటి చర్యల ద్వారా నమూనా సంక్షేమ పథకంలో కార్మికుల నమోదు కోసం వివరణాత్మక నిబంధనలు జారీ చేయడం జరిగింది.

బీవోసీడబ్ల్యూ (ఆర్‌ఈ&సీఎస్‌) చట్టం-1996లోని సెక్షన్ 60ని అమలు ద్వారా, నమోదు ప్రక్రియను సులభతరం చేయడం, నమోదు & పునరుద్ధరణ కోసం కార్మికులు భౌతికంగా రావలసిన అవసరాన్ని తొలగించడం, స్వీయ-ధృవీకరణ ద్వారా కార్మికులపై విశ్వాసం ఉంచడం వంటి వాటి ద్వారా అన్ని రాష్ట్రాలు/యూటీ ప్రభుత్వాలు వెళ్లిపోయిన బీవోసీకార్మికులంతా రాష్ట్ర సంక్షేమ బోర్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారని నిర్ధరించుకోవాలని, వాళ్ల సమాచారం అప్‌డేట్ అయ్యేలా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పీఎం-జేఏవై (ఆయుష్మాన్ భారత్) ద్వారా ఆరోగ్య బీమా పథకం, పీఎం-జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా జీవిత & వికలాంగ బీమా, పీఎం-సురక్ష బీమా యోజన, పీఎం-శ్రమ్ యోగి మంధన్ యోజన ద్వారా 60 సంవత్సరాల తర్వాత జీవితకాల పింఛను అందేలా చూసుకోవాలని; నిరుద్యోగం, అనారోగ్యం, అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీవోసీ కార్మికుల సంక్షేమం కోసం సెస్ నిధుల ద్వారా జీవనాధార భత్యం కల్పించాలని సూచించడం జరిగింది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్‌ తెలి ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు.

 

******



(Release ID: 1943594) Visitor Counter : 221


Read this release in: English , Urdu , Punjabi