పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పట్టణ ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు - పథకాలు

Posted On: 24 JUL 2023 5:03PM by PIB Hyderabad

దేశంలో  పట్టణ ప్రాంతాలతో సహా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు పథకాల ద్వారా పర్యావరణ, అటవీ,  వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వివిధ చొరవలకు శ్రీకారం చుట్టింది.

పట్టణ ప్రాంతాల్లో నగర వనాల  ఏర్పాటు కోసం 2020 సంవత్సరంలో నగర్ వన్ యోజన (ఎన్ వి వై) అనే పథకాన్ని ప్రారంభించారు, ఇది స్థానిక కమ్యూనిటీలు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు మొదలైన వాటిని భాగస్వామ్యం చేయడం ద్వారా అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహిస్తోంది.

 

నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా (జిఐఎం) , దానికింద, ఇతర ఉప

మిషన్ లతో పాటు, పట్టణ , పెరి-పట్టణ ప్రాంతాలలో చెట్ల విస్తీర్ణాన్ని పెంచడానికి ఒక నిర్దిష్ట ఉప మిషన్ కూడా ఉంది.

కాంపెన్సేటరీ ఫండ్ యాక్ట్, 2016 , దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం అర్బన్ ఫారెస్ట్రీ కూడా అనుమతించదగిన చర్య. బహుళ శాఖల,  బహుళ ఏజెన్సీల కార్యకలాపాలుగా పట్టణ అటవీ పెంపకం తో సహా, ఫారెస్ట్రీ/ చెట్ల పెంపకాన్ని వివిధ కార్యక్రమాలు / నిధుల వనరుల కింద ఇంకా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్ ల ద్వారా రంగాల వారీగా చేపడతారు.

 

అడవి వెలుపల చెట్ల పెంపకం  (టిఓఎఫ్) అనేది రిజిస్టర్ అయిన అటవీ ప్రాంతాల వెలుపల పెరిగే అన్ని చెట్లను సూచిస్తుంది. నమోదు అయిన అటవీ ప్రాంతం , ట్రీ కవర్ వెలుపల ఒక హెక్టార్  అంతకంటే ఎక్కువ ఉన్న భాగాలు  రెండూ టిఓఎఫ్ ను ఏర్పరుస్తాయి.

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ), ఎం ఒ ఇ ఎఫ్ సి సి ప్రచురించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) 2015 ప్రకారం, చెట్ల విస్తీర్ణం  92,572 చ.కి.మీ ఉంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) 2021 ప్రకారం చెట్ల విస్తీర్ణం 95,748 చదరపు కిలోమీటర్లు.

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై నగరాల్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021లో ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్ చేసింది. ఈ ఏడు ప్రధాన మహానగరాల్లో నమోదైన మొత్తం అటవీ విస్తీర్ణం 509.72 చదరపు కిలోమీటర్లు. నగరవాసులకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడానికి , తద్వారా పరిశుభ్రమైన, ఆకుపచ్చ, ఆరోగ్యకరమైన , సుస్థిర నగరాల పెరుగుదలకు దోహదం చేయడానికి మునిసిపల్ కార్పొరేషన్ / మునిసిపల్ కౌన్సిల్ / మునిసిపాలిటీ / పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్ బి ) ఉన్న ప్రతి నగరంలో ఒక నగర వనం  / నగర వాటికను ఏర్పాటు చేయాలని నగర్ వన్ యోజన ఉద్దేశిస్తోంది.

 

నగర్ వన్ యోజన ముఖ్య లక్షణాలు:

 

(i) పట్టణ వ్యవస్థలో గ్రీన్ స్పేస్ , సుందర వాతావరణాన్ని సృష్టించడం.

 

(ii) మొక్కలు, జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడం.

 

(iii)  ప్రాంతంలోని ముఖ్యమైన వృక్షజాలం అంతర్గత సంరక్షణను సులభతరం చేయడం

 

(iv) కాలుష్యాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన గాలిని అందించడం, శబ్దాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ , వేడి ద్వీపాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా నగరాల పర్యావరణ మెరుగుదలకు దోహదం చేయడం

 

(v) నగరవాసులకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడం

 

(vi) నగరాలు వాతావరణ స్థితిస్థాపకంగా మారడానికి సహాయపడడం

 

ఎన్ వి వై  కింద 2020లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 385 ప్రాజెక్టులను మంజూరు చేశారు. మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, చత్తీస్ గఢ్ సహా రాష్ట్రాల వారీగా ప్రాజెక్టులు, మంజూరైన విస్తీర్ణం వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

 

మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, చత్తీస్ గఢ్ లలో గత రెండేళ్లలో మంజూరైన ప్రాజెక్టులకు గత రెండేళ్లు, ప్రస్తుత కాలంలో విడుదల చేసిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

 (రు. లక్షలలో)

 

వరస నెం.

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

2021-22 లో విడుదల అయిన నిధులు

2022-23 లో విడుదల అయిన నిధులు

2023-24 లో విడుదల అయిన నిధులు

1.

ఛత్తీస్ ఘడ్

830.77

0

0

2.

మహారాష్ట్ర

156.86

193.87

0

3.

దాద్రా - నాగర్ హవేలీ అండ్ డామన్

డయ్యూ

నగర్ వన్ యోజన కింద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు

 

నగర్ వన్ యోజన కింద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు

 

నగర్ వన్ యోజన కింద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు

 

 

అనుబంధం

 

రాష్ట్రాల వారీగా, నగర్ వన్ యోజన (2020-21 నుండి 2023-24 వరకు) కింద మంజూరైన ప్రాజెక్టుల సంఖ్య - మొత్తం విస్తీర్ణం వివరాలు

 

వరస నెం.

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

ఆమోదం పొందిన ప్రాజెక్టుల సంఖ్య

మొత్తం విస్తీర్ణం (హె.)

 

1.

అండమాన్ & నికోబార్

1

21.15

2.

ఆంధ్రప్రదేశ్

13

502.95

3.

అరుణాచల్ ప్రదేశ్

1

20

4.

అస్సాం

3

59

5.

బీహార్

6

113.02

6.

చండీగఢ్

1

6.79

7.

ఛత్తీస్ ఘడ్

7

294.63

8.

గోవా

1

50

9.

గుజరాత్

10

178.5

10.

హర్యానా

5

168.54

11.

హిమాచల్ ప్రదేశ్

6

172.07

12.

జమ్ము & కశ్మీర్

17

218.6

13.

ఝార్ఖండ్

33

771.67

14.

కర్ణాటక

7

239.71

15.

కేరళ

25

379.31

16.

మధ్య ప్రదేశ్

27

942.14

17.

మహారాష్ట్ర

9

184.14

18.

మణిపూర్

1

50

19.

మేఘాలయ

2

86.7

 

20.

మిజోరాం

16

730.8

21.

నాగాలాండ్

11

188.3

22.

ఒడిషా

40

720.2875

23.

పంజాబ్

16

186.9

24.

రాజస్థాన్

14

485.9

25.

సిక్కిం

5

139.63

26.

తమిళనాడు

10

435

27.

తెలంగాణ

47

472.19

28.

త్రిపుర

4

124.5

29.

ఉత్తరప్రదేశ్

26

722

30.

ఉత్తరాఖండ్

6

129.27

31.

వెస్ట్ బెంగాల్

15

117.483

32.

దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్

డయ్యు*

0

0

 

33.

మొత్తం

385

8911.1805

 

 గమనిక:* నగర్ వన్ యోజన కింద ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు.

 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.

 

***


(Release ID: 1942306) Visitor Counter : 179
Read this release in: English , Urdu , Marathi