వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూలై 16 నుండి 18వ తేదీ వరకు డాక్టర్ సి. సుబ్రమణియన్ ఆడిటోరియంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తన 95వ వ్యవస్థాపక మరియు సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకోనుంది.

Posted On: 14 JUL 2023 5:14PM by PIB Hyderabad

 కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్  మరియు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ కైలాష్ చౌదరి మరియు సశ్రీ శోభా కరంద్లాజే జూలై 16, 2023న 95వ వ్యవస్థాపక మరియు సాంకేతిక దినోత్సవాన్నిప్రారంభించనున్నారు. వ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఎంపిక చేసిన నలభై సాంకేతికతలను కూడా మంత్రులు విడుదల చేస్తారు. అంతేకాకుండా ఈ సాంకేతికతలను అభివృద్ధి చేసిన వారికి గుర్తింపు కూడా లభిస్తుంది.   ఈ కార్యక్రమం 2023, జూలై 16వ తేదీ నుంచి 2023, జూలై 18 వరకు డాక్టర్ సి. సుబ్రమణ్యం ఆడిటోరియంలోని ఎన్ఏఎస్సీ కాంప్లెక్స్లో నిర్వహించబడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తన వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 16న జరుపుకుంటుంది. ఈ ఏడాది నుంచి ‘ఫౌండేషన్ అండ్ టెక్నాలజీ డే’గా పాటించాలని నిర్ణయించారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్,  వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ.  భారత ప్రభుత్వం ఉద్యానవన, మత్స్య మరియు జంతు శాస్త్రాలతో సహా వ్యవసాయంలో పరిశోధన మరియు విద్యను సమన్వయం చేయడం, మార్గనిర్దేశం చేయడం మరియు నిర్వహణ చేయడంలో నిమగ్నమై ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 113 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ శాస్త్ర రంగాలలో అత్యాధునిక పరిశోధనలు చేస్తున్నాయి.

వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న టెక్నాలజీ ఎగ్జిబిషన్ మరియు ఇండస్ట్రీ ఇంటర్‌ఫేస్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, నాణ్యత మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి భాగస్వాముల ప్రయోజనం కోసం వివిధ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలు అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతికతలను ప్రదర్శనలో ప్రదర్శించబడతాయి. ఇవి కాకుండా, స్థిరమైన మరియు వాతావరణ- అనుకూల వ్యవసాయం ఈ ఎగ్జిబిషన్‌లోని కీలక రంగాలలో ఒకటి.  వరి, గోధుమలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మినుము (శ్రీ అన్న), మరియు ఇతర వాణిజ్య పంటలకు పర్యావరణ అనుకూల సాంకేతికతలను కూడా ప్రదర్శనలో ప్రాధాన్యతను పొందుతాయి. యాంత్రీకరణ, ఖచ్చితమైన వ్యవసాయం మరియు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా దృష్టి సారిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క విద్యా వ్యవస్థలో బలమైన విస్తరణ వ్యవస్థ మరియు ఆవిష్కరణ వ్యవసాయాన్ని విజయవంతంగా ప్రోత్సహించడం కోసం ప్రదర్శించబడుతుంది. ఇవి కాకుండా, జంతు శాస్త్రం, పౌల్ట్రీ మరియు ఫిషరీస్ కోసం ఇటీవల అభివృద్ధి చేసిన నిరూపితమైన సాంకేతికతలు వాటాదారుల ప్రయోజనం కోసం ప్రదర్శించబడతాయి.

ప్రదర్శన సమయంలో, వాణిజ్యీకరణకు అవకాశం ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు అభివృద్ధి చేసిన వివిధ రకాల సాంకేతికతలు/ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి. ఈ ఈవెంట్‌లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు పరిశ్రమల మధ్య పరస్పర చర్యల యొక్క పబ్లిక్అండ్ప్రైవేట్ భాగస్వామం(పీపీపీ) మోడల్‌కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు అభివృద్ధి చేసిన వివిధ రకాలైన సాంకేతికతలు/ఉత్పత్తులను బహిర్గతం చేసే ఉద్దేశ్యంతో 100 కంటే ఎక్కువ మంది పరిశ్రమ భాగస్వాములు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ప్రదర్శన సాంకేతికతను పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడానికి మరియు వ్యవసాయ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికిఈ వ్యవస్థాపక దినోత్సవ ప్రదర్శనలు ఎంతగానో సహాయపడతాయి.

అంతేకాకుండా అదనంగా, 500 మందికి పైగా రైతులతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 1000 మంది విద్యార్థులు కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వ్యవస్థాపక మరియు సాంకేతిక దినోత్సవంలో పాల్గొంటారు.

***


(Release ID: 1939743) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi