రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24లో వందే భారత్ రైళ్ల మొత్తం వినియోగం 99.60%

प्रविष्टि तिथि: 26 JUL 2023 3:38PM by PIB Hyderabad

ఏ సి చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో వసతి ని అత్యధిక వినియోగం చేయడానికి,  బేసిక్ ఛార్జీలో గరిష్టంగా 25% వరకు తగ్గించడానికి జోనల్ రైల్వేలకు అధికారాన్ని అప్పగించారు.

రైళ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వేలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి

వసతి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి (27.8.2019 తేదీ నాటి వాణిజ్య సర్క్యులర్ నం. 40, 2019 ప్రకారం) ఏ సీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో గరిష్టంగా 25% వరకు బేసిక్ ఛార్జీలను తగ్గించడానికి జోనల్ రైల్వేలకు అధికారం అప్పగించబడింది. ఈ ప్రాంతంలోని అన్ని పోటీ మోడ్‌ల  ప్రయాణ ధోరణులను విశ్లేషించిన తర్వాత మరియు భవిష్యత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాత కొన్ని విభాగాలపై పోటీ ధరలను అందించడానికి  జోనల్ రైల్వేలకు అధికారం ఇచ్చింది.

అదే నిబంధనలు కొన్ని చిన్న మార్పులతో పొడిగించబడ్డాయి (2023 యొక్క వాణిజ్య సర్క్యులర్ నం. 11, తేదీ 8.7.2023). అలాగే రైళ్లలో ప్రయాణ వసతి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఛార్జీల హేతుబద్ధీకరణ అనేది నిరంతర ప్రక్రియ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 (జూన్ 2023 వరకు) లో వందే భారత్ రైళ్ల మొత్తం వినియోగం 99.60%.

కార్యాచరణ వ్యయం ట్రాక్షన్ శక్తి ఖర్చు మరియు ట్రాక్షన్ శక్తి వినియోగంతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైళ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వేలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. వందే భారత్ రేక్‌లు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను దాని ప్రధాన డిజైన్ ఫీచర్‌గా ఉన్నాయి, ఇది బ్రేకింగ్ శక్తిని ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE)కి తిరిగి అందిస్తుంది మరియు తద్వారా ట్రాక్షన్ శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది.

రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(रिलीज़ आईडी: 1943083) आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , English , Urdu