ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు రోజుల స్వాస్థ్య చింతన్ శివిర్ ముగింపు


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయుష్మాన్ భారత్ కార్డ్‌లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిలు అందరికీ పూర్తిగా అందేలా మన దృష్టి విధానాల ద్వారా నిర్ధారించుకోవడానికి సంకల్పిద్దాం; దేశం నుండి కుష్టు వ్యాధి, కాలా అజార్, మలేరియాను నిర్మూలించండి, రాష్ట్రాలను టీబీ ముక్త్‌గా మార్చండి: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను, మరింత బలోపేతం చేయడానికి, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయడానికి అమృత్ కాల్ సమయంలో మార్గనిర్దేశం చేసే రాష్ట్రాల ఆరోగ్య రంగానికి దూరదృష్టితో కూడిన రోడ్‌మ్యాప్‌లను రూపొందించాలని సంకల్పిద్దాం"

చింతన్ శివిర్ రాష్ట్రాలలో ఒక మంచి చర్చకు అవకాశం ఇస్తుంది. ఈ చర్చలు దేశంలో ఆరోగ్య సంరక్షణలో బలమైన ఫలితాలకు దారితీస్తాయని నమ్ముతున్నాను: శ్రీ ఎస్పీ సింగ్ బఘెల్

Posted On: 15 JUL 2023 6:13PM by PIB Hyderabad

“ఈ చింతన్ శివిర్ నుండి మన రాష్ట్రాలకు తిరిగి వెళ్ళినప్పుడు, ఈ సమ్మేళనం నుండి నేర్చుకున్న వాటిని సరిగ్గా వినియోగించుకోవాలి.  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిలు దేశంలో అందరికి అందిందన్న సంకల్పంతో కేంద్రీకృత విధానాల ద్వారా పరిష్కరిద్దాం; మన రాష్ట్రాలను టీబీ ముక్త్‌గా మార్చండి, దేశం నుండి కుష్టువ్యాధి, కలాజర్, మలేరియాను నిర్మూలించడానికి కూడా కృషి చేయండి"... ఈ రోజు డెహ్రాడూన్‌లో రెండు రోజుల పాటు జరిగిన  స్వాస్థ్య చింతన్ శివిర్  ముగింపు సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తన ముగింపు ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు.

స్వాస్థ్య చింతన్ శివిర్‌లో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్ ఫై సింగ్ బఘేల్, శ్రీ టిఎస్ సింగ్ డియో (ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఛత్తీస్‌గఢ్) పాల్గొన్నారు. శ్రీ బ్రజేష్ పాఠక్ (ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఉత్తరప్రదేశ్), శ్రీ బిఎస్ పంత్ (పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి, సిక్కిం), శ్రీ విశ్వాస్ సారంగ్ (రాష్ట్ర వైద్య విద్యా మంత్రి, మధ్యప్రదేశ్), శ్రీ కె. లక్ష్మీ నారాయణన్ (పుదుచ్చేరి). శ్రీ ధన్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), శ్రీమతి రజినీ విడదల (ఆంధ్రప్రదేశ్), శ్రీ అలో లిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), శ్రీ కేశబ్ మహంత (అస్సాం), శ్రీ రుషికేష్ పటేల్ (గుజరాత్), శ్రీ బన్నా గుప్తా (జార్ఖండ్) సహా వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, శ్రీ దినేష్ గుండు రావు (కర్ణాటక), శ్రీ సపమ్ రంజన్ సింగ్ (మణిపూర్), డా. ఆర్. లాల్త్యాంగ్లియానా (మిజోరం),  మేధోమథన ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.

 

రెండు రోజుల సదస్సులో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
"రాష్ట్రాల పౌరులకు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి మన ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేసేందుకు దేశంలోని అమృత్ కాల్ రాబోయే 25 సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌గా పనిచేసే విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిద్దాం" అని ఆయన పేర్కొన్నారు.

దేశం కోసం భవిష్యత్తు ఆరోగ్య విధానాలను రూపొందించేందుకు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు తమ సొంత చింతన్ శివిర్‌ను నిర్వహించాలని ఆయన ప్రోత్సహించారు, ఇక్కడ వారి నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ అవసరాలు మరియు ప్రాధాన్యతల ప్రకారం స్థానికీకరించిన పరిష్కారాలను పొందవచ్చు. హెల్త్‌కేర్‌లో పాలసీ రూపకల్పనలో కొత్త తరాల ఆకాంక్షలు మరియు ఆలోచనలను చేర్చాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.

****


(Release ID: 1940064)
Read this release in: English , Urdu , Marathi , Hindi