రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భారతీయ రైల్వేల ద్వారా 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 100% విద్యుదీకరించబడ్డాయి

Posted On: 26 JUL 2023 3:43PM by PIB Hyderabad

ఇండియన్ రైల్వే గత తొమ్మిదేళ్లలో 37,011 రూట్ కిలోమీటర్ల  (ఆర్కేఎం) బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్  విద్యుదీకరించబడింది
 

30.06.2023 నాటికి, భారతీయ రైల్వేలు (ఇండియన్రైల్వే) బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 59,096 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం) విద్యుదీకరించబడింది. ఇందులో 37,011 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం) గత తొమ్మిదేళ్లలో మాత్రమే విద్యుదీకరించబడ్డాయి.
రాష్ట్రాలు/యూటీల వారీగా విద్యుదీకరణ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

క్రమసంఖ్య రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 30.06.2023 నాటికి విద్యుద్దీకరించబడిన  బ్రాడ్ గేజ్ రూట్ కిలోమీటర్లు (బీజీ ఆర్కేఎం)

1 చండీగఢ్ 16

2 ఛత్తీస్‌గఢ్ 1,199

3 ఢిల్లీ 183

4 హర్యానా 1,701

5 హిమాచల్ ప్రదేశ్ 67

6 జమ్ము కశ్మీర్ 298

7 జార్ఖండ్ 2,558

8 మధ్యప్రదేశ్ 4,822

9 మేఘాలయ 9

10 ఒడిశా 2,822

11 పుదుచ్చేరి 21

12 తెలంగాణ 1,858

13 ఉత్తర ప్రదేశ్ 8,482

14 ఉత్తరాఖండ్ 347

15 బీహార్ 3,614

16 ఆంధ్రప్రదేశ్ 3,841

17 తమిళనాడు 3,659

18 మహారాష్ట్ర 5,441

19 పశ్చిమ బెంగాల్ 3,682

20 కేరళ 947

21 గుజరాత్ 3,435

22 పంజాబ్ 1,915

23 రాజస్థాన్ 4,387

24 గోవా 147

25 కర్ణాటక 2,844

26 అస్సాం 801

27 అరుణాచల్ ప్రదేశ్ –

28 మణిపూర్ –

-29 మిజోరం –
-

30 నాగాలాండ్ –

-
31 త్రిపుర –

-మొత్తం – 59,096

 

విద్యుదీకరణ పనుల అమలుకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు పొందడంలో కొన్నిసార్లు  కొంత ఆలస్యం జరుగుతుంది.

రైల్వే విద్యుద్దీకరణ పనిని సకాలంలో పూర్తి చేయడానికి, భారతీయ రైల్వేలు ఇతర వాటితో సహా పలు చర్యలు చేపట్టాయి.
 ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కమీషన్ సమయంలో ఎదురవుతున్న అడ్డంకిని పరిష్కరించడానికి  రైల్వే బోర్డు స్థాయిలో ప్రాజెక్ట్‌లను సజావుగా మరియు త్వరితగతిన ఆమోదించడానికి మరియు సమర్థవంతమైన ప్రాజెక్ట్ మానిటరింగ్ మెకానిజం కోసం రైల్వే బోర్డులో 'గతి శక్తి  డైరెక్టరేట్'ని సృష్టించడం జరిగింది. అదనంగా, భారీ పరిమాణ ప్రాజెక్టులు 'ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్' (ఈపీసీ) కాంట్రాక్ట్ పద్ధతిలో అమలు చేయబడుతున్నాయి.  హామీ ఇవ్వబడిన నిధులు ఏర్పాటు చేయబడుతున్నాయి.  అంతేకాకుండా ప్రాజెక్ట్ అమలు మరియు పూర్తిని వేగవంతం చేయడానికి ఫీల్డ్ యూనిట్‌లకు ఆర్థిక అధికారాలు వికేంద్రీకరించబడ్డాయి.

కింది రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ 100% విద్యుద్దీకరణ చేయబడింది


క్రమసంఖ్య రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

1 చండీగఢ్

2 ఛత్తీస్‌గఢ్

3 ఢిల్లీ

4 హర్యానా

5 హిమాచల్ ప్రదేశ్

6 జమ్ము అండ్ కశ్మీర్

7 జార్ఖండ్

8 మధ్యప్రదేశ్

9 మేఘాలయ

10 ఒడిషా

11 పుదుచ్చేరి

12 తెలంగాణ

13 ఉత్తర ప్రదేశ్

14 ఉత్తరాఖండ్


బీహార్ మరియు గుజరాత్ రాష్ట్రంలో వరుసగా 3,710 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)లో 3,614 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)  మరియు 3,862 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం)లలో 3,435 రూట్ కిలోమీటర్లు (ఆర్కేఎం) విద్యుదీకరణ పూర్తయింది.

భారతీయ రైల్వేలు (ఇండియన్ రైల్వే) 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారిణిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ రైల్వే దాని కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అనేక చొరవలను తీసుకుంది. ఇందులో పునరుత్పత్తి లక్షణాలతో మూడు దశల ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల ఉత్పత్తికి పూర్తిగా మారడం వంటి శక్తి సామర్థ్య సాంకేతికతలను ఉపయోగించడం కూడా ఉంది. హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ) టెక్నాలజీని ఉపయోగించడం, భవనాలు మరియు కోచ్‌లలో ఎల్ఈడీ లైట్ల వినియోగం, స్టార్ రేటెడ్ ఉపకరణాలు, నీటి సంరక్షణ మరియు దాని నిర్వహణ మరియు అటవీ పెంపకం.

అంతేకాకుండా  నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని సాధించడానికి గుర్తించబడిన కీలక వ్యూహాలు పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ సేకరణ; డీజిల్ నుండి విద్యుత్ ట్రాక్షన్కు మారడం; శక్తి సామర్థ్యం యొక్క ప్రచారం; మరియు అడవుల పెంపకం.

రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1943593) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Tamil