జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2030 సంవత్సరం నాటికి వస్త్రాల ఉత్పత్తిని 250 బిలియన్ డాలర్లకు, ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల మేరకు సాధించేందుకు మార్గసూచిపై చర్చించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్.


అంతర్జాతీయ మార్కెట్లో ఇండియాను ఉన్నతస్థాయిలో నిలబెట్టేందుకు సమష్టి కృషి అవసరం : టెక్స్టైల్ మంత్రిత్వశాఖ చింతన్ శిబిర్లో కేంద్ర మంత్రి శ్రీ గోయల్

Posted On: 19 JUL 2023 9:29PM by PIB Hyderabad

ఇండియా 2030 నాటికి 100బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల తయారీ, 100 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు సాధించేలా చూసేందుకు మార్గసూచీపై కేంద్ర టెక్స్టైల్స్ , వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ చర్చించారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన చింతన్ శిబిర్లో అధికారులు, మంత్రిత్వశాఖ సిబ్బందితో మాట్లాడుతూ శ్రీ గోయల్, టెక్స్టైల్ రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు , అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా చేసేందుకు,సమగ్ర వైఖరి అవసరమని పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనలతో ముందుకు రావలసిందిగా ఆయన వారిని కోరారు.  మరింత మెరుగైన సేవలు అందించేందుకు సంస్థాగత వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించాల్సిన ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావించారు. టెక్స్టైల్ మంత్రత్వశాఖ , ఈ రంగానికి చెందిన పలు అంశాలపై మేథో మధనం చేసేందుకు జూలై18న చింతన్ శిబిర్ను ఏర్పాటు చేసింది.

ఈ సమావేశాన్ని కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయమంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆర్ధిక వృద్ధిలో టెక్స్టైల్ రంగ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, వాల్యూ చెయిన్లో ని అన్ని విభాగాలలో వృద్ధిని సాధించేందుకు సమష్టి కృషిపై దృష్టిపెట్టాల్సిన అవసరం గురించి ఆమె నొక్కి చెప్పారు.

టెక్స్ టైల్ మంత్రిత్వశాఖకు దేశవ్యాప్తంగా గల క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ఒక రోజంతా జరిగిన చింతన్ శిబిర్లో పాల్గొన్నారు.
ఎగుమతుల పెంపు, పెట్టుబడుల పెంపు, సుస్థిరత, సహజ ఫైబర్నుంచి స్వయంగా తయారు  చేసిన ఫైబర్ వాడకం, సేవల అందుబాటుపెంపు వంటి అంశాలపై  మేధో మథన చర్చలు నిర్వహించారు.
ఇందుకు సంబంధించి ఆయా అధికారులు, సిబ్బంది బృందాలు వివిధ సమస్యలకు పరిష్కారాలు, ప్రత్యేక  సూచనలు చేశారు. సామర్ధ్యాల నిర్మాణ కమిషన్ తరఫున బృంద సెషన్ను ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారి మధ్య సంప్రదింపులు, సమాచార బట్వాడాను మరింత మెరుగుపరిచేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడింది.
జీవనవిధానాల శిక్షకుడు, ప్రేరణ అందించే ప్రసంగాలు చేసే గౌర్ గోపాల్ దాస్ , కామ ఆయుర్వేద సిఇఒ,సహ వ్యవస్థాపకుడు శ్రీ వివేక్ సాహ్నిలు తమ అనుభవాలను, ఆలోచనలను ఈ సమావేశంలో పాల్గొన్నవారితో పంచుకున్నారు.

 

***


(Release ID: 1940899) Visitor Counter : 187
Read this release in: Tamil , English , Urdu , Hindi