మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌డిడిబి ఆనంద్‌లో జి 20 వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సుస్థిర పశుసంపద పరివర్తనపై అంతర్జాతీయ సింపోజియంను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా


శ్రీ పర్షోత్తం రూపాలా సింపోజియం నిర్వహించడంలో ఎన్‌డిడిబికి ప్రశంస, పశుసంవర్థక రంగంలో సాంకేతికత పాత్రపై దృష్టి

Posted On: 19 JUL 2023 4:19PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, G20అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజి) ఆధ్వర్యంలో, కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా,  ఎన్‌డిడిబి, ఆనంద్‌లో నిన్న సస్టైనబుల్ లైవ్‌స్టాక్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై అంతర్జాతీయ సింపోజియం ప్రారంభించారు.

 

సింపోజియం నిర్వహించినందుకు  ఎన్‌డిడిబిని శ్రీ రూపాలా  అభినందించారు. పశుసంవర్థక రంగంలో సాంకేతికత పాత్రను నొక్కి చెప్పారు. సుస్థిర పరివర్తన కోసం పశుసంవర్ధక రంగంలో వివిధ ఆవిష్కరణలను వ్యాప్తి చేయడానికి సింపోజియం చర్చలు సహాయపడతాయని ఆయన అన్నారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ కోసం ప్రధాన మంత్రి ఆలోచనలతో కూడిన  అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పశుసంవర్ధక శాఖను స్వతంత్ర మంత్రిత్వ శాఖగా మార్చారని, ఇది ఈ రంగం వృద్ధికి గణనీయంగా దోహదపడిందని శ్రీ రూపాలా అన్నారు. మొబైల్ వెటర్నరీ యూనిట్ల విస్తరణ, జాతి వృద్ధి క్షేత్రాలు, ఎన్ఏడిసిపిలు  దీనికి ఉదాహరణలని. కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి ఒక సంవత్సరం ముందు పశువులకు టీకాలు వేయడానికి కూడా ప్రధాని నిధులు కేటాయించారని తెలిపారు. 

 

డిఏహెచ్డి కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ మాట్లాడుతూ, రైతులు, ఈ రంగానికి సంబంధించిన ఇతర వాటాదారుల సంఖ్య, జీవనోపాధులు, ఆహార భద్రత, ఉత్పత్తి వ్యవస్థల ప్రాముఖ్యతను అందించడంలో దాని పాత్రను పరిగణనలోకి తీసుకుంటే పశుసంవర్ధక రంగంలో స్థిరమైన పరివర్తన మరింత సందర్భోచితంగా మారుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంభావ్య వాటాదారులందరినీ ఒకచోట చేర్చడానికి ఇది ఒక ఆదర్శవంతమైన కార్యక్రమమని తెలిపారు.

ఎన్డిడిబి ఛైర్మన్ డాక్టర్ మీనేష్ షా తన స్వాగత ప్రసంగంలో, పశుసంవర్ధక రంగాన్ని మరింత నిలకడగా మార్చడానికి, మరింత సమర్థవంతమైన, కలుపుకొని, స్థితిస్థాపకంగా, స్థిరమైన రంగంగా రూపుదిద్దెందుకు నిపుణుల మధ్య విస్తృతంగా చర్చలు జరగాలని చెప్పారు - 'మెరుగైన ఉత్పత్తి, మెరుగైన పోషకాహారం, మెరుగైన పర్యావరణం, మెరుగైన జీవితం.' ఈ సింపోజియం ఖచ్చితంగా మనందరికీ పరస్పరం నేర్చుకోవడానికి, ఒక వ్యూహాన్ని రూపొందించడానికి, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న కొన్ని సమకాలీన సవాళ్లను పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదికను అందిస్తుందని తెలిపారు. 

జీవనోపాధికి, పోషకాహారం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భారతదేశం నిరంతరం డెయిరీని ఉపయోగించుకుందని ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) డైరెక్టర్ జనరల్ కరోలిన్ ఎమాండ్ అన్నారు. పరివర్తనను పెంచడానికి నిర్దిష్ట ఉదాహరణఉన్నాయని, ఈ రంగం చాలా అవకాశాలను కలిగి ఉందని తెలిపారు. పశుసంపద పాత్రను గుర్తించడం, రంగంపై ఖర్చును పెంచడం ముఖ్యమైనదని తెలిపారు. 

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ (డిఏహెచ్డి), ఫిషరీస్ మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, భారత ప్రభుత్వం; నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి); ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ సంయుక్తంగా  2 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాయి. 

 

*****


(Release ID: 1940893) Visitor Counter : 167