మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

బాలల రక్షణ, శిశు భద్రత మరియు శిశు సంక్షేమంపై రెండవ ప్రాంతీయ సింపోజియం ను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేడు భోపాల్‌లో నిర్వహించింది


మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ మూడు రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరైన సింపోజియం

బాలల హక్కులు చట్టం, నియమ నిబంధనలు సవరణలపై కార్యక్రమం దృష్టి సారించింది

బాలల హక్కుల పరిరక్షణకు జాతీయ కమిషన్, రాష్ట్ర బాలల కమీషన్లు మరియు సీ డబ్ల్యు సీ లు చేసిన కృషికి కేంద్ర డబ్ల్యు సీ డీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు

పిల్లల రక్షణ, పిల్లల భద్రత మరియు శిశు సంక్షేమ సమస్యలపై అవగాహన మరియు అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రాంతీయ సింపోజియమ్‌ల శ్రేణిలో ఈ కార్యక్రమం భాగం.

Posted On: 09 JUL 2023 4:26PM by PIB Hyderabad

మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం భోపాల్‌లో ఈ రోజు 09.07.2023న బాలల రక్షణ, శిశు భద్రత మరియు శిశు సంక్షేమంపై రెండవ ఒకరోజు ప్రాంతీయ సింపోజియంను నిర్వహించింది. ఇందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ అనే మూడు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ సింపోజియమ్‌కు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (సిడబ్ల్యుసిలు), జువైనల్ జస్టిస్ బోర్డులు (జెజెబిలు), గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (విసిపిసి) సభ్యులు మరియు అంగన్‌వాడీ వర్కర్ల నుండి 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. బాలల రక్షణ, బాలల భద్రత మరియు శిశు సంక్షేమ సమస్యలపై అవగాహన మరియు చైతన్యం పెంచేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రాంతీయ సింపోజియమ్‌ల శ్రేణిలో ఈ కార్యక్రమం భాగం.

 

సింపోజియం లో శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర మంత్రి, మహిళా మరియు శిశు అభివృద్ధి, భారత ప్రభుత్వం, డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్, భారత ప్రభుత్వం, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి, శ్రీ సంజీవ్ కుమార్ చద్దా, మహిళా మరియు శిశు అభివృద్ధి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి భారతదేశం, మరియు శ్రీ ప్రియాంక్ కనూంగో, చైర్‌పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) లు పాల్గొన్నారు.

 

జువెనైల్ జస్టిస్ యాక్ట్, రూల్స్‌లోని సవరణలపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.సెప్టెంబర్, 2022 సవరణ తర్వాత దత్తత ప్రక్రియలపై దీని ప్రభావం గురించి సత్వర  పరిష్కారం పొందిన  భావి దత్తత తల్లిదండ్రులు అనుభవాలు పంచుకున్నారు.

 

ఎన్ సీ పీ సీ ఆర్ చైర్‌పర్సన్, శ్రీ ప్రియాంక్ కనూంగో    దేశ బాలలందరి సంక్షేమం సంరక్షణ కోసం గ్రామ స్థాయిలో మొదట స్పందించిన వారి నుండి భారత ప్రభుత్వ అధికారుల వరకు మరియు కేంద్ర మంత్రి  వరకు ఒకే వేదిక పై పాల్గొనటం ద్వారా ఈ రోజు చరిత్ర పుటలలో ఎలా గుర్తించబడుతుందో పంచుకున్నారు,

 

ఎం ఓ డబ్ల్యు సీ డీ అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ చద్దా వివిధ రాష్ట్రాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ విజయాల గురించి ప్రసంగించారు. దేశంలోని ప్రతి బిడ్డ ను అభివృద్ధి లోనికి తీసుకురావడానికి “ఏ పిల్లలు వదిలివేయబడరు” అనే సూత్రాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టారు.

 

ఎం ఓ డబ్ల్యు సీ డీ, సహాయ మంత్రి, డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ పిల్లల సంక్షేమం మరియు రక్షణ లక్ష్యం కోసం సమర్థవంతమైన మరియు ప్రభావవంతమైన ఫలితం కోసం మంత్రిత్వ శాఖ అంతర్గత  అఖిల మంత్రిత్వ స్థాయిలో సమిష్టి వ్యూహాన్ని కొనసాగించే లక్ష్యంతో "మిషన్ వాత్సల్య" యొక్క లక్ష్యాలను వివరించారు. తప్పిపోయిన, అనాథ, వదలివేయబడిన మరియు లొంగిపోయిన పిల్లలతో సహా క్లిష్ట పరిస్థితులలో పిల్లలకు సహాయం సంరక్షణ సంబంధించిన వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ల గురించి మాట్లాడారు.  ఎస్ సీ పీ ఎస్, డీ సీ పీ యూ, సీ డబ్ల్యు సీ, జే జే బీ, సీ సీ ఐ లు, ఎస్ జే పీయూ  ఉపయోగించే రాష్ట్రాలు/ యూ టీ లతో అలాగే పౌరులను కూడా సంప్రదించి   ఎం ఓ డబ్ల్యు సీ డీ అన్ని ఎం ఐ ఎస్ ప్రయోజనాల కోసం సంబంధిత డాష్‌బోర్డ్లను అభివృద్ధి చేసింది.  

 

కేంద్ర మంత్రి, ఎం ఓ డబ్ల్యు సీ డీ, శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, సీ సీ ఐ నుండి 1,450,000 మంది పిల్లలను వారి ఇళ్లకు తిరిగి వచ్చేలా చేయడంలో వారి ప్రయత్నాలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రాష్ట్ర బాలల కమిషన్లు మరియు సీ డబ్ల్యు సీ లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

చట్టంలో మార్పు రాకముందు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 900 దత్తత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలో మార్పుతో జిల్లా పాలనా యంత్రాంగం కు బాధ్యత వహిస్తుంది. అప్పటి నుండి, దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో 2250 కంటే ఎక్కువ దత్తతలను విజయవంతంగా ప్రాసెస్ చేశారు.

 

సుమారు 13-14 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా 8 నుండి 9 వేల మంది పిల్లలు రక్షించబడ్డారు. నేడు, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 65,000 మంది పిల్లలకు సంస్థాగత సంరక్షణను అందిస్తోంది.

 

దేశవ్యాప్తంగా ఉన్న బాధిత కుమార్తెలకు  ₹74 కోట్లు అందజేస్తాము మరియు వారికి నెలకు రూ.4,000 అందజేస్తాము. వారి నైపుణ్య శిక్షణకోసం మరిన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు 18 ఏళ్ల తర్వాత మాత్రమే కాదు, 23 ఏళ్ల వరకు అలాంటి ఆడపిల్లలకు సంరక్షణ అందిస్తాం అన్నారు.

 

మిషన్ వాత్సల్య ద్వారా విజయవంతమైన జోక్యాలను ఈ కార్యక్రమం లో ప్రచారం చేశారు.

 

***



(Release ID: 1938431) Visitor Counter : 233