జౌళి మంత్రిత్వ శాఖ
ఎంఎంఎఫ్ దస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, సాంకేతిక జౌళి ఉత్పత్తుల కోసం తాజా దరఖాస్తులను ఆహ్వానించేందుకు పిఎల్ఐ పథకం పునః ప్రారంభం
प्रविष्टि तिथि:
18 JUL 2023 3:40PM by PIB Hyderabad
సాంకేతిక జౌళి ఉత్పత్తులు అయిన ఎంఎంఎఫ్ దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు కోసం జౌళి పిఎల్ఐ పథకం కింద ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు జౌళి మంత్రిత్వ శాఖ పరిశ్రమవాటాదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పిఎల్ఐ పోర్టల్‌ను 31 ఆగస్టు 2023 వరకు తిరిగి తెరిచి ఉంచాలని నిర్ణయించింది.
ఇంతకు ముందు జారీ చేసిన నోటిఫికేషన్లు, మార్గరద్శకాలలోని నియమ నిబంధనలు అన్నీ యధాప్రకారంగా వర్తిస్తాయి.
ఇంతకు ముందు జారీ చేసిన నోటిఫికేషన్లను దిగువన ప్రస్తావించడం జరుగుతోందిః
1. పిఎల్ఐ- జౌళి పథకం గెజెట్ నోటిఫికేషన్ - తేదీ 24 సెప్టెంబర్ 2021
2. పిఎల్ఐ- జైళి కోసం పథకం మార్గదర్శకాలు - తేదీ 28 డిసెంబర్ 2021
3. అమెండ్‌మెంట్ (సవరణ) గజెట్ నోటిఫికేషన్ - తేదీ 22 ఫిబ్రవరి 2022
4.అమెండ్‌మెంట్ (సవరణ) గజెట్ నోటిఫికేషన్ - తేదీ - 09.06.2023
5. అమెండ్‌మెంట్ (సవరణ) మార్గదర్శకాలు - తేదీ 09.06.2023
***
(रिलीज़ आईडी: 1940598)
आगंतुक पटल : 182