భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

తీవ్రమైన వాతావరణ సంఘటనల పెరుగుదల

Posted On: 27 JUL 2023 3:46PM by PIB Hyderabad

   2018-2022 మధ్య కాలంలో తీవ్రమైన వాతావరణ సంఘటనల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

 

సంవత్సరం

తుఫానుల సంఖ్య

ఎస్‌డబ్ల్యూ వర్షాకాలంలో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) నివేదించబడిన స్టేషన్ల సంఖ్య

మొత్తం

తీవ్రమైన తుఫానులు

 భారీ వర్షపాతం

అత్యంత

భారీ వర్షపాతం

2018

7

6

2181

321

2019

8

6

3056

554

2020

5

4

1912

341

2021

5

4

1653

281

2022

5

2

1875

296

 

అనేక ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా వాతావరణ మార్పులకు గురవుతుంది. దేశంలోని అనేక ప్రాంతాలు వాతావరణ ప్రమాదకర సంఘటనలతో ప్రభావితమయ్యే విపరీత వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీ పెరుగుదలతో ఇది ప్రతిబింబిస్తుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) వివిధ వాతావరణ సంబంధిత ప్రమాదాలను నివారించడం  మరియు తగ్గించడం కోసం తీవ్రమైన వాతావరణ సంఘటనల సంసిద్ధత కోసం ప్రజలకు అలాగే విపత్తు నిర్వహణ అధికారులకు వివిధ ఔట్‌లుక్/ఫోర్కాస్ట్/హెచ్చరికలను జారీ చేస్తుంది. హెచ్చరికను జారీ చేస్తున్నప్పుడు ఊహించిన తీవ్రమైన వాతావరణం యొక్క ప్రభావాన్నితెలిపేందుకు మరియు రాబోయే విపత్తు వాతావరణ సంఘటనకు సంబంధించి తీసుకోవలసిన చర్య గురించి విపత్తు నిర్వహణకు సూచించడానికి తగిన రంగు కోడ్ ఉపయోగించబడుతుంది. ఆకుపచ్చ రంగు హెచ్చరికకు  ఎటువంటి చర్య అవసరం లేదు. పసుపు రంగు సూచన అప్రమత్తంగా ఉండటానికి మరియు నవీకరించబడిన సమాచారాన్ని పొందేందుకు అనుగుణంగా ఉంటుంది. ఇక నారింజ రంగు అప్రమత్తంగా ఉండాలి మరియు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.వెంటనే చర్లుయ తీసుకోవడానికి ఎరుపు రంగు సంకేతాలుగా ఉపయోగించబడుతుంది.

ఐఎండి ఇటీవలే ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్‌కాస్ట్ (ఐబిఎఫ్‌) జారీ చేయడం ప్రారంభించింది. ఇది వాతావరణం ఎలా ఉంటుంది అనేదాని కంటే వాతావరణం ఏమి చేస్తుంది అనే వివరాలను అందిస్తుంది. ఇది తీవ్రమైన వాతావరణ అంశాల నుండి ఆశించే ప్రభావాల వివరాలను మరియు తీవ్రమైన వాతావరణానికి గురైనప్పుడు చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి సాధారణ ప్రజలకు మార్గదర్శకాలను అందిస్తుంది.

ఐఎండి ఇటీవల వెబ్ ఆధారిత ఆన్‌లైన్ “క్లైమేట్ హజార్డ్ & వల్నరబిలిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా”ను విడుదల చేసింది. ఇది పదమూడు అత్యంత ప్రమాదకరమైన వాతావరణ సంఘటనల కోసం తయారు చేయబడింది. ఇది విస్తృతమైన నష్టాలు, ఆర్థిక, మానవ మరియు జంతువుల నష్టాలను కలిగిస్తుంది. దీన్ని https://imdpune.gov.in/hazardatlas/abouthazard.htmlలో యాక్సెస్ చేయవచ్చు. క్లైమేట్ హజార్డ్ మరియు వల్నరబిలిటీ అట్లాస్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలకు వివిధ విపరీత వాతావరణ సంఘటనలను పరిష్కరించడానికి ప్రణాళిక మరియు తగిన చర్యలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఇది ఉపయోగపడుతుంది.

ఐఎండి అందిస్తున్న ఏడు సేవలను (ప్రస్తుత వాతావరణం, నౌకాస్ట్, నగర సూచన, వర్షపాత సమాచారం, పర్యాటక సూచన, హెచ్చరికలు మరియు తుఫాను) ప్రజల ఉపయోగం కోసం ‘ఉమాంగ్’ మొబైల్ యాప్‌తో ప్రారంభించింది. అంతేకాకుండా ఐఎండి వాతావరణ సూచన కోసం 'మౌసం' అనే మొబైల్ యాప్‌ను, ఆగ్రోమెట్ సలహా వ్యాప్తి కోసం 'మేఘదూత్' మరియు మెరుపు హెచ్చరిక కోసం 'దామిని'ని అభివృద్ధి చేసింది. ఎన్‌డిఎంఏ చే అభివృద్ధి చేయబడిన సాధారణ హెచ్చరిక ప్రోటోకాల్ (సిఏపి) కూడా ఐఎండి ద్వారా హెచ్చరికల వ్యాప్తి కోసం అమలు చేయబడుతోంది.

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంసిద్ధత కోసం మార్గదర్శకాలు ఖరారు చేయబడ్డాయి మరియు తుఫాను, వేడి తరంగాలు, ఉరుములు మరియు భారీ వర్షపాతం వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల కోసం ఇప్పటికే విజయవంతంగా అమలు చేయబడ్డాయి. తగిన సంసిద్ధత మరియు సాధ్యమైన ఉపశమనానికి గాను ఐఎండి దేశం మొత్తానికి అవసరమైన హెచ్చరికలు మరియు సలహాలను అందజేస్తుంది.

కేంద్ర ఎర్త్‌సైన్స్‌స్‌ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.


 

******



(Release ID: 1943563) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Tamil