మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నానాటికీ పెరుగుతున్న భారతదేశ అభివృద్ధి అవసరాలను పరిష్కరించడం ,
సంపూర్ణ అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ఎన్.ఇ.పి 2020 లక్ష్యం: ప్రొఫెసర్ బి.ఎస్. సహాయ్
ఎన్.ఇ.పి ఒక అద్భుత డాక్యుమెంట్, ఇది సమగ్ర విద్యను, అందుబాటులో ఉండేలా , సమానంగా , చవకగా అందేలా చూస్తుంది.: ప్రొఫెసర్ మనోజ్ సింగ్ గౌర్
Posted On:
26 JUL 2023 4:13PM by PIB Hyderabad
జమ్ము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) డైరక్టర్ , ప్రొఫెసర్ బి.ఎస్. సహాయ్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం 2020 దేశంలో నానాటికీ పెరుగుతున్న ఎన్నో అభివృద్ధి అవసరాలకు పరిష్కారం చూపుతున్నదని,
అలాగే, ఇది సంపూర్ణ అభ్యసన వాతావరణాన్ని కల్పిస్తున్నదని అన్నారు. జమ్ము లోని ఐఐఎం పాత క్యాంపస్లో , జరిగిన సమావేశంలో ఎన్.ఇ.పి 2020 అమలులో వ్యూహాత్మక కార్యాచరణ గురించి మీడియా తో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.
ఈ సమావేశానికి జమ్ము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) డైరక్టర్ ప్రొఫెసర్ మనోజ్ సింగ్ గౌర్ , కెవి జమ్ము అసిస్టెంట్ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్, జమ్ము కాశ్మీర్ పిఐబి జాయింట్ డైరక్టర్, సిబిసి జమ్ముకాశ్మీర్, లద్దాక్
శ్రీ జిహెచ్. అబ్బాస్, దూరదర్శన్ అసిస్టెంట్ డైరక్టర్ శ్రీ వివేక్ పాఠక్, పిఐబి జమ్ము మీడియా , కమ్యూనికేషన్స్ ఆఫీసర్ షేక్ ముదాసిర్ అమిన్ లు హాజరయ్యారు.ఎన్.ఇ.పి 2020 కింద, విద్యార్దులు తమకు నచ్చిన సబ్జెక్టులు ఎంచుకునేందుకు వీలు ఉందని,దీని ద్వారా సంపూర్ణ, సమగ్ర వ్యక్తులుగా , 21 శతాబ్దపు అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుందని ప్రొఫెసర్
సహాయ్ అన్నారు. ఎన్.ఇ.పి 2020 21 వ శతాబ్దపు ఆకాంక్షిత లక్ష్యాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థను ఏర్పరుస్తుందని, ఇది ప్రతి వ్యక్తి సృజనాత్మక వికాసానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
ప్రతిష్ఠాత్మక మూడు సంస్థలు ఒకే చోట కలిగిన ప్రాంతం జమ్ము అని అంటూ ప్రొఫెసర్ సహాయ్, దీని వల్ల ఆయా విద్యాసంస్థల మధ్య అనుసంధానతతో, ఎన్.ఇ.పి 2020 కి అనుగుణంగా ఐఐటి జమ్ములో డ్యూయల్ డిగ్రీ (బిటెక్, ఎంబిఎ),
ఐఐటి జమ్ము, ఎయిమ్స్ జమ్ము ఎం.బి.ఎ హెల్త్కేర్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, గుర్గాం లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సంస్థ ద్వారా కార్పొరేట్ అఫైర్స్, మేనేజ్మెంట్ లో ఎం.బి.ఎ ప్రారంభించడానికి వీలుకలిగిందన్నారు.
ఇండియన్ ఇన్స్టిట్టూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) జమ్ము డైరక్టర్ శ్రీ మనోజ్ సింగ్ గౌర్ మీడియా తో మాట్లాడుతూ, ఎన్.ఇ.పి 2020 ఒక అద్భుత, సమగ్ర డాక్యుమెంట్ అని అన్నారు. ఇది సమగ్ర విద్యకు దోహదపడుతుందని, చవకగా, అందరికీ సమానం గా విద్య అందుబాటులో ఉండేట్టు చూస్తుందని అన్నారు.
ఎన్.ఇ.పి 2020 రూపకల్పనతో విద్యార్థులకు అనువైన రీతిలో వారు కోరిన సబ్జెక్టులు ఎంపిక చేసే అవకాశం లభించినట్టు తెలిపారు. బిటెక్ ల 6 సెమిస్టర్లు పూర్తి చేసిన ఎవరైనా బిటెక్ విద్యార్థి తగిన విద్యార్హతతో
జమ్ము ఐఐటిలొ చేరి చివరి రెండు సెమిస్టర్లు పూర్తి చేయవచ్చని తెలిపారు. దీనిని ఎన్సిఆర్ఎఫ్ (నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్) అకడమిక్ బ్యాంక్ క్రెడిట్ (ఎబిసి) విధానం ద్వారా చేపడుతున్నట్టు చెప్పారు.ఎబిసి అనేది డిజిటల్ లేదా వర్చువల్ లేదా ఆన్లైన్ ద్వారా అకడమిక్ క్రెడిట్లను భద్రపరిచే వ్యవస్థ. ఇది ఉన్నత విద్యా సంస్థలలో అభ్యసన కేంద్రిత విద్య, నిరంతరాయంగా అభ్యాసకులు
ఎక్కడి నుంచి అయినా విద్యను పొందేందుకు వీలు కల్పిస్తుందని చెప్పారు. జమ్ము ఐఐటిలో గల అత్యావస్యక నైపుణ్యాల కేంద్రం, జమ్ము ఐఐటి కి వెలుపలి ప్రాంతాలనుంచి వచ్చే వారికి ఫైనాన్స్, టెక్నాలజీ,
సాఫ్ట్ స్కిల్స్, భాష, జీవన నైపుణ్యాలు లాంటివి నేర్పిస్తారఉ. ఈ అత్యావస్యక నైపుణ్యాల కేంద్రం ద్వారా ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా వివిధ ప్రాంతాల విద్యార్థులు ప్రయోజనం పొందారు.ఎన్.ఇ.పి 2020 దార్శనికతకు అనుగుణంగా శరద్ సరాఫ్ సెంటర్ ఫర్ ఆయుర్వేద, ఇండిక్ స్టడీస్ను ఏర్పాటు చేసినట్టు ప్రొఫెసర్ గౌర్ తెలిపారు. బోధన, శిక్షణ,పరిశోధన, సమన్వయం, అవగాహన కార్యక్రమాల ద్వారా
భారతీయ విజ్ఞాన వ్యవస్థలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది భారతీయ జ్ఞాన సంపదను కాపాడడానికి వీలుకల్పిస్తుందని కూడా ఆయన తెలిపారు.
***
(Release ID: 1943124)