నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్


భారతదేశ సముద్రయాన రంగంలో 10 లక్షల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి పెట్టుబడి అవకాశాలు గుర్తించబడ్డాయి: శ్రీ సోనోవాల్

సముద్ర రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని 15 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కృషి జరగాలి.. శ్రీ సోనోవాల్

గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్, 2023 లో పాల్గొంటున్న 50కి పైగా దేశాలు

Posted On: 18 JUL 2023 3:33PM by PIB Hyderabad

గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GIMS) 2023 సన్నాహక కార్యక్రమాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. వ్యాపారంలో సహకారాన్ని పెంపొందించడానికి, సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడం విజ్ఞానం, సాంకేతికత కోసం సహకారంతో పాటు నూతన  పెట్టుబడి అవకాశాలను గుర్తించడం లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. ప్రారంభ  కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పిం, జలమార్గాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో జరగనున్న  గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 సన్నాహక సమావేశంలో ప్రసంగించిన  శ్రీ సోనోవాల్ భారతదేశ ఆర్థిక పురోగతి లో సముద్ర రంగం  కీలక పాత్ర పోషిస్తుందన్నారు.   ఆసియా-పసిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. అభివృద్ధి సాధనలో భారతదేశం తన వంతు పాత్ర నిర్వహించడానికి అవసరమైన శక్తి, సామర్ధ్యాలు కలిగి ఉందని శ్రీ  సోనోవాల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాల వల్ల ఓడరేవులు, షిప్పింగ్, అంతర్గత జలమార్గాల రంగం అభివృద్ధి  పథంలో నడుస్తోందని మంత్రి తెలిపారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన విధంగా 2047 నాటికి ఆర్థిక స్వావలంబన సాధించడానికి భారతదేశం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు విజయం సాధించడంలో  సముద్ర రంగం పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.  అపారమైన సంభావ్యత గణనీయమైన మరియు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. సముద్ర రంగం అందిస్తున్న అపారమైన ఆక్షలు గుర్తించి, వెలికి తీయడానికి తమ మంత్రిత్వ శాఖ  గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్‌ను నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.  దేశంలో సముద్ర రంగంలో  10 లక్షల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని గుర్తించామని ఆయన తెలిపారు. సముద్ర రంగం ద్వారా నూతనంగా యువతకి  15 లక్షలకు మించి   ఉపాధి అవకాశాలు  లభిస్తాయని తెలిపిన మంత్రి దేశ ఆర్థికాభివృద్ధి కి సముద్ర రంగం తన వంతు సహకారం అందిస్తుందన్నారు. భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు, అభివృద్ధి సాధించడానికి అనుసరించ వలసిన కార్యాచరణ ప్రణాళికను సదస్సు సిద్ధం చేస్తుందని మంత్రి తెలిపారు. సముద్రయానం రంగంలో పనిచేస్తున్న సంస్థలు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. 

సముద్రయానం రంగంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాలని శ్రీ సోనోవాల్ జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించి అమలు చేస్తున్న విధానాలతో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ( బిమ్స్‌టెక్ )  ప్రాంతంలో ప్రాంతీయ వాణిజ్య పురోగతికి నాయకత్వం వహించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.  వివిధ ప్రాంతీయ ప్రాజెక్టుల అభివృద్ధికి భారతదేశం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.   5,000 కి.మీ బహుళ-దేశ జలమార్గాల అభివృద్ధికి భారతదేశం సిద్ధం చేసిన   ప్రణాళిక  వల్ల ఈ ప్రాంతం అంతటా వాణిజ్యం , రవాణాను సమర్థవంతంగా సులభతరం చేస్తుందని మంత్రి వివరించారు. 

నీలి ఆర్థిక వ్యవస్థ  అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి, పెట్టుబడులు ఎక్కువ చేయడానికి అనుసరించవలసిన కార్యాచరణ ప్రణాళికను సదస్సులో రూపొందిస్తారు.స్టార్టప్‌లు, పరిశోధకులు, ఇంక్యుబేటర్లు ,ఇన్నోవేటర్‌లకు వారి సాంకేతికత, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సదస్సు  వేదికగా నిలుస్తుంది..  భవిష్యత్ నౌకాశ్రయాలు; కర్బన ఉద్గారాల తగ్గింపు, తీర ప్రాంత నౌకాయానం, లోతట్టు జలమార్గాల రవాణా; నౌకా నిర్మాణం, మరమత్తులు,పునర్వినియోగం,ఆర్థిక అవసరాలు,బీమా, వినూతన ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలు, సముద్ర భద్రత, సముద్ర పర్యాటకం.రంగాలపై గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 దృష్టి సారించి చర్చలు జరుపుతుంది.

పర్యావరణ పరిరక్షణకు భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన శ్రీ  సోనోవాల్  నౌకా రంగం వల్ల కలుగుతున్న ప్రభావాలను పూర్తిగా తగ్గించడానికి కృషి చేస్తోందన్నారు.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ   నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్‌లో అగ్రస్థానానికి ఎదగాలనే స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో భారతదేశం 2వ స్థానంలో ఉందని మంత్రి వివరించారు.  రాబోయే రెండు దశాబ్దాలలో రీసైక్లింగ్‌లో భారతదేశం  చూసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రధాన రేవులు   ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించామన్నారు.   ఓడరేవులలో బ్యాటరీతో నడిచే వాహనాలు మరియు ఉపకరణాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి తెలిపారు..విశాలమైన తీర ప్రాంతం, 200 కి పైగా ఓడరేవులు కలిగి ఉన్న  భారతదేశం వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉందని శ్రీ  సోనోవాల్ అన్నారు.  సాగర్‌మాల, ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ వంటి  కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం ప్రపంచ వాణిజ్య రంగంలో సుస్థిర స్థానం సాధించిందన్నారు.   మౌలిక సదుపాయాల ఆధునీకరణ,, మెరుగైన రావన్న సౌకర్యం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ఓడ రేవులు ఆధారంగా పనిచేసే పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి వివరించారు.  

 శ్రీ శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ భారతదేశాన్ని గ్లోబల్ మెరిటైమ్ హబ్‌గా నిలబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 కీలకమైన మైలురాయిగా ఉంటుందన్నారు. చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా సముద్ర రంగాన్ని సుస్థిర వృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. 

ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్  ముంబై పోర్ట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ రాజీవ్ జలోటా,ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సిన్హా, ఫారిన్ ఓనర్స్ రిప్రజెంటేటివ్ సీఈఓ  శ్రీ రాజేష్ టాండన్,  ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ సీఈఓ  శ్రీ అనిల్ దేవ్లీ,  ఫిక్కీరవాణా మౌలిక సదుపాయాల  కమిటీ  చైర్మన్ శ్రీ ధృవ్ కోటక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కార్యక్రమంలో గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023  బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 

గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GMIS), 2023 గురించి:

   భారతదేశ సముద్ర రంగంలో అవకాశాలు అన్వేషించడానికి, సవాళ్లను అర్థం చేసుకోవడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి పరిశ్రమలోని కీలక వ్యక్తులను ఒకచోట చేర్చడానికి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023  నిర్వహిస్తున్నారు మూడవ సారి జరుగుతున్న సదస్సులో    దేశీయ  అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడి  అవకాశాలు వివరించడం లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. గతంలో  మారిటైమ్ ఇండియా సదస్సుగా కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సంవత్సరం 'గ్లోబల్' మారిటైమ్ ఇండియా సమ్మిట్‌గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. . 2023 అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు  న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సదస్సు జరుగుతుంది. ఫిక్కీ  ప్రత్యేక పరిశ్రమ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 

రిజిస్ట్రేషన్ వివరాలతో సహా గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 కి సంబంధించిన మరిన్ని వివరాలు   www.maritimeindiasummit.comలోని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. 

*****




(Release ID: 1940602) Visitor Counter : 154