గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంకేతిక విద్య కోసం ఎంపీలాడ్స్‌ నిధులు

Posted On: 24 JUL 2023 3:40PM by PIB Hyderabad

కొత్త ఎంపీలాడ్స్‌ మార్గదర్శకాలు-2023 ప్రకారం, ఎంపీలాడ్స్‌ నిధులను హార్డ్‌వేర్ & సాఫ్ట్‌వేర్‌ సహా ఐటీ వ్యవస్థల కొనుగోలు వంటి [ఎంపీలాడ్స్‌ కింద అనుమతించిన పనుల జాబితాలోని పాయింట్-3.3 ప్రకారం] విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అయితే, ఇది తుది జాబితా కాదు. మార్గదర్శకాల్లోని అధ్యాయం-5లో ఇచ్చిన పథకం సూత్రాలకు లోబడి పార్లమెంటు సభ్యుని సిఫార్సుల ఆధారంగా ఈ జాబితాకు కొత్త పనులను జోడించవచ్చు.

కేంద్ర గణాంకాలు & కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ ఈ సమాచారాన్ని ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు.

 

*****


(Release ID: 1942293)
Read this release in: English , Urdu , Marathi , Tamil