నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఏఐ ఫర్ ఇండియా 2.0 అనే ఉచిత ఏఐ నైపుణ్య శిక్షణా కోర్సును ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
- ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా భారతీయ భాషలలో కోర్సు ఆవిష్కరణ
- సాంకేతికత భాషకు ఖైదీ కాకూడదు.. భారతీయ భాషల్లో టెక్నాలజీ కోర్సులు రావాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు
प्रविष्टि तिथि:
15 JUL 2023 6:35PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మవరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కృత్రిమ మేథస్సుపై ఉచిత ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం ‘ఏఐ ఫర్ ఇండియా 2.0’ను ప్రారంభించారు. ఇది స్కిల్ ఇండియా, జీయువీఐ సంయుక్త చొరవ. ఈ ఎన్.సి.వి.ఇ.టి మరియు ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందిన ఆన్లైన్ ప్రోగ్రామ్ యువతకు కావాల్సిన నైపుణ్యాలరను అందించి వారిని సాంకేతికంగా సన్నద్ధం చేస్తుంది. ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ.. సాంకేతికత భాష కారణంగా ఖైదీ కాకూడదని మరిన్ని భారతీయ భాషల్లో టెక్నాలజీ కోర్సులు రావాలని పిలుపునిచ్చారు. సాంకేతిక విద్యలో భాషాపరమైన అవరోధాన్ని తొలగించడం, మన యువశక్తిని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారి భవిష్యత్తును నిరూపణ చేయడం దిశగా ఇదొక మంచి ఆరంభం అని ఆయన అన్నారు. భారతదేశం మేటి టెక్నాలజీ-అవగాహన కలిగిన దేశమని, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంలో విజయగాథ ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. పిరమిడ్ జనాభాలో అట్టడుగు వర్గాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జీయువీఐ చొరవ తీసుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలోని ప్రతి ప్రాంతానికి ఏఐ నేర్చుకునేలా సులభ సౌలభ్యాన్ని ఊహించే చొరవను శ్రీ ప్రధాన్ హృదయపూర్వకంగా అభినందించారు. జీయువీఐ, ఒక IIT మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అనేది టెక్ ప్లాట్ఫారమ్, ఇది మాతృభాషలో టెక్ లెర్నింగ్ని అనుమతిస్తుంది. ఈ కార్యక్రమం 9 భారతీయ భాషలలో నిర్వహించబడింది. జీయువీఐ అనేది IIT మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్. ఇది టెక్ ప్లాట్ఫారమ్. ఇది మాతృ భాషలో టెక్ లెర్నింగ్ని అనుమతిస్తుంది. ఈ కార్యక్రమం 9 భారతీయ భాషలలో అందించబడుతోంది.
*****
(रिलीज़ आईडी: 1940061)
आगंतुक पटल : 277