చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రిక సమాచారం

Posted On: 15 JUL 2023 4:02PM by PIB Hyderabad

15.07.2023 నాడు విడుదలైన ప్రకటన ప్రకారం, దేశంలోని మూడు ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను గౌరవనీయ రాష్ట్రపతి బదిలీ చేశారు. (i) అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం దినేష్ కుమార్ సింగ్‌ను కేరళ ఉన్నత న్యాయస్థానానికి, (ii) పంజాబ్ &హరియాణా ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి మనోజ్ బజాజ్‌ను అలహాబాద్ ఉన్నత న్యాయస్థానానికి, (iii) దిల్లీ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గౌరంగ్ కాంత్‌ను కలకత్తా ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు. రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఉన్నత న్యాయస్థానాల్లోని వారి కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించాలని సూచించారు.

****


(Release ID: 1939822) Visitor Counter : 201