హోం మంత్రిత్వ శాఖ
జమ్ము&కశ్మీర్‌లో చొరబాట్లు
Posted On:
25 JUL 2023 4:54PM by PIB Hyderabad
భారతదేశ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నివారించడానికి భారత ప్రభుత్వం మంచి సమన్వయంతో కూడిన, బహుముఖ వ్యూహాన్ని అవలంబించింది. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)/నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద బలగాల వ్యూహాత్మక మోహరింపు; నిఘా కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు, హీట్ సెన్సింగ్ పరికరాలు మొదలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం; ఐబీ/ఎల్‌వోసీ వెంబడి బహుళ స్థాయుల్లో మోహరింపులు; సరిహద్దుల్లో కంచెలు; చొరబాట్లపై ముందస్తు సమాచారం సేకరించేందుకు నిఘా సిబ్బందిని నియమించడం; సైనిక/సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్) ద్వారా ఆకస్మిక దాడులు, కాలి నడక పహారా; స్థానికంగా నిఘా పెంచడానికి, చొరబాటుదార్లపై వేగంగా చర్యలు తీసుకోవడానికి సరిహద్దు పోలీసు కేంద్రాల ఏర్పాటు వంటివి ఈ వ్యూహంలో భాగం.
భారత ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల సరిహద్దుల వెంబడి చొరబాట్లు గణనీయంగా తగ్గాయి. సంవత్సరం వారీగా ఆ వివరాలు ఇవి:
సంవత్సరం
|
2019
|
2020
|
2021
|
2022
|
2023 (జూన్ 30 వరకు)
|
నికర చొరబాట్లు
|
141
|
51
|
34
|
14
|
00
|
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1942636)
Visitor Counter : 76