పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఆయిల్ 2023 (విశ్లేషణ మరియు అంచనా 2028) మధ్యకాలిక మార్కెట్ నివేదిక విడుదల చేసిన ఐఈఏ
అన్ని రంగాల్లో వృద్ధి సాధించడంతో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ లో ఇంధన డిమాండ్ వేగంగా పెరుగుతోంది: పెట్రోలియం కార్యదర్శి
2025 నాటికి ఎంఎస్ లో 20% ఇథనాల్ ను కలపడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపుకు ప్రాధాన్యత - శ్రీ పంకజ్ జైన్
2027 నాటికి వృద్ధిలో చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది .. ఐఈఏ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ మార్కెట్ విభాగాధిపతి టోరిల్ బోసోని
Posted On:
17 JUL 2023 6:59PM by PIB Hyderabad
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పిపిఎసి) సహకారంతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) రూపొందించిన ఆయిల్ 2023 మధ్యకాలిక మార్కెట్ నివేదిక విడుదల అయ్యింది.ఐఇఎ ఆయిల్ 2023 - సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్ టు 2028 పేరిట రూపొందిన నివేదిక విడుదల కార్యక్రమంలో భారతదేశానికి చెందిన ప్రముఖ చమురు, గ్యాస్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
విడుదల కార్యక్రమంలో మాట్లాడిన పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ " ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే భారతదేశంలో ఇంధన డిమాండ్ వేగంగా పెరుగుతోంది. .పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పెరుగుతున్న జనాభా వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నారు." అని అన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినియోగం 223 ఎంఎంటిగా ఉందని శ్రీ పంకజ్ జైన్ తెలిపారు. అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూస్తే ఇంధన వినియోగం 12% పెరిగిందన్నారు. . 2022-23 లో అత్యంత ఎక్కువగా హెచ్ఎస్డి 85.9 ఎంఎంటీ ల మేరకు వినియోగం అయ్యిందన్నారు. ఎంఎస్ 34.9 ఎంఎంటీ ల వినియోగం అయ్యిందన్నారు. హెచ్ఎస్డి వినియోగం 12.1 శాతం, ఎంఎస్ వినియోగం 13.4% పెరిగిందని వివరించారు.
హెచ్ఎస్డి,ఎంఎస్ వినియోగం కరోనాకు ముందు జరిగిన వినియోగానికి మించి ఉన్నాయని శ్రీ జైన్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఇంధన వినియోగం జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీ జైన్ వెల్లడించారు.. ప్రస్తుత సంవత్సరంలో కూడా వృద్ధి జోరు కొనసాగుతోందిని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలో 4 వ అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందిందని తెలిపిన శ్రీ జైన్ భారతదేశం అతిపెద్ద ఎల్ఎన్జి టెర్మినల్ సామర్థ్యం కలిగిన దేశంగా , 4 వ అతిపెద్ద ఆటో మార్కెట్ , 3 వ అతిపెద్ద బయో ఇంధనాల ఉత్పత్తిదారుగా స్థానం సాధించింది అని కార్యదర్శి పెట్రోలియం తెలిపారు. కర్బన ఉద్గారాలు తగ్గించే అంశంపై దృష్టి సారించిందని ఆయన అన్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే పెట్రోల్ లో 12% ఇథనాల్ మిశ్రమాన్ని సాధించామని 2025 నాటికి 20% బ్లెండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.
ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధి మందగిస్తుందని అంచనా వేసిన ఐఈఏ నివేదిక 2028 నాటికి డిమాండ్ దాదాపు ఆగిపోతుంది అని పేర్కొంది. ఇంధన భద్రత కోసం క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ వైపు వేగంగా మారడం దీనికి ప్రధాన కారణం అని నివేదికలో పేర్కొన్నారు. పెట్రో కెమికల్ విమానయాన రంగం నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ 2023 లో వార్షిక డిమాండ్ వృద్ధి 2.4 ఎంబి / డి నుండి 2028 లో కేవలం 0.4 ఎంబి / డికి తగ్గుతుంది అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, జీవ ఇంధనాల వృద్ధి, ఇంధన పొదుపు మెరుగుపడటంతో 2026 తర్వాత రవాణాకు చమురు వాడకం తగ్గుతుంది అని నివేదిక పేర్కొంది. అయితే, కొన్ని దేశాలు ముఖ్యంగా చైనా, భారతదేశం లో వినియోగం అంచనాల మేరకు పెరుగుతుందని పేర్కొన్నారు.
2022-28 లో పెరుగుదలలో మూడొంతులు ఆసియా దేశాల్లో ఉంటుంది అని ఐఈఏ లోని చమురు పరిశ్రమ, మార్కెట్ విభాగం అధిపతి టోరిల్ బోసోని అన్నారు, 2027 నాటికి వృద్ధిలో చైనాను భారత్ అధిగమిస్తుంది అని ఆయన వెల్లడించారు. .జీవ ఇంధనాలు వంటి ప్రత్యామ్నాయ స్వచ్ఛమైన ఇంధనాలు 2028 నాటికి కొత్త ద్రవ ఇంధన సరఫరా అవసరాల్లో 10% అందిస్తాయని భావిస్తున్నారు. 2022 నుంచి 2028 వరకు బయో ఫ్యూయెల్ ఉత్పత్తి దాదాపు 600 కేబీ/డీకి పెరుగుతుంది అని నివేదిక పేర్కొంది. బ్రెజిల్, ఇండోనేషియా, భారత్ సంయుక్తంగా 70 శాతం సమకూర్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
చమురు, గ్యాస్ అన్వేషణ, వెలికితీత మరియు ఉత్పత్తిలో ప్రపంచ పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఐఇఎ నివేదిక అంచనా వేసింది, ఇది సంవత్సరానికి 11% పెరిగి 2023 నాటికి 528 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒపెక్ + కూటమి వెలుపల చమురు ఉత్పత్తి దేశాలు మధ్య కాలికంగా ప్రపంచ సరఫరా సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అమెరికా , బ్రెజిల్ , గయానా నేతృత్వంలో 2028 నాటికి 5.1 ఎంబి / డి పెరుగుతుందని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ లు ఒపెక్ + లో సామర్థ్య పెంపు ప్రణాళికలలో ముందంజలో ఉన్నాయి.
ఈ స్థాయి పెట్టుబడులు కొనసాగితే, భవిష్యత్తు అవసరాలు తీర్చడానికి తగిన చమురు ఉత్పత్తి అవుతుంది అని నివేదికలో పేర్కొన్నారు., నికర సున్నా ఉద్గారాల మార్గంలోకి వచ్చే ప్రపంచంలో ఇది అవసరమైన మొత్తానికి మించి పెట్టుబడులు ఉంటాయని అంచనా వేశారు.
***
(Release ID: 1940375)
Visitor Counter : 185