రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రేపు న్యూఢిల్లీలో"భారతదేశంలో గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా "3వ సదస్సు
Posted On:
26 JUL 2023 2:43PM by PIB Hyderabad
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సహకారంతో " గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా " (GCPMH 2023)పై 3వ సదస్సుని జూలై 27 నుంచి 223 వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో నిర్వహిస్తోంది.
రెండు రోజుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రేపు ప్రారంభిస్తారు. సదస్సులో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల సీనియర్ అధికారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు , రసాయనాలు, పెట్రో కెమికల్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
28న జరిగే సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రసంగిస్తారు. రసాయనాలు, ఎరువులు,నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కూడా ముగింపు సమావేశంలో పాల్గొంటారు.
సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు. ' ఎఫ్టీఏ- ప్రపంచాన్ని అనుసంధానం చేయడం- వసుదైక కుటుంబం: ఒక భూమి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు" అనే అంశంపై నిర్వహించే సదస్సులో కేంద్ర వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
సదస్సు 2వ రోజున ' పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సీపీసీ పరిశ్రమలో వినూత్న అంశాలు' పై జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొంటారు.
భారత రసాయనాలు , పెట్రోకెమికల్స్ రంగంలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు, ఎదురవుతున్న సమస్యలు, సమస్యలు పరిష్కరించి అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలపై సదస్సులో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులు పాల్గొని చర్చలు జరుపుతారు. పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే వ్యూహాలను సిద్ధం చేసి, తమ అనుభవాలను ప్రతినిధులు పంచుకుంటారు. నూతన అవకాశాలు గుర్తించి రాబోయే దశాబ్దంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కెమికల్స్,పెట్రోకెమికల్స్ పరిశ్రమ రంగం అభివృద్ధికి సదస్సులో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.
దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో భారత రసాయనాలు , పెట్రోకెమికల్స్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే రసాయన పరిశ్రమకు భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి.ప్రజల కనీస ప్రాథమిక అవసరాలు తీర్చడం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో రసాయన పరిశ్రమకీలకంగా ఉంటుంది. దేశ పారిశ్రామిక, వ్యవసాయ రంగం అభివృద్ధిలో రసాయన పరిశ్రమ పాత్ర ఎక్కువగా ఉంటుంది. అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా రసాయన పరిశ్రమ సహకారం అందిస్తోంది. భారతదేశ రసాయనాలు, పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
భారతదేశాన్నిరసాయనాలు, పెట్రోకెమికల్ రంగంలో ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్ మంత్రిత్వ శాఖ 2019 నుండి ద్వైవార్షిక "గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్" (GCPMH) సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.
****
(Release ID: 1943123)
Visitor Counter : 94