పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో మూడు విమాన శిక్షణా అకాడమీలను ప్రారంభించిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా

Posted On: 25 JUL 2023 5:11PM by PIB Hyderabad

* త్వరలో ఖజురహో,  వారణాసి మధ్య విమాన సర్వీసు ప్రారంభం : సింధియా

* రెండు అకాడమీలు ఫిక్సడ్ వింగ్ ఎఫ్‌టీఓలు,  ఒకటి హెలికాప్టర్ ఎఫ్‌టీఓ

* కొత్తగా ప్రారంభించిన ఎఫ్‌టీఓ లతో  మధ్యప్రదేశ్‌లో ఆరుకు చేరిన ఎఫ్‌టీఓల సంఖ్య 

--

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈరోజు మూడు విమాన శిక్షణా సంస్థలను (ఎఫ్‌టీఓ) కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ప్రారంభించారు.

ఖజురహోలో కొత్తగా  మూడు ఎఫ్‌టీఓ ఏర్పాటు కావడంతో  మధ్యప్రదేశ్‌లో పని చేస్తున్న ఎఫ్‌టీఓల  సంఖ్య ఆరుకు చేరింది.  వీటిలో మూడు ఎఫ్‌టీఓలు ఖజురహోలో, ఒక ఎఫ్‌టీఓ ఇండోర్‌, ఒక ఎఫ్‌టీఓ సాగర్‌లో మరో ఎఫ్‌టీఓ  గుణలో పనిచేస్తున్నాయి. విమానయాన రంగంలో  పైలట్‌లకు శిక్షణ ఇవ్వడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. 

ఖజురహో- వారణాసి మధ్య త్వరలో పెద్ద తరహా విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రకటించారు.

 "ఖజురహోకు  గొప్ప సంస్కృతి వారసత్వం ఉంది,  ఖజురహోకు విమాన సర్వీసు కల్పించాలని నిర్ణయించాం' అని మంత్రి తెలిపారు.  

“గత తొమ్మిదేళ్ల కాలంలో  విమానయాన రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. తొమ్మిది హెలిపోర్ట్‌లు,రెండు వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 148 విమానాశ్రయాలను తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వీటి సంఖ్య వచ్చే నాలుగు సంవత్సరాల్లో 200 కి చేరుతుంది" అని ఆయన తెలిపారు.  

"విమానాల సంఖ్య 75% పెరిగింది. 2013లో 400 విమానాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 700కిపెరిగింది.. రాబోయే 4 నుండి 5 సంవత్సరాలలో ఈ సంఖ్య 1200 నుంచి 1500 మధ్య పెంచడానికి కృషి చేస్తున్నాము." అని శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా వివరించారు. 

“2016లోదేశంలో  కేవలం 28 ఫ్లయింగ్ అకాడమీ సంస్థలు మాత్రమే ఉన్నాయి, అవి ఇప్పుడు 57 కి పెరిగాయి. గత సంవత్సరం డిజిసిఏ  1135 కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లు జారీ చేసింది. ఇది ఒక రికార్డు. ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 731కి పెరిగింది” అని ఆయన చెప్పారు.

ఇండియన్ ఫ్లయింగ్ అకాడమీ: 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తిగా ఖజురహో విమానాశ్రయంలో ఇండియన్ ఫ్లయింగ్ అకాడమీని శౌర్య ఫ్లైట్ సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పింది.  కార్యకలాపాల నిర్వహణ కోసం 05 విమానాలను కొనుగోలు చేయాలని శౌర్య ఫ్లైట్ సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్ణయించింది.వాటిలో 04 విమానాలు  ఇప్పటికే వచ్చాయి. ఈ 04 విమానాల్లో మూడు విమానాలు  సింగిల్-ఇంజిన్ విమానాలు. వీటిలో  రెండు డైమండ్ DA 40, ఒక ఎవెక్టర్,  ఒక మల్టీ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్-డైమండ్ DA 42 ఉన్నాయి.  ఇండియన్ ఫ్లయింగ్ అకాడమీలో విమానం నడపడంలో ఒకేసారి 40 మందికి శిక్షణ ఇవ్వడానికి సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఏడాది 2 బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తారు. 

ఫ్లయోలా ఏవియేషన్ అకాడమీ (జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్):-హెలికాప్టర్ ఎఫ్‌టీఓ  : 

ఫ్లియోలా ఏవియేషన్ అకాడమీ హెలికాప్టర్ ఎఫ్‌టీఓ   ఆసియాలోని మొట్టమొదటి కమర్షియల్ హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ (CHPL) శిక్షణా సంస్థ. ఫ్లైఓలా ఏవియేషన్ అకాడమీ ప్రస్తుతం రెండు రాబిన్సన్ ఆర్ 44 హెలికాప్టర్‌లను కలిగి ఉంది.  ఒకేసారి  20 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి  

ఫ్లైయోలా ఏవియేషన్ అకాడమీ (జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్.)-ఫిక్స్‌డ్ వింగ్ ఎఫ్‌టీఓ  : ఫ్లైయోలా ఏవియేషన్ అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ వింగ్ ఎఫ్‌టీఓ   బహుళ-ఇంజిన్ శిక్షణా విమానం నడపడంలో  శిక్షణ ఇస్తోంది. ఈ తరహా విమానం  అధిక-పనితీరు గల విమానం గా పరిగణించబడుతుంది. ఫ్లయోలా ఏవియేషన్ అకాడమీ ఈ కింది శిక్షణ సౌకర్యాలు కలిగి ఉంది 

సింగిల్ ఇంజన్ విమానం: -

02 సెస్నా 172 విమానం

04 మల్టీ-ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్: -

03 కింగ్ ఎయిర్ C 90A విమానం

01 సూపర్ కింగ్ ఎయిర్ B200 ఎయిర్‌క్రాఫ్ట్.

ఫ్లయోలా ఏవియేషన్ అకాడమీ ఒక బ్యాచ్‌లో 20 మంది క్యాడెట్లకు శిక్షణ ఇవ్వగలదు. దీని కోసం ఎఫ్‌టీఓ లో నలుగురు  ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు.

 

***

 



(Release ID: 1942633) Visitor Counter : 83


Read this release in: English , Urdu