పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ విమానాశ్రయంలో 4వ రన్‌వే, ఎలివేటెడ్ టాక్సీవేను ప్రారంభించిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
- ఐడీఐ విమానాశ్రయం దేశంలో నాలుగు రన్‌వేలు మరియు ఎలివేటెడ్ టాక్సీవే కలిగి ఉన్న మొదటి విమానాశ్రయం
• రన్‌వే మొత్తం సుగమం చేసిన పొడవు 4.4 కి.మీ, మరియు దాని వెడల్పు 45మీ
• రన్‌వే ఎ-380 & బి-777తో సహా వెడల్పయిన బాడీ గల విమానాలనూ నిర్వహించగలదు
• డ్యూయల్-వే ఎలివేటెడ్ టాక్సీవే ఉత్తర & దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను కలుపుతుంది
• టాక్సీవే విమానాల కోసం టాక్సీ దూరాన్ని 7 కి.మీ మరియు వార్షిక కార్బన ఉద్గారాలను 55,000 టన్నుల మేర తగ్గించడంలో సహాయపడుతుంది
Posted On:
14 JUL 2023 5:31PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈరోజు న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్వే మరియు డ్యూయల్-వే ఎలివేటెడ్ టాక్సీవేను ప్రారంభించారు. దీంతో న్యూఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం దేశంలో నాలుగు రన్వేలను కలిగి ఉన్న మొదటి విమానాశ్రయంగా మారింది. దేశంలో ఎలివేటెడ్ టాక్సీవేని కలిగి ఉన్న మొదటి విమానాశ్రయంగా కూడీ ఐజీఐ అవతరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన, మరియు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ సహాయ మంత్రి, జనరల్ (డా.) విజయ్ కుమార్ సింగ్ (రిటైర్డ్.), ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ జి. ఎం. రావు, కూడా పాల్గొన్నారు. ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే (ఈసీటీ) ల్యాండింగ్ తర్వాత మరియు టేకాఫ్లకు ముందు ఫ్లైయర్లు టార్మాక్పై గడిపే సమయాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. దీనికి తోడు నాలుగు రన్వే కార్యకలాపాలు మరియు ఈసీటీ ఐడీఐఏ వద్ద సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ఇది 1700లకు పైగా రాకపోకలను నిర్వహించగలదు. ఈ సందర్భంగా శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పౌర విమానయాన రంగం రవాణా రంగానికి మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక శక్తి పెరుగుదలలో ఇది కీలకమైన దోహదకారి మారుతుందని అన్నారు. ఈ రోజు భారత పౌర విమానయానానికి మౌలిక సదుపాయాల వైపు మరియు సేవల దిశగా ఒక మైలురాయిలాంటి రోజు. ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే భారతదేశంలోనే మొదటిది. అలాగే, ఈ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే (ఈసీటీ) వార్షిక ప్రాతిపదికన దాదాపు 55 వేల టన్నుల కార్బన ఉద్గారాల తగ్గేలా చేస్తుంది. దీనికి తోడు ఈ ఈసీటీ, నాల్గో రన్వే మరియు కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ 1తో పాటు, ఢిల్లీ విమానాశ్రయాన్ని భవిష్యత్తు-సిద్ధంగా మారుస్తుంది. దీంతో ఒక ప్రధాన అంతర్జాతీయ హబ్ను సృష్టించే కల నెరవేరుతుంది. సాంకేతిక జోక్యంతో పాటు సామర్థ్యం ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఎయిర్ఫీల్డ్ యొక్క ఉత్తర భాగం మరియు ఎయిర్ఫీల్డ్ యొక్క దక్షిణ భాగం దీని ద్వారా సౌకర్యవంతంగా అనుసంధానించబడుతుంది. దీని అర్థం టాక్సీ సమయం 8 నుండి 9 నిమిషాలు తగ్గుతుంది. ఈ రన్వే ఢిల్లీ విమానాశ్రయం, దేశంలో 4 రన్వేలను కలిగి ఉన్న ఏకైక విమానాశ్రయంగా నిలుస్తుంది. టెర్మినల్ విస్తరణతో పాటుగా ఈ రన్వే 109 మిలియన్ల కంటే ఎక్కువ మందికి సేవలందించే సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. ఇది అట్లాంటాను దాని సామర్థ్యంలో అధిగమించగలదు. ఆ సామర్థ్యంతో, మనం మౌలిక సదుపాయాల వైపు మరియు భారతదేశంలో అంతర్జాతీయ పౌర విమానయాన హబ్‌ను సృష్టించే సామర్థ్యం వైపు రెండింటిలోనూ మంచి స్థానంలో నిలుస్తాము అని అన్నారు.
రన్‌వే మరియు టాక్సీవే యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు:
నాల్గవ రన్వే (11ఆర్/29ఎల్)
• మొత్తం 4.4 కిమీ పొడవు మరియు 45మీ వెడల్పు
• ఎ-380& బి-777తో సహా వైడ్-బాడీ విమానాలను నిర్వహించగల సామర్థ్యం
• ఏకకాల విమాన కార్యకలాపాలను నిర్వహించడానికి మెరుగైన సామర్థ్యం
• రన్వే ఏరోడ్రోమ్ రిఫరెన్స్ కోడ్ 4ఎఫ్ కు అనుగుణంగా రూపొందించబడింది
ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే (ఈసీటీ)
• ఉత్తర & దక్షిణ ఎయిర్ఫీల్డ్లను కలుపుతూ డ్యూయల్-వే ఎలివేటెడ్ టాక్సీవే
• 2.1కిమీ పొడవు మరియు 44మీ వెడల్పు గల డ్యూయల్ లేన్ ఎలివేటెడ్ కోడ్ ఎం-కంప్లైంట్ టాక్సీవేలు
• రెండు పెద్ద విమానాలు సురక్షితంగా మరియు ఏకకాలంలో ప్రయాణించేందుకు ట్యాక్సీవేలు 47మీటర్ల ఖాళీని కలిగి ఉంటాయి.
• విమానం కోసం టాక్సీ దూరాన్ని 7 కి.మీ తగ్గించడంలో సహాయపడుతుంది
సంవత్సరానికి 55,000 టన్నుల కార్బన ఉద్గారాలను తగ్గిస్తుంది.
***
(Release ID: 1940062)
Visitor Counter : 95