వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎక్స్‌ప్లోరింగ్ ది ఇండియా టాయ్ స్టోరీ పై రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించిన డిపిఐఐటి
Posted On:
08 JUL 2023 8:05PM by PIB Hyderabad
టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి), ఇన్వెస్ట్ ఇండియా శనివారంనాడడు న్యూఢిల్లీలో ఎక్స్‌ప్లోరింగ్ ది ఇండియా టాయ్ స్టోరీ (భారత బొమ్మల కథల అన్వేషణ) రౌండ్ టేబుల్ సదస్సును విజయవంతంగా నిర్వహించింది. దేశంలోనే అతిపెద్ద బొమ్మల ప్రదర్శనలలో ఒకటి అయిన ఇండియా టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ 14వ ఎడిషన్ జరుగుతున్న సమయంలోనే జరగడంతో, దేశీయ బొమ్మల రంగంలో పెరుగుతున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బొమ్మల ఉత్పత్తిదారులు, చిల్లర దుకాణదారులు, సంస్థలు, ప్రభుత్వ అధికారులను ఒకచోటకు చేర్చింది.
ఈ సదస్సుకు డిపిఐఐటి కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ అధ్యక్షత వహించారు. టాయ్‌కానమీ (బొమ్మల ఆర్ధిక వ్యవస్థ)ను బలోపేతం చేయడంలో భారత్ సాధించిన అసాధారణ పురోగతిని కీలకోపన్యాసంలో శ్రీ సింగ్ పట్టిచూపారు. రానున్న సంవత్సరాలలో ఈ రంగం అత్యధికంగా అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ రంగం 2014-2023 కాలంలో ఎగుమతులు అసాధారణ రీతిలో 240% పెరిగి ఆకట్టుకునే పరివర్తనను సాధించిందని కార్యదర్శి పేర్కొన్నారు. ఇదే కాలంలో బొమ్మల దిగుమతులు 52% తగ్గాయన్నారు. పదిహేను సంవత్సరాల వయసుకన్నా తకు్కవ ఉన్న సుమారు 350 మిలియన్ల జనాభా కారణంగా దేశంలోని బొమ్మల పరిశ్రమ, తయారీదారులకు సంభావ్యత అపారంగా ఉందని శ్రీ సింగ్ అన్నారు. బొమ్మల ఉత్పత్తి కేంద్రంగా భారతదేశ స్థానాన్ని విస్తరిస్తున్న స్థాయి, పరిమాణం, సాంకేతిక నైపుణ్యంతో స్థానిక ఉత్పత్తులతో వేగంగా ప్రతిష్టించేందుకు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
సజీవంగా సాగిన రౌండ్ టేబుల్ సంభాషణలో పాల్గొన్నందుకు వాటాదారులందరికీ డిపిఐఐటి సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉద్ఘాటించిన వోకల్ ఫర్ లోకల్ టాయ్స్ దార్శనికతను అందిపుచ్చుకోవలసిందిగా ఆయన శ్రోతలకు గుర్తు చేశారు. దీనితోపాటుగా, ఆయన సురక్షితమైన, ఉన్నత నాణ్యత కలిగిన బొమ్మలు దేశీయంగా అందుబాటులోకి తేవడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. అటు అంతర్జాతీయ, ఇటు భారతీయ వ్యాపారవేత్తలు హాజరుకావడంతో, పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళేందుకు తోడ్పడే వ్యూహాలను రూపొందించవలసిందిగా కంపెనీలను ఆహ్వానిస్తూ, ఈ కీలక రంగంలో భారత్ అందిస్తున్న సంభావ్యతలను తెరిచేందుకు ఈ కార్యక్రమంలో పొందిన ప్రావీణ్యాన్ని ఉపయోగించాలని కోరుతూ శ్రీ సంజీవ్ తన ప్రసంగాన్ని ముగించారు.
సదస్సు సందర్భంగా హాజరైన వ్యాపార, ప్రభుత్వ వాటాదారుల మధ్య స్పష్టమైన చర్చలలో, వేగంగా విస్తరిస్తున్న దేశీయ కార్యకలాపాలను ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడం గురించే కాక తమ వృద్ధి కథనాలను పరిశ్రమ వివరించింది. గత కొద్ది సంవత్సరాలలో పరిశ్రమ సాధించిన విజయాలను టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మను గుప్తా పట్టి చూపారు. ముఖ్యంగా, దేశంలో 9600 నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఇ బొమ్మల ఉత్పత్తి యూనిట్లు, 8 జిఐ టాయ్ క్లస్టర్లను గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈ రంగంలో ఉత్పత్తి విప్లవాన్ని తీసుకురావడంలో ముందువరుసలో ఉన్న ప్లేగ్రో, సన్‌లార్డ్, మైక్రో- ప్లాస్టిక్స్, ఆక్వస్, ఫన్ స్కూల్, డ్రీమ్ - ప్లాస్ట్ సహా ప్రధాన దేశీయ ఉత్పత్తి దారులు సహా 50 మంది హాజరై పాలుపంచుకున్నారు. ఉపన్యాసకులు పంచుకున్న ఆలోచనల కారణంగా ఈ రంగంలో ఇప్పటి వరకూ చోటు చేసుకున్న సుదూర పరిణామాలతో పాటుగా తదుపరి దశలో అంతర్జాతీయ బొమ్మల సరఫరా లంకెలో ఏకీకరణను త్వరగా నమోదు చేయడంలో పరిశ్రమ ఉరవడిని శ్రోతలు అర్థం చేసుకోవడానికి అవకాశం లభించింది.
****
(Release ID: 1938370)
Visitor Counter : 121