మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీలుగా ప్రకటించిన సామాజిక వర్గాలలో అణగారిన ప్రజల విద్యా మరియు ఆర్థిక సాధికారత కోసం వివిధ పథకాల అమలు ద్వారా బహుముఖ వ్యూహం
నాడు పోస్టు చేయడమైనది:
26 JUL 2023 4:06PM by PIB Hyderabad
ముస్లింలతో పాటు మైనారిటీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. నైపుణ్య వృద్ధి&వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం&సాధికారత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు వివిధ పథకాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.
దానికి తోడుగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) నోటిఫైడ్ మైనారిటీ సామాజికవర్గం లో అణగారిన వర్గాలకు విద్య, ఆర్థిక సాధికారత కోసం వివిధ పథకాల అమలు ద్వారా బహుముఖ వ్యూహాన్ని ఆమోదించింది. దుర్బర దారిద్య్రంలో ఉన్న పేదలను లక్ష్యంగా చేసుకుని MoMA ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.
మైనారిటీ సామాజిక వర్గాల తో సహా ఆర్ధికంగా బలహీన వర్గాలకు (EWS) చెందిన వారందరూ ఉద్యోగాలలో, విద్యాసంస్థల ప్రవేశాలలో 10% రిజర్వేషన్లను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు.
****
(రిలీజ్ ఐడి: 1943473)
సందర్శకుల సూచీ సంఖ్య : : 132