మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ సామాజిక వర్గాల అభివృద్ధి పథకం
प्रविष्टि तिथि:
26 JUL 2023 4:04PM by PIB Hyderabad
మైనారిటీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల కోసం ప్రత్యేకంగా ఆర్ధికంగా వెనుకబడిన, సమాజంలోని అణగారిన వర్గాల వారికోసం నైపుణ్య వృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జవుళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వివిధ పథకాలను అమలుచేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ సామాజికవర్గాల ఆర్ధిక-సామాజిక మరియు విద్యా సాధికారత కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా వారికోసం వివిధ పథకాలను అమలుచేస్తోంది.
మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలు / కార్యక్రమాలు ఇవి:
(A) విద్యా సాధికారత పథకాలు
(1) మెట్రిక్ కు ముందు స్కాలర్షిప్ స్కీమ్
(2) మెట్రిక్ అనంతర స్కాలర్షిప్ స్కీమ్
(3) ప్రతిభ-మరియు-ఆర్ధికస్థితిపై ఆధారపడిన స్కాలర్షిప్ స్కీమ్
(B) ఉపాధి మరియు ఆర్ధిక సాధికారత పథకాలు
(4) ప్రధాన మంత్రి వారసత్వ వృద్ధి (PMVIKAS) పథకం
(5) జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్ధికసహాయ సంస్థ (NMDFC) ద్వారా మైనారిటీలకు స్వల్పవడ్డీ రుణాలు ఇచ్చే పథకం
(C) ప్రత్యేక పథకాలు
(6) జియో పారశీ: భారతదేశంలో పారశీల జనాభా తగ్గుదలను వెనక్కు మరలించడానికి (తగ్గుదల ఆపేందుకు) పథకం
(7) క్వామి వక్ఫ్ బోర్డు తరక్కియతి స్కీమ్ (QWBTS) మరియు షహారి వక్ఫ్ వికాస్ యోజన (SWSVY)
(D) మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలు
(8) ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమం (PMJVK)
జైన సామాజిక వర్గం వారితో సహా ఆరు ప్రకటిత మైనారిటీ సామాజికవర్గాలకు చెందిన విద్యార్థుల విద్యా సాధికారత కోసం
మంత్రిత్వశాఖ మెట్రిక్ ముందు, మెట్రిక్ అనంతర మరియు ప్రతిభ-మరియు-ఆర్ధికస్థితిపై ఆధారపడిన స్కాలర్ షిప్ పథకాలను అమలు చేస్తున్నది. ఉపకార వేతనాలు (స్కాలర్షిప్) మాత్రమే కాక జైన సామాజిక వర్గం వారితో సహా ఆరు ప్రకటిత మైనారిటీ సామాజికవర్గాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనం కోసం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSE) జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్ధికసహాయ సంస్థ (NMDFC) విద్యా రుణాల పథకాన్ని అమలు చేస్తోంది.
గరిష్టంగా ఐదేళ్లు చదివే సాంకేతిక మరియు వృత్తివిద్యా కోర్సుల కోసం ఈ పథకం కింద వడ్డీ రాయితీ (స్వల్పవడ్డీ) రుణాలు ఇస్తారు.
ఇండియాలో ఐదేళ్ల కోర్సుల కోసం ఏడాదికి ₹ 4.00 లక్షల చొప్పున ₹ 20.00 లక్షల వరకు మరియు ఐదేళ్ల కోర్సుల కోసం ఏడాదికి ₹ 6.00 లక్షల చొప్పున ₹ 30.00 లక్షల వరకు విద్యా రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో
ఈ సమాచారం తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 1943478)
आगंतुक पटल : 188