పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బ్యాటరీ వ్యర్ధాల నిర్వహణకు పర్యావరణ పరిహార నిధులు
Posted On:
27 JUL 2023 3:40PM by PIB Hyderabad
బ్యాటరీల వ్యర్ధాలను పర్యావరణ అనుకూలంగా నిర్వహించడం కోసం 22.08.2022న మంత్రిత్వ శాఖ బ్యాటరీల వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు,2022న జారీ చేసింది. ఈ నియమాల ప్రకారం రీసైకలర్లు (పునరుపయోగంలోకి తెచ్చేవారు), రిఫర్బిషర్లు (పునరుద్ధరించేవారు) సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు/ కాలుష్య నియంత్రణ కమిటీలలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రీసైక్లింగ్/ రిఫర్బర్బిష్‌మెంట్ ప్రక్రియను తప్పనిసరిగా పాటిస్తూ చేపట్టాలని రీసైక్లర్లు & రిఫర్బరిషర్లను నిర్దేశించింది. తమ కార్యకలాపాల నుంచి వెలువడే వ్యర్ధాలను హజార్డస్ & అదర్ వేస్ట్స్ (మేనేజ్‌మెంట్ అండ్ ట్రాన్స్‌బౌండరీ మూవ్‌మెంట్ - ప్రమాదకరమైన & ఇతర వ్యర్ధాల నిర్వహణ, సరిహద్దుల తరలింపు) నిబంధనలు 2016కు అనుగుణంగా రీసైక్లర్లు, రిఫర్బిషర్లు చేపట్టడాన్ని తప్పనిసరి చేసింది.
వివిధ ఉత్పత్తిదారులు లేక సంస్థల నుంచి తాము సేకరించిన లేక అందుకున్న బ్యాటరీల వ్యర్ధాల పరిమాణాన్ని, రీసైక్లింగ్ / రిఫర్బరిష్‌మెంట్ తర్వాత ఉత్పత్తి అయ్యే ప్రమాదకర & ఘన వ్యర్ధాలు లేక ప్లాస్టిక్ వ్యర్ధాల పరిమాణాన్ని, దాని విసర్జన పరిమాణానికి సంబంధించిన సమాచారం గురించి ప్రతి త్రైమాసికంలో, ఆ త్రైమాసిక ముగింపు తర్వాత నెలాఖరులో దాఖలు చేయాలి.
బ్యాటరీ వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, 2022 కింద సేకరించిన పర్యావరణ పరిహారాన్ని సేకరించని, రీసైకిల్ చేయని లేదా రిఫఱ్బరిష్ చేయని బ్యాటరీ వ్యర్ధాల సేకరణ, పునరుపయోగం లేదా పునరుద్ధరణ కోసం ఉపయోగించాలి. బ్యాటరీ వ్యర్ధాల నిర్వహణ కోసం నిధుల వినియోగానికి సంబంధించిన పద్ధతిని నిబంధనల కింద ఏర్పాటు చేసిన అమలు కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతుంది.
బ్యాటరీ వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు, 2022ను 22 ఆగస్టు 2022న నోటిఫై చేశారు.
ఆర్ధిక సంవత్సరం 2022-23కు సంబంధించి పొడిగించిన ఉత్పత్తిదారుల బాధ్యత కింద బాధ్యతలను నిర్వర్తించడానికి వార్షిక రిటర్నులను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 30 జూన్ 2023.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వెల్లడించారు.
***
(Release ID: 1943540)