వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “విజన్ 2047” అమలుఫై జరిగిన పనిని సమీక్షించి, అమలుకు కార్యాచరణను రూపొందించడానికి చింతన్ శిబిర్ నిర్వహించిన వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“భారత్ దాల్” విక్రయం, ఆత్మ నిర్భర్ కింద “శనగ ప్రోత్సాహం ప్రచారం” ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్
టమాటో ధరల స్థిరీకరణకు శాఖ జోక్యాన్ని ప్రశంసించిన శ్రీ గోయల్
Posted On:
17 JUL 2023 8:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “విజన్ 2047” అమలుకు జరిగిన పనిని సమీక్షించి, అమలుకు కార్యాచరణను రూపొందించడానికి చింతన్ శిబిర్ ను వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహించింది. ఈ సందర్బంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహరం, ప్రభుత్వ పంపిణీ, టెక్స్ టైల్, వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ “భారత్ దాల్ విక్రయం”, “శనగ ప్రోత్సాహం ప్రచారం” ప్రారంభించారు. శనగ ప్రచారం కార్యక్రమం కింద దాని వినియోగం ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేస్తారు. ఇది ఆత్మ నిర్భర్ కు కూడా మద్దతు ఇస్తుంది.
టొమాటొ ధరల స్థిరీకరణకు వినియోగదారుల శాఖ సరైన సమయంలో జోక్యం చేసుకోవడాన్ని ఈ సందర్భంగా శ్రీ గోయల్ ప్రశంసించారు. దీని కింద టొమాటొ పండుతున్న రాష్ట్రాల నుంచి సేకరించి ధరలు అధికంగా ఉన్న మార్కెట్లలో డిస్కౌంట్ ధరకు విక్రయిస్తారు.
దేశవ్యాప్తంగా ఏడు రోజులు 24 గంటలూ పని చేసే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 17 భాషల్లో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. వినియోదారుల ఫిర్యాదుల పరిష్కారంలో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథను వినియోగించడాన్ని ఆయన ప్రోత్సహించారు. బంగారం హాల్ మార్కింగ్ కు , వినియోగదారుల సంక్షేమం ప్రామాణిక ప్రచారానికి బిఐఎస్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
శ్రమించి పని చేసే వినియోగదారుల శాఖ అధికారులు దశాబ్దికి పైగా చేసిన కృషిని ప్రశంసిస్తూ కొత్త ఆలోచనలు ప్రతిపాదించాలని కొత్త అధికారులను ఆహ్వానించారు. 140 కోట్లకు పైగా భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా బంధం గల శాఖ వినియోగదారుల వ్యవహారాల శాఖ అని గౌరవ మంత్రి అన్నారు. నవ్య, సాంప్రదాయ విరుద్ధ ఆలోచనలు ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
చింతన్ శిబిర్ తరచూ నిర్వహించడం ద్వారా మనం ఒక టీమ్ గా పని చేస్తూ ప్రగతిశీల ఆలోచనలు ముందుకు తీసుకురావాలని శ్రీ గోయల్ సూచించారు.
వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ స్వాగతోపన్యాసం ఇస్తూ నవ్యత, కొత్త ఆలోచనలు నేర్చుకోవాలని స్ఫూర్తిమంతం చేశారు. అనంతరం ఆర్ట్ లివింగ్ సీనియర్ ఫాకల్టీ శ్రీమతి అరుణిమ సిన్హా నాయకత్వంలో “పని చేసే ప్రదేశంలో యోగా” కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశంలో ఆరోగ్య కర వాతావరణం నెలకొల్పడంలో యోగా ప్రాధాన్యతను ఆమె తన ప్రసంగంలో వివరించారు. అధికారులకు ఆమె డెస్క్ వద్ద చేసుకోగల తేలికపాటి వ్యాయామాలు బోధించారు . ఆఫీస్ లో పని చేసుకుంటున్న సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.
నాలుగు సెషన్లలో వివిధ అంశాలపై చర్చించారు. వినియోగదారుల రక్షణ, వినియోగదారుల ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం, వినియోగదారులకు నాణ్యత హామీ, వర్థమాన పరీక్షా విధానాలు, నూతన టెక్నాలజీలు అనే అంశాలపై సంభాషణాత్మక చర్చలు జరిగాయి. సిబ్బంది తమ అభిప్రాయాలు. సలహాలు తెలియజేయడానికి, తమ మదిలోని ప్రశ్నలు అడగడానికి ఈ సెషన్ ఉపయోగపడింది.
గెస్ట్ స్పీకర్ శ్రీ సోను శర్మ తమకు అనుకూలమైన జోన్ల నుంచి బయటకు వచ్చి అవరోధాల ఛేదనకు కృషి చేయాలని ఆడియన్స్ కు సూచించారు.
***
(Release ID: 1940402)
Visitor Counter : 180