సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వృద్ధులకు సామాజిక భద్రత
Posted On:
25 JUL 2023 5:10PM by PIB Hyderabad
జనాభా లెక్కల నివేదిక-2011 ప్రకారం సీనియర్ సిటిజన్ల జనాభా 10.38 కోట్లు, ఇది దేశ మొత్తం జనాభాలో 8.6%. జూలై 2020లో విడుదలైన భారతదేశం, జనాభా అంచనాలపై సాంకేతిక బృందం (2011-2036), కేంద్ర ప్రభుత్వ జాతీయ కమీషన్, 2036లో సీనియర్ సిటిజన్ల జనాభా 22.7 కోట్ల మంది ఉంటుందని పేర్కొంది. భారతదేశం మొత్తం జనాభాలో ఇది 15%.
సామజిక న్యాయం, సాధికారత శాఖ నిర్వహించే అటల్ వయో అభ్యుదయ యోజన (ఏవివైఏఎన్) అనే సంరక్షణ పథకం సీనియర్ సిటిజన్‌లకు ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, ఆశ్రయం, సంక్షేమం మొదలైన వాటిని అందించే భాగాలను కలిగి ఉంటుంది. అటువంటి కాంపోనెంట్‌లలో ఒకదాని క్రింద, అంటే వయోవృద్ధుల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ (ఐపిఎస్ఆర్సి), నిరుపేద వృద్ధులకు ఆశ్రయం, ఆహారం, వైద్యం, వినోద అవకాశాలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలు ఉచితంగా అందించేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. దీనిలో సీనియర్ సిటిజన్‌ల గృహాల నిర్వహణను అమలు చేసే ఏజెన్సీలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందిస్తారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్వివై) కింద, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన లేదా రూ. 15000/- నెలవారీ ఆదాయం ఉన్న వారు, వయస్సు సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి తగిన సహాయ పరికరాలు అందజేస్తారు. సీనియర్ సిటిజన్‌ల కోసం ఎల్డర్‌లైన్/నేషనల్ హెల్ప్‌లైన్ (ఎన్హెచ్ఎస్సి) ఉచిత సమాచారం, మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు, వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడంతో వారి ఇబ్బందికర పరిస్థితులపుడు కూడా ఆదుకునేలా సేవలందిస్తారు.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపి) ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఐజిఎన్ఓఏపిఎస్) కింద, భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి నిధులతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం, ప్రతి నెలా రూ.200/- చొప్పున పెన్షన్ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కుటుంబాలకు చెందిన 60-79 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు ఒక్కో లబ్ధిదారునికి నెల చొప్పున చెల్లిస్తున్నారు. 80 ఏళ్లు నిండిన ప్రతి లబ్ధిదారునికి నెలకు రూ.500/- చొప్పున పెన్షన్ రేటు పెంచుతారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయానికి కనీసం సమానమైన మొత్తాన్ని టాప్ అప్ మొత్తాలను అందించాలని ప్రోత్సహించడం ద్వారా లబ్ధిదారులు తగిన స్థాయిలో సహాయం పొందవచ్చు. ప్రస్తుతం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ఎస్ఏపికి సంబంధించిన ఐజిఎన్ఓఏపిఎస్ కింద ఒక్కో లబ్ధిదారునికి నెలకు రూ.50/- నుండి రూ.3000/- వరకు టాప్ అప్ మొత్తాలను జోడిస్తున్నాయి. ఎన్ఎస్ఏపి పెన్షన్ స్కీమ్‌ల కింద రాష్ట్రం/కేంద్ర పాలిత పరిమితి కంటే ఎక్కువ అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నట్లయితే, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్వంత వనరుల నుండి పెన్షన్‌ను అందించే అవకాశం కలిగి ఉంటాయి.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భూమిక్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1943039)
Visitor Counter : 148