పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎంయువై


2022-23 ఆర్థిక సంవత్సరంలో 3.01 నుంచి 3.71కి పెరిగిన తలసరి వినియోగం

2022-23 లో 16 కోట్ల నుంచి 35 కోట్లకు పెరిగిన పీఎంయువై లబ్ధిదారుల రీఫిల్‌లు

ప్రవర్తనా మార్పుల కోసం ఎల్పీజీ పంచాయతీలు, పబ్లిక్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా కృషి చేస్తున్న చమురు ఉత్పత్తి సంస్థలు

Posted On: 25 JUL 2023 6:27PM by PIB Hyderabad

సాంప్రదాయ ఇంధన వాడకం వల్ల ఎదురయ్యే ఆరోగ్యసమస్యల నుంచి ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించి  పర్యావరణ హిత స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడానికి ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పథకం ద్వారా కృషి జరుగుతోంది. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బార్ లో ప్రారంభించారు.   

 2020-21 ఆర్థిక సంవత్సరంలో   ప్రపంచం మొత్తం కోవిడ్ బారిన పడింది. ఈ సమయంలో  పీఎంయువై  పరిధిలోకి వచ్చే అత్యంత పేద వర్గాలకు చెందిన  కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా పీఎంజికెపి కింద ప్రతి పీఎంయువై కుటుంబానికి ఉచితంగా మూడు  రీఫిల్‌లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు పథకం కింద  లబ్ధిదారులకు ప్రభుత్వం మొత్తం 14.17 కోట్ల రీఫిల్‌లు ఉచితంగా సరఫరా చేసింది. 

 2019-20 కి ముందు సమాచారాన్ని పరిశీలిస్తే తలసరి వినియోగంలో పెరుగుదల కనిపించింది.  2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి వినియోగం  3.01 నుంచి 3.71కి పెరిగింది.

పీఎంయువై పరిధిలోకి పేద కుటుంబాలలో అత్యంత కుటుంబాలు వస్తాయి. .పేద గృహాలకు ప్రధానమైన స్వచ్ఛమైన  ఎల్పీజీని అందుబాటులోకి తెచ్చేందుకు 2016 మే నెలలో ప్రభుత్వం  పీఎంయువై పథకాన్ని  ప్రారంభించింది. పరిశుద్ధ ఇంధన వనరు అయిన ఎల్పీజీ వినియోగం ఎక్కువ చేసేలా చూసేందుకు ప్రజల ప్రవటంలో మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతోంది. 

భారతదేశం వంటి ప్రజాస్వామ్యదేశంలో ప్రజల  ప్రవర్తనలో  మార్పు తీసుకు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనికి  నిరంతర కృషి అవసరం.కాలుష్య రహిత జీవితాన్ని పేద వర్గాలకు చెందిన ప్రజలను ప్రోత్సహించే దిశలో మొదటి అడుగుగా  పీఎంయువై పరిధిలోకి వచ్చే లక్షలాది పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ  కనెక్షన్‌ని అందించడం ద్వారా తొలి ప్రయత్నం విజయవంతం అయ్యింది. పేద వర్గాలకు చెందిన ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకు రావడానికి చమురు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎల్పీజీ    పంచాయతీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవర్తనలో  మార్పు తీసుకు రావడం కోసం కృషి చేస్తున్నాయి. 

పీఎంయువై పరిధిలోకి వచ్చే 88% పేద కుటుంబాలు 2022-23లో రీఫిల్‌లను తీసుకున్నాయి.  రీఫిల్‌లు తీసుకున్న  లబ్ధిదారుల సంఖ్య 2017-18లో 3 కోట్ల వరకు ఉంది. ఈ సంఖ్య  2018-19లో 6 కోట్లకు, 2019-20లో 6.5 కోట్లకు , 2020-21లో 8 కోట్లకు, 2021-22 లో 8.05 కోట్లకు, 2022-23 లో 8.41 కోట్లకు పెరిగింది.

అంతేకాకుండా గత ఐదేళ్లలో పీఎంయువై  వినియోగదారుల తలసరి వినియోగం 24% వృద్ధిని నమోదు చేసింది.  పథకం అమలు వల్ల ఆశించిన ఫలితం కనిపించిందని గణాంకాలు చెబుతున్నాయి.

పీఎంయువై లబ్ధిదారులు తీసుకున్న మొత్తం రీఫిల్‌లు 2018-19లో 16 కోట్ల నుంచి 2022-23 లో 35 కోట్లకు పెరిగాయి.  అపరిశుభ్రమైన వంటశాల కష్టాల నుంచి బయటపడి  ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు వేయడానికి పీఎంయువై ద్వారా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. 

***


(Release ID: 1943024)
Read this release in: English , Urdu , Hindi