ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతానికి సామర్థ్యాన్ని పెంపొందించే పథకం
ప్రధాన మంత్రి వందన్ యోజన (పిఎంవిడివై) పథకం కింద సోనిత్ పూర్ జిల్లాకు మొత్తం ఆరు వాన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టర్లు (విడివికెసిలు) మంజూరు
Posted On:
24 JUL 2023 3:37PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత సామర్థ్య పెంపు పథకం నైపుణ్యాభివృద్ధి - వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ (ఎం ఎస్ డి అండ్ ఇ ) పథకం. అస్సాంలోని గౌహతిలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ ప్రిన్యూర్షిప్ (ఐఐఇ) ద్వారా ఈ పథకం అమలు జరుగుతోంది. ఇది ఎం ఎస్ డి అండ్ ఇ కి చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం వివిధ సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తారు:
ఈశాన్య ప్రాంత సామర్థ్య పెంపు పథకం కింద ఐఐఇ వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించింది, వాటి వివరాలు అనుబంధం-1 లో చూడవచ్చు.
అసంఘటిత సంరక్షణ అందించే సేవా పరిశ్రమను ఫార్మల్ సర్వీస్ సెక్టార్ పరిశ్రమగా మార్చడానికి, ఎన్ఇఆర్ కు చెందిన వృద్ధులు, అవసరమైన జనాభాకు అధికారిక సంరక్షణ సేవలను అందించడానికి సరైన ఏర్పాటు కోసం, ఈశాన్య మండలి (ఎన్ఇసి) ఒక ప్రాజెక్టును నిర్వహిస్తోంది. కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షకుల (ట్రైనర్స్) ట్రైనింగ్ కార్యక్రమం (టి ఒ టి) నిర్వహించి మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు 32 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కింద 19 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి
471 సంరక్షణ (కేర్ గివర్స్) సిబ్బందిని సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం నిధులు రూ.4.80 కోట్లు కాగా, ఇప్పటి వరకు ఐఐఇ కి రూ.3.80 కోట్లు అందాయి.
భవిష్యత్తులో గ్రామీణ, గిరిజన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి భారత ప్రధాన మంత్రి 2018 ఏప్రిల్ 14 న ప్రారంభించిన ప్రధాన మంత్రి వందన్ యోజన (పిఎంవిడివై) పథకం కింద ఐఐఇ గత ఐదేళ్లలో అస్సాంలో వివిధ సామర్థ్య అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించింది. ఈ పథకాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (ఐఐఇ) 2019 లో అస్సాంలో అమలు చేసింది, రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ (మైదానాలు) దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) ఈ పథకానికి స్పాన్సర్ ఏజెన్సీగా ఉంది. పి ఎం వి డీ వై కింద అస్సాంలోని 33 జిల్లాల్లో మూడు దశల్లో 302 వాన్ ధన్ వికాస్ సెంటర్స్ క్లస్టర్ల (వీడీవీకేసీ) ను ట్రైఫెడ్ మంజూరు చేసింది.
ఈ పథకం ద్వారా, అస్సాంలోని గిరిజన సమాజాలకు స్థానికంగా లభించే మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ (ఎంఎఫ్.పి) నుండి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, తరువాత వాటిని విక్రయించడంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్థిరమైన జీవనోపాధిని కలిగి ఉండటానికి మద్దతు ఇస్తాయి, ఒక్కో క్లస్టర్ లో నమోదైన గిరిజన మహిళా లబ్ధిదారులతో సుమారు 300 స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జి) ఉంటాయి. ఈ పథకం కింద కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు అనుబంధం-2 లో ఉన్నాయి.
ప్రధాన మంత్రి వందన్ యోజన (పిఎంవిడివై) పథకం కింద, తేజ్ పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సోనిత్ పూర్ జిల్లాలో మొత్తం ఆరు వాన్ ధన్ వికాస్ కేంద్రాల క్లస్టర్లు (విడివికెసిలు) మంజూరు అయ్యాయి. విడివికెసిల పేర్లు ఇలా ఉన్నాయి.
రంగపర విడివికెసి
దేకియాజులి విడివికెసి
సిరజులి విడివికెసి
నమెరి విడివికెసి
భాలుక్పాంగ్ విడివికెసి
గుప్తేశ్వర్ విడివికెసి
ఈ విడివికెసిల ప్రస్తుత స్థితి ఈ క్రింది విధంగా ఉంది:
అవగాహన కార్యక్రమాలు: ఇవి ప్రధానంగా ప్రాజెక్టు గురించి లబ్ధిదారులలో అవగాహన పెంచడంపై దృష్టి పెడతాయి, తద్వారా లబ్ధిదారులు ఖచ్చితమైన ఉద్దేశ్యంతో పాల్గొనవచ్చు.పథకం కింద వాగ్దానం చేసిన విధంగా ఆశించిన ప్రయోజనాలను సాధించాలనే లక్ష్యంతో ఉంటారు. మొత్తం ఆరు విడివికెసి లలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి.
శిక్షణా కార్యక్రమాలు: 43 స్కిల్ డెవలప్ మెంట్/ వాల్యూ అడిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ల ద్వారా మొత్తం 1208 మంది లబ్దిదారులకు శిక్షణ ఇచ్చారు. వెదురు వినియోగం, క్యాండిల్ తయారీ, వాటర్ హైసింత్ ఉత్పత్తుల తయారీ, అగర్బత్తీ తయారీ, తేనెటీగల పెంపకం, నర్సరీ, వెదురు ఆభరణాల తయారీ, జనపనార ఉత్పత్తుల తయారీ, బ్యాగ్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్వీట్ తయారీ, సబ్బు తయారీ, వర్మీ కంపోస్ట్ తయారీ వంటి వివిధ ట్రేడ్ ల కింద శిక్షణలు నిర్వహించారు.
బ్యాంకు ఖాతాలు: మొత్తం ఆరు విడివికెసిలకు బ్యాంకు ఖాతాలు తెరిచారు.
సహకార సంఘాల ఏర్పాటు: సహకార సంఘాల ఏర్పాటు కోసం మూడు విడివికెసిలకు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే మూడు ఏర్పాటయ్యాయి.
ఐఐఇ వివిధ పథకాలు/ప్రాజెక్టుల కింద వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది. గడచిన మూడేళ్లలో మొత్తం 35,651 మంది సొంతంగా వెంచర్లు ప్రారంభించారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయం, హస్తకళలు, చేనేత, ఆభరణాలు, బేకరీ, బ్యూటీ అండ్ వెల్ నెస్ వంటి వివిధ రంగాల్లో కుటుంబ స్థాయిలో ప్రారంభించారు. 35,651 మందిలో 31,729 మంది మహిళలు పాల్గొన్నారు.
పిఎంవిడివై కింద దాని లబ్ధిదారులు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు ఐఐఇ నిరంతరం మద్దతు ఇస్తోంది. ప్రోత్సహిస్తోంది.
*లబ్ధిదారులు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయడానికి, ప్రోత్సహించడానికి "ట్రిస్సామ్" అనే బ్రాండ్ ను సృష్టించింది.
*ఐఐఇ వివిధ ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్ లు, కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలలో దాని లబ్ధిదారులను ప్రోత్సహించింది. లబ్ధిదారులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల అమ్మకాల కోసం ఐఐఇ అస్సాంలోని వివిధ జిల్లాల్లో ట్రిస్సామ్ బ్రాండ్ కింద రిటైల్ అవుట్లెట్లను తెరిచింది.
*గణనీయమైన ఆన్ లైన్ బ్రాండ్ ఉనికిని నిర్ధారించడానికి , డైనమిక్ ఇమేజ్ తో బ్రాండ్ ను అందించడానికి, ఐఐఇ కి చెందిన పిఎంవిడివై బృందం ట్రిస్సామ్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ను అభివృద్ధి చేసింది.
*రిటైల్ , బల్క్ ఆర్డర్లను అందిపుచ్చుకోవడానికి , సంభావ్య మార్కెట్ అవకాశాలను అన్వేషించడానికి l వినియోగదారులను గుర్తించడానికి వెబ్సైట్ లో ఆన్ లైన్ మార్కెటింగ్ పోర్టల్ కూడా ఉంది.
*ట్రిస్సామ్ వెబ్సైట్ తో పాటు, దాని ఉత్పత్తులు , కార్యకలాపాలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా కూడా ప్రచారం చేస్తారు.
అనుబంధం-1
ఈశాన్య ప్రాంతానికి సామర్థ్య పెంపు పథకం కింద స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్
వరస నెం.
|
పథకం/సంస్థ పేరు
|
మంజూరైన మొత్తం (రూ.లలో )
|
లబ్ధిదారుల సంఖ్య
|
1.
|
ఈశాన్య ప్రాంత శాఖ
|
3,94,00,494
|
1854
|
2.
|
పి. ఎం యువ
|
56,00,100
|
1181
|
3.
|
అస్సాం నైపుణ్యాభివృద్ధి మిషన్
|
10,62,480
|
60
|
4.
|
నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ బీసీఎఫ్ డీసీ) కింద టెక్నాలజీ అప్ గ్రేడేషన్ స్కీమ్
|
16,128,555
|
950
|
5.
|
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) 2.0
|
3,58,98,780
|
2184
|
6.
|
పి ఎం కె వి వై 3.0
|
1,77,00,00
|
360
|
7.
|
స్కిల్ హబ్ ఇనిషియేటివ్
|
25,000,000
|
114
|
8.
|
డిజి బునై
|
28,35,500
|
500
|
9.
|
నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్.డిసి)
|
70,02,300
|
420
|
10.
|
బ్యూటీ వెల్ నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కింద పీఎంకెవివై స్పెషల్ ప్రాజెక్ట్ 4.0
|
14,49,000
|
120
|
11.
|
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ క్రాఫ్ట్స్ మెన్ ట్రైనింగ్ (డి ఇ సి టి)
|
70,00,000
|
1320
|
12.
|
కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ -అస్సాం అగ్రిబిజినెస్ అండ్ రూరల్
ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్ట్ (అపార్ట్ )
|
36,00,000
|
330
|
13.
|
పి ఎం దక్ష్ (ఎన్ బి సి ఎఫ్ డి సి)
|
17,134,429
|
2730
|
14.
|
పి ఎం దక్ష్ (ఎన్ ఎస్ ఎఫ్ డి సి)
|
37,02,480
|
320
|
15.
|
పిఎం దక్ష్ (నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి )
|
26,64,760
|
160
|
16.
|
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కింద విలేజ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
|
2,00,000
|
60
|
|
మొత్తం
|
16,86,78,878
|
12,663
|
అనుబంధం-2
ఈ పథకం కింద కేటాయించిన, వినియోగించిన నిధులు
వరస నెం.
|
కాంపోనెంట్
|
కేటాయించిన నిధులు (రూ. లలో)
|
అందిన నిధులు (రూ. లలో)
|
వినియోగించిన నిధులు (రూ. లలో)
|
1.
|
ప్రచార కార్యక్రమాలు
|
1,51,00,000
|
1,07,50,000
|
68,74,804
|
2.
|
మాస్టర్ ట్రైనర్ వసతి - భోజనము
|
90,60,000
|
41,38,482
|
64,50,000
|
3.
|
మాస్టర్ ట్రైనర్ గౌరవ భృతి
|
1,81,20,000
|
1,29,00,000
|
60,02,481
|
4.
|
ట్రైనీ ఆహార ఖర్చులు
|
3,62,40,000
|
2,58,00,000
|
60,02,481
|
5.
|
శిక్షణ కార్యక్రమాలు
|
1,20,80,000
|
86,00,000
|
35,32,373
|
6.
|
పరికరాల కిట్లు - మెషినరీలు
|
12,68,40,000
|
9,03,00,000
|
5,76,68,678
|
7.
|
ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్
|
1,51,00,000
|
1,07,50,000
|
21,94,501
|
|
మొత్తం
|
232,540,000
|
163,238,482
|
88,725,318
|
కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1942295)
Visitor Counter : 165