పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెరుగుతున్న విమాన రవాణా అవసరాలు తీర్చడానికి 98,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న ఏఏఐ, ఇతర ఆపరేటర్లు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, నూతన టెర్మినళ్ల నిర్మాణం, విస్తరణ, ఆధునీకరణ తదితర కార్యకలాపాలకు మూలధన వినియోగం


100% గ్రీన్ ఎనర్జీ వినియోగించడానికి చర్యలు అమలు చేస్తున్న విమానాశ్రయాలు . ప్రస్తుతం 100% గ్రీన్ ఎనర్జీతో పనిచేస్తున్న55 విమానాశ్రయాలు

Posted On: 20 JUL 2023 2:40PM by PIB Hyderabad

విమానాశ్రయాలలో మౌలిక సదుపాయాల విస్తరణ , అభివృద్ధి కార్యక్రమాలు  ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంటాయి.  భూమి లభ్యత, వాణిజ్య వెసులుబాటు,  సామాజిక-ఆర్థిక అంశాలు, , ట్రాఫిక్ డిమాండ్ / విమానాశ్రయాల నుంచి విమానాలు నిర్వహించేందుకు  విమానయాన సంస్థల సంసిద్ధత లాంటి అంశాల ఆధారంగా  ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ), ఇతర విమానాశ్రయ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు అమలు చేస్తారు. . పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని  ఏఏఐ, ఇతర ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు  2019-2024 మధ్య కాలంలో విమానాశ్రయ రంగంలో సుమారు రూ.98,000 కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, నూతన టెర్మినళ్ల నిర్మాణం, రన్ వేలను పటిష్టం చేయడం లాంటి కార్యక్రమాలకు  నిధులు ఖర్చు చేస్తారు. 

విమానయాన సంస్థలు నిబంధనలు, మార్గదర్శకాలు  పాటించేలా చూసేందుకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ అమలులో ఉంది.  నిరంతర ప్రక్రియగా అమలు జరిగే కార్యక్రమంలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)  వార్షిక నిఘా ప్రణాళిక (ఎఎస్పి) లో పొందుపరిచిన నిఘా, స్పాట్ తనిఖీలు, రెగ్యులేటరీ ఆడిట్  అమలు జరుగుతాయి. . భద్రతా పర్యవేక్షణ అధ్యయనాల తుది నివేదిక లో పొందుపరిచిన అంశాలను ఆపరేటర్అమలు చేయాల్సి ఉంటుంది.  తగిన ధృవీకరణ తర్వాత మాత్రమే పరిశీలనలు మూసివేయబడతాయి. ఆపరేటర్ అమలు చేసిన చర్యలను తదుపరి ఆడిట్/నిఘా సమయంలో పరిశీలించి  తీసుకోవడం జరుగుతుంది.. ఆడిట్/ నిఘా సమయంలో  నిబంధనలు సక్రమంగా అమలు కావడం  ఆర్థిక జరిమానా విధించడం  సహా ఇతర చర్యలను  డిజిసిఎ అమలు చేస్తుంది. 

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ (యు ఎన్ ఎఫ్ సి సి సి) ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా   అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) సహకారంతో సుస్థిర విమానయానాన్ని సాధించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసిఎ) కట్టుబడి ఉంది.విమానయాన రంగంలో కర్బన  ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా  జాతీయ పౌర విమానయాన విధానం 2016 అమల్లోకి వచ్చింది.జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలు సాధించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాతీయ పౌర విమానయాన విధానాన్ని అమలు చేస్తోంది.  విమానయాన ఉద్గారాలు తగ్గించి,  పర్యావరణం పై వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం క్రింది  చర్యలు అమలు చేస్తోంది: 

i. కర్బన ఉద్గారాల విడుదల తగ్గించి శూన్య  ఉద్గారాల లక్ష్యం  కోసం కృషి చేయాలని, కర్బన ఉపశమన చర్యలు అమలు చేయాలని, కర్బన  నిర్వహణ ప్రణాళికలను అభివృద్ధి చేయాలని విమానాశ్రయ ఆపరేటర్లు, అభివృద్ధి సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. కర్బన విడుదల తగ్గించడానికి   పునరుత్పాదక శక్తి ఉపయోగించడం, కార్యాచరణ విధానం అమలు చేయాలని , సేవలు, షెడ్యూల్లు సమర్ధంగా నిర్వహించడానికి  గ్రౌండ్ హ్యాండ్లింగ్ వాహనాలలో ప్రత్యామ్నాయ ఇంధనాలు చేర్చడం వంటి వివిధ చర్యలు విమానాశ్రయాల్లో  అమలు జరుగుతున్నాయి. విమానాశ్రయాలు 100% గ్రీన్ ఎనర్జీ విమానాశ్రయాలుగా మారుతున్నాయి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నిర్వహిస్తున్న  49 విమానాశ్రయాలతో సహా 55 విమానాశ్రయాలు ప్రస్తుతం 100% గ్రీన్ ఎనర్జీతో పనిచేస్తున్నాయి

ii. 'ఏవియేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్', సిరీస్ బి, పార్ట్ 1 పేరుతో పౌర విమానయాన  ఆవశ్యకత (సీఏఆర్), సెక్షన్ 10ను డీజీసీఏ జారీ చేసింది.  ఉద్గారాలను తగ్గించడం,  వాతావరణ మార్పులపై ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించడానికి సంబంధిత సంస్థలు  అనుసరించాల్సిన సాధారణ విధానాలు,పద్ధతులను దీనిలో పొందుపరిచారు. 

iii. విమాన బరువు తగ్గించడం, విమానంలో తేమ, ధూళి చేరకుండా నిరోధించడం, వేగం, సిబ్బంది  నిర్వహణ లాంటి చర్చల ద్వారా కర్బన విడుదల తగ్గించడానికి   విమానయాన సంస్థలు చర్యలు అమలు చేస్తున్నాయి. 

iv.  భారత వైమానిక దళం తో సంప్రదింపులు జరిపిన ఏఏఐ ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ (ఎఫ్ యూఏ) చొరవ ద్వారా గగనతల వినియోగాన్నిఎక్కువ  చేసింది, ఫలితంగా కర్బన  ఉద్గారాలు తగ్గాయి

v . ప్రస్తుతం పనిచేస్తున్న,  రాబోయే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించి పనిచేసే పరికరాల వాడకాన్ని తగ్గించడానికి  ఏఏఐ చర్యలు చేపట్టింది. ఇంధన సామర్ధ్య వివరాలు ప్రకటించి, తగిన శిక్షా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.  కర్బన ఉద్గారాలపై అవగాహన పెంచడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. 

ప్రాంతీయ స్థాయిలో విమానాల రాకపోకలు ఎక్కువ చేయడానికి , ప్రజలకు చౌకగా  విమాన ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులోకి తేవడానికి  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 21.10.2016 న ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్ సి ఎస్) - ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) ను ప్రారంభించింది.ప్రస్తుతం ఉన్న ఎయిర్ స్ట్రిప్ లు, విమానాశ్రయాలను పునరుద్ధరించడం ద్వారా దేశంలో తక్కువ సేవలు అందుతున్న, సేవలు అందని  విమానాశ్రయాలకు రాకపోకలు సాగించేలా చూడడం  ఉడాన్ పథకం ఉద్దేశం. 12.07.2023 నాటికి దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు / హెలిపోర్టులు / వాటర్ ఏరోడ్రోమ్ల  479 ఉడాన్ సర్వీసులు నడుస్తున్నాయి.   1000 ఉడాన్ మార్గాలను అమలు చేయాలని, ఉడాన్ విమానాల నిర్వహణ కోసం 2024 నాటికి దేశంలో సేవలందించని 100 విమానాశ్రయాలు / హెలిపోర్టులు / వాటర్ ఏరోడ్రోమ్లను పునరుద్ధరించడం / అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పౌర విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను  డిజిసిఎ అమలు చేస్తోంది.  విమానాశ్రయ భద్రతను నిర్ధారించడానికి పౌర విమానయాన అవసరాలను (సిఎఆర్) ప్రచురిస్తుంది,  ఐసిఏఓ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ భద్రతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) ఆదేశాలు, సర్క్యులర్లు జారీ చేస్తుంది. విమానాశ్రయ భద్రత మరియు భద్రతను పెంచడానికి, అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. 

i. విమానాశ్రయాల్లో భద్రతా మౌలిక సదుపాయాలను పెంచడానికి కంప్యూటర్ టోమోగ్రఫీ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ సిస్టమ్స్ (సిటి-ఇడిఎస్) యంత్రాలు, డ్యూయల్ జనరేటర్ ఎక్స్-బిఐఎస్ యంత్రాలు మరియు ఆటోమేటెడ్ ట్రే రిట్రీవర్ సిస్టమ్ (ఎటిఆర్ఎస్) వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

ii. చొరబాట్లను గుర్తించే వ్యవస్థ (పిఐడిఎస్) ఏర్పాటుకు అవసరమైన ఆదేశాలు విడుదల అయ్యాయి.  

iii. విమానాశ్రయాల్లో పూర్తి బాడీ స్కానర్ లను దశలవారీగా ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

iv . భారతీయ విమానాశ్రయాల్లో రేడియోలాజికల్ డిటెక్షన్ ఎక్విప్ మెంట్ (ఆర్ డీఈ)ను దశలవారీగా అమలు లోకి వస్తుంది. . 48 విమానాశ్రయాల్లో బయోమెట్రిక్ సెంట్రలైజ్డ్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. 

v. ప్రయాణీకులకు సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణ సౌకర్యాలు అందించడానికి  విమానాశ్రయ భద్రతా యూనిట్లు, విమాన ఆపరేటర్లు , ఇతర నియంత్రిత సంస్థలలో పనిచేసే భద్రతా సిబ్బందికి రెగ్యులేటరీ అథారిటీ సమగ్ర శిక్షణ మార్గదర్శకాలను అందిస్తుంది. అంతేకాక, ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ సిబ్బంది సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ నైపుణ్యం , ప్రవర్తనా అంశాలపై  క్రమం తప్పకుండా శిక్షణ పొందుతారు. 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్) ఈ రోజు లోక్ సభలో  ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ వివరాలు అందించారు. 

 

***




(Release ID: 1941191) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Tamil