సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎం.ఎస్.ఎం.ఈ.లలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర
Posted On:
24 JUL 2023 4:19PM by PIB Hyderabad
నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) 73వ రౌండ్ నివేదిక (జూలై 2015 నుండి జూన్ 2016 వరకు) ప్రకారం, మొత్తం ఇన్కార్పొరేటెడ్ వ్యవసాయేతర యాజమాన్య సంస్థలలో 19.5 శాతం మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. వీరు 22 నుండి 27 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అక్టోబర్ 2022లో ప్రచురించబడిన నీతి ఆయోగ్ వెబ్సైట్లో “భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ మద్దతు డీకోడింగ్ చేయడం” నివేదిక ప్రకారం, భారతదేశంలో మహిళల ఆర్థిక సహకారం జీడీపీలో 17%గా ఉంది. మహిళా వ్యవస్థాపకత యొక్క ప్రపంచ ర్యాంకింగ్పై అధికారిక నివేదికలు లేవు. అయితే, ఒక ప్రైవేట్ అధ్యయనం “మాస్టర్ కార్డ్ ఇండెక్స్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ -2021” మొత్తం 65 దేశాలలో భారతదేశం 57వ స్థానంలో ఉంది. ఇండెక్స్ మూడు భాగాలను రూపొందించడానికి 12 సూచికలను ఉపయోగించింది: మహిళల పురోగతి ఫలితాలు; నాలెడ్జ్ ఆస్తులు మరియు ఆర్థిక యాక్సెస్ మరియు ఇండెక్స్ను నిర్మించడానికి వ్యవస్థాపక మద్దతు పరిస్థితులు. జూన్ 2019లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్పై (ఎం.ఎస్.ఎం.ఈ.) నిపుణుల కమిటీ నివేదిక మేరకు మహిళల యాజమాన్యంలోని ఎం.ఎస్.ఎం.ఈ. సహా ఎం.ఎస్.ఎం.ఈ.లు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా క్రెడిట్ యాక్సెస్ని గుర్తించింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ.) వివిధ పథకాలను అమలు చేస్తుంది. సాంప్రదాయ చేతివృత్తుల వారు మరియు గ్రామీణ/ పట్టణ నిరుద్యోగ యువతకు సహాయం చేయడం ద్వారా వ్యవసాయేతర రంగంలో సూక్ష్మ పరిశ్రమల స్థాపన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో.. మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంను (పీఎంఈజీపీ) అమలు చేస్తుంది. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగ/ఓబీసీ/మైనారిటీలు/మహిళలు, మాజీ సైనికులు, శారీరక దివ్యాంగులు, ఎన్ఈఆర్, కొండ మరియు సరిహద్దు ప్రాంతాల వారు మొదలైన ప్రత్యేక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు దీని ద్వారా అధిక సబ్సిడీ ఇవ్వబడుతుంది.
క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ): దీనిని (ఎం.ఎస్.ఎం.ఈ.) మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్ డెలివరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఎంఎస్ఈ సెక్టార్కు క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి ఏర్పాటు చేసింది. కొత్త తరం వ్యవస్థాపకులు, సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు అర్హత కలిగిన సభ్యుల రుణ సంస్థ [ఎంఎల్ఐలు] విస్తరించిన కొలేటరల్ మరియు /లేదా మూడవ పక్షం గ్యారెంటీ ఉచిత క్రెడిట్ సౌకర్యాలకు హామీ కవర్ను అందిస్తోంది.సీజీటీఎంఎస్ఈ మహిళా వ్యాపారవేత్తలకు క్రెడిట్ యొక్క హామీ కవరేజీని 85%కి పెంచింది. మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు రాయితీగా, సీజీటీఎంఎస్ఈ వార్షిక హామీ రుసుమును 10% తగ్గించింది.
మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు, మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ-సీడీపీ), టూల్ రూమ్లు & టెక్నాలజీ సెంటర్లు, సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల పథకం (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ) సహా ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఇ.ఎస్.డి.పి)) వంటి అనేక ఇతర పథకాలను కూడా అమలు చేస్తోంది. సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1942291)
Visitor Counter : 110