గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పీఎంఏవై-యు అర్హత ప్రమాణాలు
Posted On:
27 JUL 2023 4:04PM by PIB Hyderabad
అర్హులైన పట్టణ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తోంది. 25.06.2015 నుంచి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యు) 'అందరికీ ఇళ్లు' కార్యక్రమం కింద, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సాయాన్ని అందిస్తోంది. పీఎంఏవై-యు కింద మంజూరైన 118.90 లక్షల ఇళ్లలో, 10.07.2023 నాటికి 112.22 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమయ్యాయి. వీటిలో 75.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది, లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ పథకం గడువు 31.03.2022తో ముగియాల్సి ఉన్నా, సీఎల్‌ఎస్ఎస్ మినహా, 31.12.2024 వరకు పొడిగించడం జరిగింది. కేంద్ర సాయం మంజూరు, అమలు పద్ధతులు మార్చకుండా, మంజూరైన అన్ని ఇళ్లను పూర్తి చేయడానికి గడువును పొడిగించడం జరిగింది.
కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1943576)