వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ గా శ్రీమతి నివృత్తి రాయ్ నియామకం
Posted On:
19 JUL 2023 6:04PM by PIB Hyderabad
ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా శ్రీమతి నివృత్తి రాయ్ జూలై 12, 2023న పదవీ బాధ్యతలు స్వీకరించారు. పరిశ్రమలె మరియు అంతర్గత వాణిజ్యం (డి.పి.ఐ.ఐ.టి) ప్రోత్సాహక శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి మన్మీత్ కె నందా నుండి శ్రీమతి నివృత్తి రాయ్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి మన్మీత్ కె నందా మార్చి 2023లో సంస్థ ఎండీ & సీఈఓగా అదనపు ఛార్జీ తీసుకున్నారు. సాంకేతిక రంగంలో శ్రీమతి రాయ్ చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీమతి నివృత్తి రాయ్ ఇంటెల్లో గ్లోబల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ లీడర్‌గా 29 సంవత్సరాల పాటు అద్భుత సేవనందిచిన తరువాత ఇన్వెస్ట్ ఇండియాలో చేరారు. ఆమె గత ఏడు సంవత్సరాలుగా ఇంటెల్ ఇండియాను కంట్రీ హెడ్‌గా ఉంటూ సంస్థను ముందుకు నడిపించింది, భారతదేశంలో ఇంటెల్ యొక్క వృద్ధి మరియు పెట్టుబడులను నడిపించింది. ఇంటెల్ ఇండియాలో ఆమె పదవీకాలంలో, ఆమె స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ మరియు విధాన రూపకల్పనలో ముఖ్యంగా క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో గణనీయంగా దోహదపడింది. ఆమె వివిధ పారిశ్రామిక సంస్థలు మరియు ప్రభుత్వ కమిటీలలో నాయకత్వ బృందంలో భాగంగా ఉన్నారు. పరిశ్రమ సంఘాలు, వ్యాపార నాయకులు మరియు ప్రభుత్వ నాయకులతో సన్నిహితంగా పని చేయడంలో అనుభవం కలిగి ఉన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి న్యూ ఇండియా దార్శనికతతో రూపొందించబడిన ఇన్వెస్ట్ ఇండియా నేడు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. సహా ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను అమలు చేయడంలో దాని స్పష్టమైన సహకారం మరియు కీలక పాత్ర కోసం వాటాదారులచే బాగా గుర్తించబడింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, మరియు ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడానికి, అధిక స్థాయి పారదర్శకత, నైతికత మరియు కార్పొరేట్ పాలనను పొందుపరచడానికి ఇన్వెస్ట్ ఇండియా ప్రైవేట్ రంగ నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాకు డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. బోర్డులోని ఇతర సభ్యులుగా శ్రీ పి. కె. త్రిపాఠి, సెక్రటరీ (కోఆర్డినేషన్), క్యాబినెట్ సెక్రటేరియట్; శ్రీమతి ఆర్తి భట్నాగర్, అదనపు కార్యదర్శి & ఆర్థిక సలహాదారు, డీపీఐఐటీ; శ్రీ ఎండీ నూర్ రెహమాన్ షేక్, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి; శ్రీ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్; శ్రీ పంకజ్ ఆర్. పటేల్, చైర్ పర్సన్, కాడిల్లా హెల్త్‌కేర్; శ్రీ హర్షవర్ధన్ నియోటియా, చైర్‌పర్సన్, అంబుజా నియోటియా గ్రూప్; శ్రీమతి రేఖ ఎం. మీనన్, చైర్‌పర్సన్ & సీనియర్ ఎండీ, యాక్సెంచర్; శ్రీమతి దేబ్జానీ ఘోష్, నాస్కామ్ ప్రెసిడెంట్; మరియు శ్రీ చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐగా, ఉన్నారు.
***
(Release ID: 1940889)