కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
అసంఘటిత రంగంలో కార్మికుల సంఖ్య..
Posted On:
24 JUL 2023 4:08PM by PIB Hyderabad
ఆర్థిక సర్వే, 2021-22 ప్రకారం, 2019-20లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి మొత్తం సంఖ్య 43.99 కోట్లు. 18.07.2023 నాటికి, 28.96 కోట్ల కంటే ఎక్కువ మంది కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్ క్రింద నమోదు చేయబడ్డారు. వీరిలో దాదాపు 52.70 లక్షల మంది కార్మికులు హర్యానాలోని ఇ-శ్రమ్ లో నమోదు చేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం అంతటా కార్మిక సంక్షేమం మరియు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారానికి ఉద్దీపన అందించడానికి, కోవిడ్ 19 యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించింది. దీని కింద, ప్రభుత్వం ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆర్థిక ఉద్దీపనలను అందించింది. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కొత్త ఉపాధిని సృష్టించడానికి మరియు ఉపాధి నష్టాన్ని పురించేలా యజమానులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఎ.బి.ఆర్.వై) 1 అక్టోబర్, 2020 నుండి ప్రారంభించబడింది. లబ్దిదారుని నమోదు కోసం టెర్మినల్ తేదీ 31.03.2022. పథకం ప్రారంభమైనప్పటి నుండి, 11.03.2023 వరకు పథకం కింద 60.3 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించబడ్డాయి. తమతమ స్వ రాష్ర్టాలకు తిరిగి వెళ్లిన అసంఘటిత కార్మికుల ఉపాధిని సులభతరం చేయడానికి, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ 116 జిల్లాల్లో మిషన్ మోడ్లో 2020 జూన్ 20న ప్రారంభించబడింది. 125 రోజుల పాటు వారి స్వస్థలాలకు తిరిగి వచ్చే అసంఘటిత కార్మికులకు ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను పెంచేలా ప్రారంభించబడింది. 24.03.2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు అమలులోకి వచ్చే విధంగా ఉద్యోగి యొక్క సగటు రోజువారీ సంపాదనలో 25 శాతం నుండి 50 శాతానికి నిరుద్యోగులుగా మారిన బీమా పొందిన వ్యక్తుల (ఐపీలు) కోసం ప్రభుత్వం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఎ.బి.వి.కె.వై) పథకం కింద అందించే ఉపశమనాన్ని కూడా పెంచింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఎ.వై) పథకం కింద ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా అందించారు. ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ. రామేశ్వర్ తేలీ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1942290)