ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీహార్‌లోని రాష్ట్ర రహదారులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏ డీ బీ, భారతదేశం $295 మిలియన్ రుణంపై సంతకం చేసింది

Posted On: 27 JUL 2023 6:12PM by PIB Hyderabad

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏ డీ బీ) మరియు భారత ప్రభుత్వం ఈరోజు బీహార్ రాష్ట్రంలో వాతావరణం మరియు విపత్తులను తట్టుకునే డిజైన్ మరియు రహదారి భద్రత అంశాలతో 265 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అప్‌గ్రేడ్ చేయడానికి $295 మిలియన్ రుణం కోసం ఒప్పందంపై సంతకం చేశాయి.

 

బీహార్ రోడ్ల ప్రాజెక్ట్‌లో కనెక్టివిటీ మరియు సుస్థిరతను మెరుగుపరచడం కోసం ఒప్పందంపై  భారత ప్రభుత్వం తరపున  ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ వుమ్‌లున్‌మాంగ్ వుల్నామ్ మరియు భారతదేశంలోని ఏ డీ బీ కంట్రీ డైరెక్టర్ శ్రీ టేకో కొనిషి ఏ డీ బీ తరపున సంతకం చేసారు.

 

అన్ని రాష్ట్ర రహదారులను ప్రామాణిక రెండు-లేన్ వెడల్పులకు అప్‌గ్రేడ్ చేయడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరచడానికి బీహార్ ప్రభుత్వ కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుంది. మెరుగైన రోడ్లు బీహార్ పేద గ్రామీణ జిల్లాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆరోగ్యం మరియు విద్య సౌకర్యాలు మరియు మార్కెట్‌లకు ప్రాప్యతను ప్రోత్సహిస్తాయి.

 

"రోడ్లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ఏ డీ బీ  రాష్ట్ర రహదారి  నిర్వహణ మరియు అమలు సామథ్యం పెంపునకు  గతం లో చేసిన ప్రయత్నాలకు  అలాగే ప్రణాళిక, రహదారి భద్రత మరియు స్థిరత్వం కోసం వ్యవస్థలను బలోపేతం చేస్తుంది" అని  కొనిషి చెప్పారు.

 

రాష్ట్ర రహదారులను బలోపేతం చేసే కార్యక్రమాలలో, బీహార్ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాద సమాచారంతో  రహదారి ఆస్తి నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, బీహార్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం పునర్వినియోగ పదార్థాలు మరియు సుస్థిరమైన పదార్థాలు, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి, రద్దీ నిర్వహణ మరియు వాతావరణ అనుకూలతపై అధ్యయనాలు నిర్వహించడం మరియు రహదారి భద్రతా చర్యలలో ఉత్తమ విధానాలు మార్గదర్శకాలను రూపొందించడం వంటివి ఉన్నాయి. 

 

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో మహిళా కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జీవనోపాధిపై శిక్షణతో పాటు రోడ్డు భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, దుర్వినియోగం మరియు వేధింపులపై ప్రాజెక్టు ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన కల్పిస్తారు.

 

2008 నుండి, సుమారు 1,696 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అప్‌గ్రేడ్ చేయడం మరియు గంగా నదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం ఏ డీ బీ బీహార్ రాష్ట్రానికి మొత్తం $1.63 బిలియన్ల ఐదు రుణాలను అందించింది,

***


(Release ID: 1943568) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi