రైల్వే మంత్రిత్వ శాఖ
సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుక
సెంట్రల్ కంట్రోల్ & కమాండ్ సెంటర్ అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రైల్వేలకు నాడీ కేంద్రంగా పనిచేస్తుంది
Posted On:
26 JUL 2023 5:22PM by PIB Hyderabad
సెంట్రల్ కంట్రోల్ & కమాండ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జూలై 26, 2023న న్యూఢిల్లీలో జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో సెంట్రల్ కంట్రోల్ & కమాండ్ సెంటర్ మొత్తం భారతీయ రైల్వేలకు నాడీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి ఆర్పీఎఫ్ డీజీ సంజయ్ చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మానిటరింగ్ సెల్ & అనలిటిక్ సెల్‌లో 50 కంటే ఎక్కువ మంది సిబ్బంది వివిధ షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తారు. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం డేటా పర్యవేక్షణ, సీసీటీవీ విశ్లేషణ, డేటా విశ్లేషణ & సైబర్ కార్యకలాపాలకు సంబంధించిన పనులు మొదలైన వాటి కోసం టీఓపీఏఆర్సీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. భారతీయ రైల్వేలోని అన్ని జోన్‌లు, దీని కోసం ప్రతి జోన్‌కు సంబంధించిన వీడియో స్క్రీన్‌ని పర్యవేక్షణ హాలులో ఉంచుతారు.
భవనంలో 60 మంది సామర్థ్యం గల కాన్ఫరెన్స్ హాల్, జిమ్నాజియం సౌకర్యం, ఫలహారశాల & ప్రముఖుల కోసం సూట్‌లు ఉంటాయి. ప్రాజెక్ట్ 2 దశల్లో నిర్మించబడుతుంది. రెండు దశలకుగాను వరుసగా రూ. 4.5 కోట్లు, రూ. 13.5 కోట్లు మంజూరు చేయబడ్డాయి. నేటి నుంచి (జూలై 26, 2023) మొదటి దశ పనులు ప్రారంభం అవుతాయి.
***
(Release ID: 1943585)
Visitor Counter : 89