గనుల మంత్రిత్వ శాఖ
బంగారంపై జియోలాజికల్ నివేదికల వివరాలు
Posted On:
26 JUL 2023 3:45PM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసిఎల్) నుండి వివిధ రాష్ట్రాలకు 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి అందజేసే రిసోర్స్ బేరింగ్ జియోలాజికల్ రిపోర్ట్‌ల వివరాలు అనుబంధంలో ఇవ్వడం జరిగింది. 2016-18లో ఎంఈసిఎల్ పై భారత్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ వద్ద అన్వేషణ చేపట్టింది. టైలింగ్ డంప్స్ నుండి 24279 కిలోల బంగారాన్ని అంచనా వేసింది. అయినప్పటికీ, గనుల మంత్రిత్వ శాఖ సబార్డినేట్ కార్యాలయం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) చేపట్టిన బెనె -సియేషన్ అధ్యయనాలు, 54% బంగారం కంటెంట్ మాత్రమే తిరిగి పొందగలవని సూచిస్తుంది. వీటితో పాటు, ఖనిజ బంగారం కోసం జి4 స్థాయి అన్వేషణకు సంబంధించిన 42 జియోలాజికల్ మెమోరాండంలు కూడా వనరులను అంచనా వేయని రాష్ట్రాలకు అందజేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం వేలం ప్రక్రియను పూర్తి చేసి, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అనుకూలంగా చిగురుగుంట-బిస్నాథం గోల్డ్ బ్లాక్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది.
అనుబంధం:
2015-16 ఆర్థిక సంవత్సరం నుండి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అందించిన రిసోర్స్ బేరింగ్ జియోలాజికల్ రిపోర్టుల వివరాలు:
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
జిల్లా
|
ఖనిజం పేరుబ్లాక్/బెల్ట్
|
అన్వేషణ దశ
|
Year of
Handing Over
|
|
1
|
ఝార్ఖండ్
|
తూర్పు సింఘ్భుమ్
|
జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా, భితార్ దరి బ్లాక్‌లో బంగారం కోసం ప్రాథమిక అన్వేషణ
|
జి3
|
03.06.2020
|
|
2
|
కర్ణాటక
|
తుముకూరు
|
కర్నాటకలోని తుమకూరు జిల్లా అజ్జనహళ్లి బ్లాక్- ఈ లో బంగారం కోసం సాధారణ అన్వేషణ.
|
జి2
|
28.06.2018
|
|
3
|
కర్ణాటక
|
తుముకూరు
|
అజ్జనహళ్లి బ్లాక్‌లో బంగారం కోసం విచారణ - జి, తుమకూరు జిల్లా, కర్ణాటక
|
జి2
|
25.04.2019
|
|
4
|
మధ్యప్రదేశ్
|
సిద్ధి
|
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లా చకారియా బ్లాక్‌లో గోల్డ్ మినరలైజేషన్ కోసం సాధారణ అన్వేషణ.
|
జి2
|
02.01.2018
|
|
5
|
మధ్యప్రదేశ్
|
కట్ని
|
మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా, స్లీమనాబాద్ ప్రాంతంలోని ఇమాలియా బ్లాక్‌లో బంగారం, వెండి మరియు బేస్మెటల్ కోసం సాధారణ అన్వేషణ
|
జి2
|
02.01.2018
|
|
6
|
కర్ణాటక
|
హస్సన్
|
కేంపింకోటే బంగారం బ్లాక్
|
జి2
|
August 2017
|
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 1943565)
Visitor Counter : 73