వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ వినియోగ ప్రాముఖ్య శృంఖల అభివృద్ధి కార్యక్రమం మూడవ దశ పురోగతిపై సమీక్ష


ఈశాన్య రాష్ట్రాలలో ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు వినియోగ ప్రాముఖ్య శృంఖల అభివృద్ధి చేయడాన్ని

ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ వినియోగ ప్రాముఖ్య శృంఖల అభివృద్ధి కార్యక్రమం (MOVCDNER) లక్ష్యంగా పెట్టుకుంది

Posted On: 14 JUL 2023 8:12PM by PIB Hyderabad

 

  ఇందుకు సంబంధించి భాగస్వామ్య పక్షాల రెండు రోజుల కార్యగోష్ఠి శుక్రవారం ముగిసింది.  ఈశాన్య ప్రాంతంలో  సేంద్రీయ వినియోగ ప్రాముఖ్య  శృంఖల అభివృద్ధి కార్యక్రమం మూడవ దశ పురోగతిని సమీక్షించడానికి  ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈశాన్య రాష్ట్రాలలోఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు  వినియోగ ప్రాముఖ్య  శృంఖల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ  ప్రాయోజిత పథకం ఇది.

    ఇప్పటివరకు ఈ పథకం మూడవ దశ సాధించిన పురోగతిని , 2023-24లో నాల్గవ దశ అమలుకు రోడ్ మ్యాప్ తయారీ, దృష్టిని కేంద్రీకరించడం గురించి 13వ తేదీ గురువారం  సమీక్షించారు.  MOVCDNER పథకం కింద అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టగలిగే కార్యకలాపాలు మరియు ప్రణాళికలను  గురించి సూచనలు తెలియజేయవలసిందిగా రాష్ట్రాలను కోరారు.  

      14వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశానికి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (INM) శ్రీ రాకేష్ రంజన్ అద్యక్షత వహించగా  సంయుక్త కార్యదర్శి (INM) డాక్టర్ యోగితా రాణా మరియు సంయుక్త కార్యదర్శి (MDONER) శ్రీ అంగ్షుమాన్ డే హాజరయ్యారు.  ఎనిమిది ఈశాన్య ప్రాంత రాష్ట్రాల -- మిజోరం, మణిపూర్, మేఘాలయ, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మరియు త్రిపుర -- ప్రతినిధులు,  ఈశాన్య ప్రాంత ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ (NEDFI), వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ , గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు కార్యగోష్ఠిలో పాల్గొన్నారు.  పథకం స్థాయిని పెంచడానికి, పథకం అమలుకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు చేసిన సిఫార్సులపై ప్రదర్శనతో సమావేశం ప్రారంభమైంది.

      సేంద్రీయ ఉత్పత్తుల బ్రాండ్ విలువను సృష్టించడంతో పాటు మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేయడానికి సర్వీస్ ప్రొవైడర్ల ప్రాముఖ్యతను అదనపు కార్యదర్శి (INM) శ్రీ రాకేష్ రంజన్ నొక్కిచెప్పారు. ఈశాన్యప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిన విషయాన్ని ప్రముఖంగా పేర్కొంటూ  ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకోవడానికి నిశ్చయపఱౘుకోవాలని,  ఈశాన్య ప్రాంత రైతులు గరిష్ట ప్రయోజనాన్నినిర్ధారించడానికి సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి పెట్టాలని అన్నారు.  

    2015-16లో ప్రారంభించిన MOVCDNER పథకం ద్వారా 1.73 లక్షల హెక్టార్లను సేంద్రియ వ్యవసాయం కిందకు తీసుకురావడం ద్వారా 1.89 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.  పథకం అమలు ద్వారా ఇప్పటివరకు 205 సేకరణ, రాశిగా కూర్చడం మరియు శ్రేణీకరణ యూనిట్లు, 190 కస్టమ్ హైరింగ్ సెంటర్లు మరియు 123 ప్రాసెసింగ్ యూనిట్ మరియు ప్యాక్ హౌస్‌ల సృష్టితో 379 రైతు ఉత్పత్తుల సంస్థలు / రైతు ఉత్పత్తుల కంపెనీలు ఏర్పడ్డాయి.  ఏడు బ్రాండ్లను కూడా అభివృద్ధి చేశారు.  

      వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  ఈశాన్య ప్రాంతంలో నిర్వహిస్తున్న వివిధ పథకాలను ఒకచోట కూర్చే అవకాశాల అన్వేషణ గురించి అధికారులు,  NEDFI సంక్షిప్త  ప్రదర్శన నిర్వహించారు.  
చర్చలో విశేషంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు:  

       ప్రతి చుక్క నీటికి ఎక్కువ పంట సాధించడం -- రైతుల్లో సూక్ష్మ నీటిపారుదలని ప్రోత్సహించడం

       జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం  ---  కేంద్ర రాష్ట్రాల కార్యక్రమాల కలయికతో అభివృద్ధి

       వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి---  రైతు ఉత్పత్తి సంస్థల వారీగా సవాళ్ళను గుర్తించి పరపతి సౌకర్యాలను సులభతరం చేయడంలో బ్యాంకులు నిమగ్నమై ఉంటాయి.  

       జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ---- కంచెలు ఏర్పాటు, భూమి అభివృద్ధికి మద్దతు.

       వ్యవసాయ యాంత్రీకరణకు ఉప మిషన్  ------  రైతు ఉత్పత్తి సంస్థల అవసరాలపై వారికి అవగాహనా కల్పించడానికి వీలుగా రాష్ట్రాలకు వీడియోలు మరియు మాడ్యూళ్లను ప్రసారం చేయడం ద్వారా వారికి  అవగాహన కలిగించడం.  

       వ్యవసాయ మార్కెటింగ్ కు సమగ్ర పథకం ----  రైతు ఉత్పత్తి సంస్థలకు సహాయం

       వ్యవసాయ టెక్నాలజీ నిర్వహణ సంస్థ  --- రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను నిర్ధారించడానికి కార్యకర్తలను, నిపుణులను నిమగ్నం చేయడం
              చర్చలలో ప్రతినిధులందరూ చురుకుగా పాల్గొన్నారు.  MOVCDNER పథకాన్నిగురించి తన  విస్తృత దృష్టిని పంచుకున్న సంయుక్త కార్యదర్శి (INM) డాక్టర్ యోగితా రాణా పథకం వాహకంగా / సాధనంగా  ఒకచోట కూడేందుకు  కృషి చేయాలని  రాష్ట్రాలను ప్రోత్సహించారు.  

 

***



(Release ID: 1940058) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi , Manipuri