సహకార మంత్రిత్వ శాఖ
సహకార సంస్థలకు పరిశ్రమ-అకాడెమియా అనుసంధానం
प्रविष्टि तिथि:
25 JUL 2023 2:36PM by PIB Hyderabad
సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్.సి.సి.టి. (నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్) నిర్వహిస్తున్న వివిధ శిక్షణ, అవగాహన, ఇతర విద్యా కార్యక్రమాలలో ఆయా రంగాల నిపుణులు మరియు అభ్యాసకుల నిరంతర నిమగ్నత ద్వారా సహకార సంఘాలకు పరిశ్రమ-విద్యాపరమైన అనుసంధానాలు నిర్ధారిస్తాయి. ఎన్.సి.సి.టి. యొక్క 19 ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూట్లలో ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) యొక్క సంస్థాగత యంత్రాంగం ద్వారా శిక్షణా కార్యక్రమాలలో పరిశ్రమ-అకాడెమియా అనుసంధానం నిర్మించబడింది. పీఏసీకి సంబంధిత రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నేతృత్వం వహిస్తారు. పీఏసీలోని ఇతర సభ్యులుగా రాష్ట్ర సహకార సంఘాలు/సమాఖ్యల ముఖ్య కార్యనిర్వాహకులు, పరిశ్రమల డైరెక్టర్లు, చేనేత, మత్స్య, సంబంధిత రాష్ట్ర వ్యవసాయం, పరిశ్రమ రంగ నిపుణులు మొదలైనవారు ఉంటారు. దీనికి తోడు పరిశ్రమ/ఆయా రంగాల నిపుణులతో సెమినార్‌లు/ వెబినార్‌లు, అభ్యాసకుల నుండి ఉపన్యాసాలు, పరిశ్రమల ఎక్స్‌పోజర్ సందర్శనలు, ఇంటర్న్షిప్లు కూడా సహకార రంగంలో పరిశ్రమ-అకడమిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా నిర్వహించబడతాయి. నాబార్డ్ వారి సహకారంతో ఎన్సీసీటీ సాఫ్ట్కాబ్ పథకంను (సహకార బ్యాంకుల సిబ్బందికి శిక్షణ కోసం ఆర్థిక సహాయం పథకం) అమలు చేస్తోంది. 2020-21 మరియు 2022-23 మధ్య కాలంలో 690 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించబడ్డాయి. ఇందులో 20,955 మంది పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా పాల్గొన్నవారు రైతులు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పీఏసీలు) మరియు ఇతర ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా ఈ చర్య దోహదం చేస్తోంది. అంతేకాకుండా, ఎన్సీసీటీ గ్రామీణ ప్రాంతాల్లోని 1,61,043 మంది రైతులకు 2020-21 మరియు 2022-23 మధ్య 2342 శిక్షణ/అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ఈ విషయాన్ని సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(रिलीज़ आईडी: 1942651)
आगंतुक पटल : 168