రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ రైల్వే నెట్ వర్క్లో 50 వందే భారత్ రైళ్లు


2024 దార్శనికత లో భాగంగా 9,910 కిలోమీటర్ల పొడవు గల ట్రాక్ అందుబాటులోకి వచ్చింది.

Posted On: 26 JUL 2023 3:42PM by PIB Hyderabad

2024 దార్శనికతలో భాగంగా 1.4.2023 నాటికి దేశవ్యాప్తంగా  మొత్తం 251 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది.( ఇందులో 76 కొత్త లైన్లు, 19 గేజ్ మార్పిడి పనులు, 156 డబ్లింగ్  పనులు ఉన్నాయి.)
వీటి మొత్తం పొడవు  29,147 కిలోమీటర్లు. దీని విలువ 4.92 లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులలో కొన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఉన్నాయి . ఇవి కొన్ని ప్రణాళిక, అనుమతి,
నిర్మాణ దశలలో ఉన్నాయి. ఇందులో 9,910 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. 2023 మార్చి నాటికి 2.45 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వశాఖ
రెండు ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను చేపడుతున్నది. అవి,
తూర్పు ప్రత్యేక సరకు రవాణాకారిడార్ (ఇడిఎఫ్సి). దీనిని లూథియానా నుంచి సోన్ నగర్ వరకు 1337 కిలోమీటర్లు చేపడుతున్నారు. మరొకటి
పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా  కారిడార్ (డబ్ల్యుడిఎఫ్సి). ఇది జవహర్లాల్ నెహ్రూ పోర్టు టెర్మిన్ (జె.ఎన్.పి.టి) నుంచి దాద్రి వరకు 1506 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటివరకు మొత్తం అనుమతించిన 2843 కిలోమీటర్ల  ప్రత్యేక సరకురవాణా కారిడార్ లో
2196 కిలోమీటర్ల పనులు(ఇడిఎఫ్సి 1150 కిలోమీటర్లు, డబ్ల్యుడిఎఫ్సి 1046 కిలోమీటర్లు) పూర్తి అయ్యాయి.రైళ్ల వేగం పెంచడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. భారతీయ రైల్వేలో  ఇందుకోసం కృషి కొనసాగుతుంటుంది. భారతీయ రైల్వే రైళ్ల టైంటేబుల్ ను శాస్త్రీయ పద్ధతిలో హేతుబద్దీకరించేందుకు ఐఐటి బొంబాయి సహకారంతో

చర్యలు చేపట్టింది. దీనికి తోడు కొన్ని  పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ సర్వీసులుగా , కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్ రైళ్లుగా మార్చి వాటి వేగం పెంచింది. దీనికి తోడు, భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది.
ఇవి అత్యధిక వేగ సామర్ధ్యం కలిగి ఉంటాయి. 2023 జూలై 21 నాటికి , ఐఆర్.నెట్ వర్క్లో 50 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ , ముంబాయి – అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఎ.హెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు
ను జపాన్ ప్రభుత్వ సాంకేతిక సహకారం, ఆర్థిక సహాయంతో చేపట్టడం జరిగింది.
 హై స్పీడ్  రైల్ నెట్వర్క్కు సంబంధించి భవిష్యత్లో అభివృద్ధి చేయడానికి వీలున్న మార్గాలను నేషనల్ రైల్ ప్లాన్ గుర్తించింది. అవి
1) ఢిల్లీ –  వారణాశి
2) ఢిల్లీ – అహ్మదాబాద్
3) ముంబాయి – నాగపూర్
4)ముంబాయి – హైదరాబాద్
5) చెన్నై – మైసూరు
6) ఢిల్లీ– అమృత్సర్
7) వారణాశి – హౌరా
కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్సభకు  ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.

 

***


(Release ID: 1943125)
Read this release in: English , Urdu , Tamil