సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

అధిక ఆదాయం మరియు ఉపాధి కోసం ఆధునిక యంత్రాలు మరియు సాధనాలతో కే వై ఐ సీ పంపిణీ కార్యక్రమం సాంప్రదాయ కళాకారులను శక్తివంతం చేస్తుంది

Posted On: 20 JUL 2023 5:38PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ 340 మంది లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ పోటర్ వీల్, పెడల్స్ తో ఆపరేట్ చేసే అగర్బత్తి మిషన్లు, మోటరైజ్డ్ అగర్బత్తి మిషన్లు మరియు టర్న్‌వుడ్ క్రాఫ్ట్ మెషీన్లను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పార్లమెంటు సభ్యుడు లల్లు సింగ్  కే వై ఐ సీ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ సమక్షంలో నిన్న పంపిణీ చేశారు. యోధ్య, గ్రామ వికాస్ యోజన కింద రాణివాలోని గ్రామ్ స్వావ్లంబి విద్యాలయంలో రాష్ట్ర కార్యాలయం, కే వై ఐ సీ, లక్నో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో లక్నో మరియు గోరఖ్‌పూర్ డివిజనల్ ఆఫీస్ లబ్దిదారులు శ్రీ గిరీష్‌పతి త్రిపాఠి, మేయర్ అయోధ్య మరియు కే వై ఐ సీ (నార్త్ జోన్) సభ్యుడు శ్రీ నాగేంద్ర రఘువంశీ కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ప్రసంగిస్తూ, దేశంలోని 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఇ రంగం భారతదేశ జిడిపిలో మూడో వంతు దోహదం చేస్తుందన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంఎస్‌ఎంఇ  రంగం గొప్ప పని చేస్తోంది. శ్రీ వర్మ ఇంకా మాట్లాడుతూ గ్రామీణ భారతదేశంలో ఉపాధి కల్పన రంగంలో ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గత 9 సంవత్సరాలలో చారిత్రాత్మక పని చేసిందని అన్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో కెవిఐసి చైర్మ‌న్ శ్రీ మ‌నోజ్ కుమార్ ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి స్పూర్తితో ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మిష‌న్ ప్ర‌తి గ్రామానికి ఉపాధి క‌ల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుంద‌న్నారు. ఆయన నాయకత్వంలో గత ఆర్థిక సంవత్సరంలో చరిత్ర సృష్టిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల టర్నోవర్ రూ.1.34 లక్షల కోట్లు దాటింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, కెవిఐసి గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద భారతీయ సాంప్రదాయ పరిశ్రమల కార్మికులకు పనిముట్లు మరియు యంత్రాలను పంపిణీ చేస్తుందని, సాంప్రదాయ పరిశ్రమల కార్మికుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు సమగ్రంగా మెరుగుపడతాయని ఆయన అన్నారు.

 

ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా కుమ్మరులకు 25,000 కంటే ఎక్కువ విద్యుత్ చక్రాల సెట్లు పంపిణీ చేయబడ్డాయి, ఇది వారి 'ఆదాయాన్ని మూడు నుండి నాలుగు రెట్లు పెంచింది. అదేవిధంగా 20 వేల మంది తేనెటీగల పెంపకందారులకు 2 లక్షలకు పైగా బీ-బాక్సులు, బీ-కాలనీలు పంపిణీ చేశామన్నారు. తేనెటీగల పెంపకం వల్ల రైతుల దిగుబడి 25 నుంచి 30 శాతం పెరిగింది.

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం భార‌త‌దేశాన్ని ప‌టిష్టమైన, స్వ‌యం స‌మ‌ద్ధ‌మైన దేశంగా మారుస్తోంద‌ని, ఇది ప్ర‌పంచానికి స్ఫూర్తిదాయ‌క‌మని శ్రీ మ‌నోజ్ కుమార్ అన్నారు. “మేక్ ఇన్ ఇండియా” అలాగే మేక్ ఫర్ వరల్డ్ అనే మంత్రంతో మనం ముందుకు సాగాలి, అప్పుడే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి “లోకల్ టు గ్లోబల్” విజన్ సాకారం అవుతుంది.

 

ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా  25,000 కంటే ఎక్కువ మంది కుమ్మరులకు విద్యుత్ చక్రాల సెట్లు పంపిణీ చేయబడ్డాయి. ఇది వారి 'ఆదాయాన్ని మూడు నుండి నాలుగు రెట్లు పెంచింది. అదేవిధంగా 20 వేల మంది తేనెటీగల పెంపకందారులకు 2 లక్షలకు పైగా బీ-బాక్సులు, బీ-కాలనీలు పంపిణీ చేశామన్నారు. తేనెటీగల పెంపకం వల్ల రైతుల దిగుబడి 25 నుంచి 30 శాతం పెరిగింది.

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం భార‌త‌దేశాన్ని ప‌టిష్టమైన, స్వ‌యం స‌మ‌ద్ధ‌మైన దేశంగా మారుస్తోంద‌ని, ఇది ప్ర‌పంచానికి స్ఫూర్తిదాయ‌క‌మని శ్రీ మ‌నోజ్ కుమార్ అన్నారు. “మేక్ ఇన్ ఇండియా” అలాగే మేక్ ఫర్ వరల్డ్ అనే మంత్రంతో మనం ముందుకు సాగాలి, అప్పుడే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి “లోకల్ టు గ్లోబల్” విజన్ సాకారం అవుతుంది.

 

ఈ సందర్భంగా అయోధ్య పార్లమెంటు సభ్యుడు శ్రీ లల్లూ సింగ్ కెవిఐసి అమలు చేస్తున్న గ్రామ వికాస్ యోజనను అభినందిస్తూ, ఈ పథకాలలో చేరడం ద్వారా మన సాంప్రదాయ కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ముందుకు సాగవచ్చని అన్నారు. అయోధ్య మేయర్ శ్రీ గిరీష్‌పతి త్రిపాఠి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించేలా ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల స్వదేశీ ఉత్పత్తులను గరిష్టంగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

పంపిణీ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, లక్నో, జలౌన్, ఝాన్సీ, మౌ మరియు అజంగఢ్‌లోని 260 మంది కుమ్మరులకు, కాన్పూర్ దేహత్‌కు చెందిన 20 మంది కార్మికులకు అగర్బత్తి తయారీ యంత్రాన్ని పంపిణీ చేశారు. అలాగే, లక్మీపూర్ ఖేరీ, సంత్ కబీర్ నగర్ మరియు అజంగఢ్‌లోని 60 మంది కార్మికులకు టర్న్‌వుడ్ క్రాఫ్ట్ యంత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మరియు కెవిఐసి అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 1941284) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi