వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2023-24 5వ ఇ-వేలంలో అమ్ముడైన 1.06 ఎల్‌ఎంటి గోధుమలు మరియు 100 ఎంటి బియ్యం
కేంద్రం యొక్క మార్కెట్ జోక్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఉంది
प्रविष्टि तिथि:
26 JUL 2023 6:42PM by PIB Hyderabad
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) ఈరోజు గోధుమలు మరియు బియ్యాన్ని విక్రయించడానికి 2023-24 5వ ఇ వేలాన్ని నిర్వహించింది. ఈ-వేలంలో 1.06 ఎల్‌ఎంటి గోధుమలు, 100 మెట్రిక్ టన్నుల బియ్యం అమ్ముడయ్యాయి.
బియ్యం, గోధుమలు, ఆటా రిటైల్ ధరలను నియంత్రించేందుకు ప్రతి వారం ఈ వేలం నిర్వహిస్తున్నారు. ధరల స్థిరీకరణకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది మరియు దాని మార్కెట్ జోక్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఉంది.
361 డిపోల నుండి 1.16 ఎల్‌ఎంటి గోధుమలు మరియు 178 డిపోల నుండి 1.46 ఎల్‌ఎంటి బియ్యం దేశవ్యాప్తంగా అందించబడ్డాయి.
వెయిటెడ్ సగటు అమ్మకపు ధర గోధుమలకు రూ. 2182.68/క్విటాల్‌గా ఉంది. పాన్ ఇండియా రిజర్వ్ ధర రూ. 2150/క్విటాల్‌గా ఉంది. అయితే యూఆర్‌ఎస్ గోధుమ సగటు అమ్మకపు ధర రూ. 2173.85/క్వింటాల్ కాగా రిజర్వ్ ధర రూ. 2125/క్వింటాల్‌గా ఉంది.
బియ్యానికి వెయిటెడ్ సగటు అమ్మకపు ధర రూ. 3151.10/క్వింటాల్ కాగా పాన్ ఇండియా రిజర్వ్ ధర రూ. 3151.10/క్వింటాల్.
ఇ-వేలం ప్రస్తుత విడతలో గోధుమలకు కొనుగోలుదారునికి గరిష్టంగా 100 టన్నులు మరియు బియ్యానికి 1000 టన్నుల వరకు అందించడం ద్వారా రిటైల్ ధర తగ్గింపు లక్ష్యంగా ఉంది. ఈ నిర్ణయం చిన్న మరియు తుది వినియోగదారులను ప్రోత్సహించడం మరియు ఎక్కువ మంది పాల్గొనేవారు ముందుకు వచ్చి వారి ఎంపిక డిపో నుండి పరిమాణానికి వేలం వేయగలరని నిర్ధారించడం లక్ష్యంగా ఉంది.
*****
(रिलीज़ आईडी: 1943080)
आगंतुक पटल : 153