రక్షణ మంత్రిత్వ శాఖ
కాన్‌బెరాలో 8వ భారత్- ఆస్ట్రేలియా రక్షణ విధాన చర్చల నిర్వహణ
Posted On:
26 JUL 2023 3:49PM by PIB Hyderabad
8వ భారత్- ఆస్ట్రేలియా రక్షణ విధాన చర్చలు (డిపిటి)ను 24-25 జులై 2023న ఆస్ట్రేలియాలోని కాన్‌బెరాలో నిర్వహించారు. రక్షణ విధాన చర్చలకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సలహాదారు శ్రీమతి నివేదిత శుక్లా వర్మ, రక్షణ శాఖ తాత్కాలిక డిప్యూటీ కార్యదర్శి స్టీవెన్ మూర్ కలిసి అధ్యక్షత వహించారు.
రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు పక్షాలూ కూడా రెండు దేశాల మధ్య గల ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని సమీక్షించి, ద్వైపాక్షిక రక్షణ కార్యకలాపాలను మరింత వృద్ధి చేసేందుకు, బలోపేతం చేసేందుకు నూతన చొరవలను అన్వేషించారు. రక్షణ పరికరాల సహ అభివృద్ధి, సహ ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మార్గాలను గుర్తించడంపై చర్చలు దృష్టి పెట్టాయి. పరస్పర విశ్వాసం, అవగాహన, సాధారణ ప్రయోజనాలు, న్యాయపాలన, ప్రజాస్వామిక, పంచకున్న విలువల ఆధారంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు తమ నిబద్ధతను ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి. నౌకా నిర్మాణం, నిర్వహణ ప్రణాళికలలో ఆస్ట్రేలియా సాయుధ దళాలకు సహకరించే సామర్ధ్యాన్ని, యోగ్యతను భారతీయ రక్షణ పరిశ్రమ కలిగి ఉన్న సంభావ్యతను భారతీయ పక్షం పట్టి చూపింది.
భారత్- ఆస్ట్రేలియాలు 2020 జూన్ నుంచి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ భాగస్వామ్యానికి రక్షణ అన్నది కీలక స్తంభం. భారత్, ఆస్ట్రేలియా భాగస్వామ్యం స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, సమ్మిళిత, సుసంపన్న ఇండో -పసిఫిక్ ప్రాంతపు భాగస్వామ్య దార్శనికతపై ఆధారపడి ఉంది. ఇరుదేశాలూ మంత్రిత్వ స్థాయిలో 2+2 మెకానిజంను కలిగి ఉన్నాయి. 8వ డిపిటి సెప్టెంబర్ 2021లో నిర్వహించిన తొలి 2+2 ఫలితాలను సమీక్షించింది. భూజలాధ్యయన (హైడ్రోగ్రాఫీ) ఒప్పందాన్ని త్వరితగతిన ఖరారు చేసేందుకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. ఇరు పక్షాల ప్రయోజనాలకు సంబంధించిన భౌగోళిక- రాజకీయ పరిస్థితిని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయి.
***
(Release ID: 1943101)
Visitor Counter : 158