జల శక్తి మంత్రిత్వ శాఖ
గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (రూరల్ వాష్) భాగస్వాముల ఫోరం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్న జల్ శక్తి మంత్రిత్వ శాఖ
శుక్రవారం (2023 జూలై 21) విజ్ఞాన్ భవన్ లో జాతీయ సదస్సును ప్రారంభించనున్న కేంద్ర జల్ శక్తి మంత్రి
జల్ జీవన్, స్వచ్ఛ భారత్ మిషన్ ల పురోగతి, వాటి వేగవంతమైన అమలుకు మద్దతు ఇవ్వడానికి ముందుకు సాగే మార్గంపై చర్చించనున్న నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగానికి చెందిన భాగస్వాములు
Posted On:
20 JUL 2023 1:43PM by PIB Hyderabad
కర్టెన్ రైజర్
భారతదేశంలో గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (రూరల్ వాష్) రంగంలో పనిచేస్తున్న అభివృద్ధి , ఆ రంగం భాగస్వాముల కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు , పారిశుద్ధ్య విభాగం (డిడిడబ్ల్యుఎస్) వేదిక అయిన రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరం (ఆర్డబ్ల్యుపిఎఫ్) తన మొదటి వార్షికోత్సవాన్ని 2023 జూలై 21 న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రెండు రోజుల జాతీయ సదస్సుతో జరుపుకుంటోంది. ఈ సదస్సును కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభిస్తారు. భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ (డిడిడబ్ల్యుఎస్) ప్రతిష్టాత్మక మిషన్ లు అయిన జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్) , స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్ బి ఎం -జి) మిషన్ ల పురోగతి, వాటి వేగవంతమైన అమలుకు మద్దతు ఇవ్వడానికి ముందుకు సాగే మార్గంపై నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగానికి చెందిన భాగస్వాములను ఈ సదస్సు
ఏకతాటి పైకి తెస్తుంది.
'స్వచ్ఛ సుజల్ భారత్ దిశగా పురోగతిని వేగవంతం చేయడం' అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. భాగస్వాములు తమ అనుభవాలను పంచుకోవడానికి, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి , సహకరించడానికి కొత్త మార్గాలను గుర్తించేందుకు ఈ జాతీయ సదస్సు ఒక వేదికను అందిస్తుంది. ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం , పౌర సమాజం నుండి ఈ క్రింది కీలక రంగాలపై దృష్టి సారించే కీలక వక్తలు కూడా పాల్గొంటారు:
*జె జె ఎం, ఎస్ బి ఎం - జి పై గత సంవత్సరంలో సాధించిన పురోగతిని సమీక్షించడం
*గ్రామీణ భారతంలో వాష్ రంగానికి ఉన్న సవాళ్లు , అవకాశాలను గుర్తించడం
*వాష్ రంగం భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ ను అభివృద్ధి చేయడం
స్వచ్ఛ సుజల్ భారత్ దిశగా పురోగతిని ఎలా వేగవంతం చేయాలో చర్చించడానికి వాష్ రంగంలోని భాగస్వాములకు ఈ జాతీయ సదస్సు ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తుంది. మరింత సమాచారం కోసం, www.rwpf.in వెబ్ సైట్ ను సందర్శించండి.
అభ్యసన విజ్ఞాన భాగస్వామ్య వాతావరణాన్ని సృష్టించడం, కొలవ దగిన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను కనుగొనడం, ఉత్తమ అభ్యాసాలు , విజయగాథలను పంచుకోవడంతో పాటు, ప్రయత్నాలలో లోపాలను నివారించడం, మెరుగైన సహకారం , సమన్వయం కోసం గ్రామీణ వాష్ రంగంలో పనిచేసే సంస్థలను డి డి డబ్ల్యూ ఎస్ - ఆర్ డబ్ల్యూ పి ఎఫ్ - గా ఒకే గొడుగు కిందకు తెచ్చింది. కె పి ఎం జి ఇండియా ప్లాట్ ఫాం కోఆర్డినేటర్ పాత్రను పోషిస్తుంది. డి డి డబ్ల్యూ ఎస్ తోను, ఇతర భాగస్వాములతోనూ కలిసి చర్చల ప్లాట్ ఫారమ్ లు/ఈవెంట్ లను విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది.స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్ - ఫేజ్ 2), జల్ జీవన్ మిషన్ అమలులో డిడిడబ్ల్యుఎస్ ప్రయత్నాలకు సాంకేతిక మద్దతు, విజ్ఞాన భాగస్వామ్యం , వాష్ రంగంలో విస్తృత ప్రచారం , ప్రభావం ఉన్న సంస్థల సహకార సహాయం ద్వారా తోడ్పడటం కూడా ఈ ఫోరం లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ లక్ష్యాలను సాధించే దిశగా భాగస్వాముల విభిన్న సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి భాగస్వామ్యాలను నిర్మించాలని కూడా ఆర్ డబ్ల్యుపిఎఫ్ భావిస్తుంది. ఆర్ డబ్ల్యుపిఎఫ్ జూలై 2022 లో ప్రారంభం అయింది. అప్పటి నుండి 200 మందికి పైగా భాగస్వాములను కలిగి ఉంది, ఇది విస్తృత శ్రేణి నైపుణ్యం , అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఆర్ డబ్ల్యుపిఎఫ్ అభివృద్ధి భాగస్వాములు , సెక్టార్ లోని భాగస్వాములకు మించి, కార్పొరేట్లు, పిఎస్ యులు, వాష్ రంగంతో సంబంధం ఉన్న సంబంధిత మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలు మొదలైన వాటికి భాగస్వామ్యాలను కల్పిస్తుంది. వాష్ లో మొత్తం భాగస్వాముల క్రాస్ లెర్నింగ్ లను నిర్ధారించడానికి, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల మిషన్ డైరెక్టర్లు, జెజెఎమ్ , ఎస్ బిఎమ్-జి కార్యదర్శులు, భారత ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు, వాష్ రంగంలో పనిచేసే కార్పొరేట్లు, ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్ చైర్మన్లు , నీతి ఆయోగ్ నుండి భాగస్వామ్యాన్ని అభ్యర్థించారు.
రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరం గురించి
రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరం (ఆర్ డబ్ల్యుపిఎఫ్ ) భారతదేశంలో గ్రామీణ వాష్ రంగంలో పనిచేసే అభివృద్ధి భాగస్వాములు , సెక్టార్ భాగస్వాములకు ఒక ప్రముఖ వేదిక. స్వచ్ఛ సుజల్ భారత్ దిశగా పురోగతిని వేగవంతం చేయడమే ఆర్ డబ్ల్యుపిఎఫ్ లక్ష్యం. తన లక్ష్యాన్ని సాధించడానికి ఫోరం కిందివిధంగా పనిచేస్తుంది:
*అభివృద్ధి భాగస్వాములు, సెక్టార్ భాగస్వాముల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం
*విజ్ఞానం , ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం
*వాష్ సెక్టార్ లో సవాళ్లను గుర్తించడం- పరిష్కరించడం
*వాష్ రంగానికి మద్దతు ఇచ్చే విధానాల కోసం వాదించడం
*మిషన్ లక్ష్యాలను మరింత మెరుగ్గా అమలు చేయడం , సాధించడం కోసం వారి థీమ్ ఏరియాలో ప్రత్యేక క్యాంపెయిన్(లు) ప్రారంభించడం .
గుర్తించిన 12 థీమాటిక్ ప్రాంతాలను అభివృద్ధి, సెక్టార్ భాగస్వాములకు పరస్పర అంగీకారం తరువాత కేటాయించారు. డి డిడబ్ల్యూఎస్ లో
ఆర్ డబ్ల్యూపిఎఫ్ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేశారు, ఇక్కడ పనులు , కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి కెపిఎంజి ప్లాట్ ఫాం కోఆర్డినేటర్ గా ఉంది. ఆ జాబితా ఇలా ఉంది.
వరస నెం.
|
దీమాటిక్ ప్రాంతం
|
ఆర్ డబ్ల్యూపిఎఫ్ లీడ్ పార్టనర్
|
1.
|
మల బురద నిర్వహణ
|
వాష్ ఇనిస్టిట్యూట్
|
2.
|
గ్రే వాటర్ మేనేజ్ మెంట్
|
వాటర్ ఎయిడ్
|
3.
|
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ
|
సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్
|
4.
|
నీటి నాణ్యత నిర్వహణ
|
ఇన్ రెమ్ ఫౌండేషన్
|
5.
|
మూల సుస్థిరత
|
ఆగా ఖాన్ ఫౌండేషన్
|
6.
|
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, వాష్ ఇన్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ జెండర్
|
వాటర్ ఎయిడ్
|
7.
|
ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్
|
బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
|
8.
|
కెపాసిటీ బిల్డింగ్
|
యునిసెఫ్
|
9.
|
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
|
ఇండియా శానిటేషన్ కూటమి - ఫిక్కీ
|
10.
|
ఐ ఒ టి అండ్ క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్
|
టాటా ట్రస్ట్స్
|
11.
|
టెక్నాలజీల వినియోగంతో సహా ఇన్నోవేషన్, ఆర్ అండ్ డి
|
పిరమల్ ఫౌండేషన్
|
12.
|
నైపుణ్యం
|
ఆల్ ఇండియా ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్
|
ప్లాట్ ఫాం ఈ క్రింది కార్యకలాపాలను సులభతరం చేస్తుంది:
*ఆర్ డబ్ల్యూపిఎఫ్ ను వాష్ థింక్ ట్యాంక్ గా పొజిషన్ చేయడం
*రాష్ట్రాలు, అభివృద్ధి/రంగ భాగస్వాములు వంటి వివిధ భాగస్వాముల మధ్య క్రమానుగత ఆలోచనల మార్పిడిని సులభతరం చేయడం
*జెజెఎమ్/ ఎస్ బిఎమ్-జి అమలు కోసం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయాన్ని అందించడం, అటువంటి రాష్ట్ర నిర్దిష్ట అవసరాలను పరిష్కరించడం
*ఉత్తమ పద్ధతులు , స్కేలబుల్ పరిష్కారాలను గుర్తించడం
*వాష్ రంగంలో ప్రయత్నాలను ఆప్టిమైజ్ చేయడం కోసం సెక్టార్ భాగస్వాములు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమ్మేళనాలను ఏర్పాటు చేయడం
*ప్రాంతీయ, జాతీయ సదస్సులు, వెబినార్ లు, థీమ్ ఏరియా అంశాలపై శిక్షణల ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం, అవగాహన కల్పించడం
****
(Release ID: 1941196)
Visitor Counter : 125