పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం
Posted On:
24 JUL 2023 6:11PM by PIB Hyderabad
'ఇథనాల్ సరఫరా సంవత్సరం' 2025-26 నాటికి పెట్రోల్‌లో 20% కలపే ఇథనాల్ లక్ష్యంతో 'జీవ ఇంధనాల జాతీయ విధానం- 2018'ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, 15.12.2022 నాటి ప్రకటన ద్వారా 20% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలు) అనుమతి ఉంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం కింద, ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) 2021-22లో ఓఎంసీలు 433.6 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా చేశాయి. దీనివల్ల సుమారు రూ.20,000 కోట్లకు పైగా విదేశీ మారకం ఆదా అయింది.
ప్రస్తుతం, ఈబీపీ కార్యక్రమం కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నారు.
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1942394)
Visitor Counter : 105