వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద కేంద్రం టమోటాను కొనుగోలు చేసింది


జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య మరియు జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్సమాఖ్య టమోటా కిలో రూ.70 చొప్పున విక్రయిస్తున్నాయి.

టమోటాతో సహా వ్యవసాయ- ఉద్యానవన వస్తువుల పంటకోత అనంతర నష్టాలను తగ్గించడం మరియు విలువ జోడింపును పెంచడం కోసం ఆపరేషన్ గ్రీన్స్ అమలు చేయబడింది

Posted On: 21 JUL 2023 3:35PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాసిక్‌, నార్యంగోన్‌, ఔరంగాబాద్‌ బెల్ట్‌ నుంచి మధ్యప్రదేశ్‌ నుంచి కూడా కొత్త పంట రావడంతో రాబోయే రోజుల్లో టమాటా ధర తగ్గే అవకాశం ఉంది.

వినియోగదారుల వ్యవహారాల విభాగం టమోటాతో సహా 22 నిత్యావసర ఆహార వస్తువుల రోజువారీ ధరలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం పెరిగిన టమోటా ధరలను అరికట్టడంతోపాటు వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద టమోటా కొనుగోళ్లను ప్రారంభించి వినియోగదారులకు అధిక రాయితీపై అందుబాటులో ఉంచుతోంది.  జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య  (ఎన్సీసీఎఫ్) మరియు జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్సమాఖ్య (నాఫెడ్) ఆంధ్రప్రదేశ్, కర్నాటక మరియు మహారాష్ట్రలోని మండీల నుండి నిరంతరం టమోటాను సేకరిస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులకు ధరను సబ్సిడీ చేసిన తర్వాత ఢిల్లీ- జాతీయ ప్రాదేశిక ప్రాంతం, బీహార్, రాజస్థాన్ మొదలైన ప్రధాన వినియోగ కేంద్రాలలో సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నాయి. టమోటా మొదట రూ.90/కిలో రిటైల్ ధర వద్ద ఆయా మార్కెట్లకు పంపగా..  ఇది 16.07.2023 నుండి రూ.80/కేజీకి తగ్గించబడింది. ప్రస్తుతం.. అంటే..20.07.2023 నుండి రూ.70/కేజీకి తగ్గించబడింది.

ప్రస్తుతం టమోటా ధరల పెరుగుదల రైతులను మరింత టమోటా పంటను పండించేలా ప్రోత్సహించవచ్చు.  ఇది రాబోయే నెలల్లో ధరలను స్థిరీకరిస్తుంది.నాసిరకం వ్యవసాయ -ఉద్యానవన వస్తువుల పెంపకందారులను నష్టపరిహారం అమ్మకం నుండి రక్షించడానికి, గరిష్ట రాక కాలంలో ధరలు ఆర్థిక స్థాయిలు మరియు ఉత్పాదక వ్యయం కంటే తక్కువకు పడిపోయేటప్పుడు  డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ (డీఏఎఫ్డబ్ల్యూ) మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్)ని అమలుచేస్తుంది.  ఈ పథకం కింద, ధర పతనం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 50:50 ప్రాతిపదికన భరిస్తాయి. ఎంఐఎస్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వాల నుండి టొమాటో విక్రయాల కష్టాలను పరిష్కరించడానికి మార్కెట్ జోక్యం కోసం ఎటువంటి ప్రతిపాదన రాలేదు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టమాటాతో సహా వ్యవసాయ-ఉద్యానవన వస్తువుల యొక్క విలువ జోడింపు మరియు పంట అనంతర నష్టాలను తగ్గించడం కోసం ఆపరేషన్ గ్రీన్స్‌ను అమలు చేస్తుంది.
 పథకం యొక్క లక్ష్యాలు
 (i) రైతులకు ఉత్పత్తుల విలువను పెంచడం.
 (ii) కష్టాల విక్రయం నుండి సాగుదారులను రక్షించడం.
(iii) ఫుడ్ ప్రాసెసింగ్/సంరక్షణ సామర్థ్యాలలో పెరుగుదల మరియు విలువ జోడింపు.
(iv) కోత అనంతర నష్టాలను తగ్గించడం.
ఈ పథకంలో స్వల్పకాలిక జోక్యాల భాగం మరియు దీర్ఘకాలిక జోక్యాల భాగం రెండూ ఉన్నాయి. స్వల్పకాలిక జోక్యాలలో వ్యక్తిగత రైతులు, రైతుల సమూహం, రైతు ఉత్పాదక సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంఘాలు, రాష్ట్ర మార్కెటింగ్ మరియు సహకార సమాఖ్య, ఫుడ్ ప్రాసెసర్లు, లైసెన్స్ పొందిన కమీషన్ ఏజెంట్లు, ఎగుమతిదారులు మరియు రిటైలర్లు మొదలైన వారికి రవాణా మరియు నిల్వ రాయితీలు ఉన్నాయి.

ఈ సమాచారాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***(Release ID: 1941680) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Marathi , Tamil