ఆర్థిక మంత్రిత్వ శాఖ
రిజర్వు బ్యాంకు ద్వారా ₹2000 నోట్ల ఉపసంహరణ
Posted On:
25 JUL 2023 5:42PM by PIB Hyderabad
దేశంలో 2016 నవంబరు 10న భారత రిజర్వు బ్యాంకు ₹2,000 నోట్లను ప్రవేశపెట్టింది. అప్పట్లో ₹1,000, ₹500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన నేపథ్యంలో కరెన్సీ నోట్ల డిమాండ్‌కు అనుగుణంగా రిజర్వు బ్యాంకు చట్టం-1934లోని సెక్షన్ 24(1) కింద ₹2,000 నోట్లను జారీచేసింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.
ఈ మేరకు మంత్రి 19.05.2023 నాటి రిజర్వు బ్యాంకు పత్రికా ప్రకటనను (https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=55707) ఉటంకించారు. తదనుగుణంగా కొత్త నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చి నెలకు ముందు వరకూ 4-5 ఏళ్లపాటు చలామణీలో ఉండేవిధంగా జారీచేసినట్లు ఆర్‌బిఐ తెలిపిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆర్‌బిఐ తాజా అధ్యయనంలో ₹2000 నోట్ల వాడకానికి ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడంలేదని తేలిందన్నారు. అదే సమయంలో ప్రజల అవసరాలకు ప్రస్తుతం చలామణీలోగల ఇతరత్రా నోట్ల నిల్వలు సరిపోతాయని మంత్రి వివరించారు. పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా, ఆర్‌బిఐ “పరిశుభ్ర నోట్ల విధానం” ప్రకారం ₹2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించాలని ఆర్‌బిఐ నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ఆర్‌బిఐ ప్రకటన మేరకు- 2016 నుంచి 2023 వరకూ ప్రతి సంవత్సరం మార్చి చివరి నాటికి చలామణీలోగల ₹2000 నోట్ల (పరిమాణం-విలువ) కింది విధంగా ఉంది:
2016 నుంచి చలామణీలోగల ₹2000 నోట్లు
|
సంవత్సరం
|
పరిమాణం (నోట్ల సంఖ్య.. కోట్లలో)
|
విలువ (₹కోట్లలో)
|
2016
|
-
|
-
|
2017
|
329
|
6,57,063
|
2018
|
336
|
6,72,642
|
2019
|
329
|
6,58,199
|
2020
|
274
|
5,47,952
|
2021
|
245
|
4,90,195
|
2022
|
214
|
4,28,394
|
2023
|
181
|
3,62,220
|
రిజర్వు బ్యాంకు ప్రకటన మేరకు చలామణీలోని ₹2000 నోట్ల పరిమాణం, విలువ… ఉపసంహరణ తర్వాత ‘ఆర్‌బిఐ’కి చేరిన నోట్లపై మంత్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి:
₹2,000
|
పరిమాణం (సంఖ్య.. కోట్లలో)
|
విలువ (₹లక్షల కోట్లలో)
|
2023 మే 19 నాటికి చలామణీ
|
177.93
|
3.56
|
2023 జూన్ 30 నాటికి చలామణీ
|
41.80
|
0.84
|
2023 మే 19నుంచి జూన్ 30దాకా
చలామణీనుంచి తిరిగొచ్చిన నోట్లు
|
136.13
|
2.72
|
ఆర్‌బిఐ.. వాణిజ్య బ్యాంకుల నివేదన మేరకు ‘మొత్తం డిపాజిట్ల బకాయి’.. ‘స్థూల రుణాలు-అడ్వాన్సు బకాయిల’ సమాచారం కింది విధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు:
తేదీ
నాటికి
|
మొత్తం డిపాజిట్ల బకాయిలు
|
మొత్తం స్థూల రుణాలు-అడ్వాన్సు బకాయిలు
|
విలువ
(₹ కోట్లలో)
|
వృద్ధి ఏటా
(శాతాల్లో)
|
విలువ
(₹ కోట్లలో)
|
వృద్ధి ఏటా
(శాతాల్లో)
|
2022 మార్చి 31 నాటికి
|
1,71,72,755
|
10.17
|
1,27,50,006
|
11.85
|
2022 జూన్ 30 నాటికి
|
1,71,77,836
|
10.05
|
1,30,94,857
|
15.53
|
2022 సెప్టెంబరు 30 నాటికి
|
1,77,42,610
|
10.84
|
1,36,92,970
|
18.63
|
2022 డిసెంబరు 31 నాటికి
|
1,81,43,432
|
11.27
|
1,41,30,450
|
16.77
|
2023 మార్చి 31 నాటికి
|
1,90,56,113
|
10.97
|
1,47,57,129
|
15.74
|
*****
(Release ID: 1942641)
|