పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
గ్రీన్ హైడ్రోజన్ (హరిత ఉదజని) అభివృద్ధికి ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసింది: హర్దీప్ సింగ్ పూరి
ప్రపంచంలో 2030 నాటికి హైడ్రోజన్ డిమాండ్ 200 మిలియన్ టన్నులకు చేరుకోగలదని అంచనా
ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ కంపెనీల మద్దతుతో తక్కువ ఖర్చుతో హరిత ఉదజని ఉత్పత్తి
ప్రక్రియను వేగవంతం చేయగలవు: పెట్రోలియం మంత్రి
గ్రీన్ హైడ్రోజన్ ఒక భావన దాని సమయం ఇప్పుడే : హర్దీప్ సింగ్ పూరి
2030 నాటికి ప్రభుత్వ రంగ సంస్థలు (పి ఎస్ యు)లు ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్
ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి: పెట్రోలియం మంత్రి
Posted On:
07 JUL 2023 4:58PM by PIB Hyderabad
జూలై 5 నుండి 7వ తేదీ వరకు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోగ్రీన్ హైడ్రోజన్ పై (ICGH-2023) నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సమాలోచనలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన భాగస్వామ్యపక్షాలు పాల్గొని
హైడ్రోజన్ ఉత్పత్తి పెంపు, సాంకేతిక, వినియోగం, విధానం, నియంత్రణలో ప్రపంచవ్యాప్త సరళికి అనుగుణంగా భారత ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు/తోడు నిలిచాయి.
మూడు రోజుల సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి సదస్సులో జరిగిన చర్చోపచర్చల తీరుపట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. "కొత్త, అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ శాస్త్ర మరియు పారిశ్రామిక పరిశోధన మండలి , భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం, భారత పరిశ్రమల సమాఖ్య (సి ఐ ఐ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించారు. పరిశ్రమకు చెందిన దిగ్గజాలు / నిపుణులు 25 సెషన్లలో పాల్గొని సాంకేతిక చర్చోపచర్చలు జరిపారు. 1500 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. 'ఇప్పటి తక్షణావసరమైన హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తుండటం సంతృప్తికరంగా ఉంది' అని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) , ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపిందర్ ఎస్ భల్లా, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మరియు ఇండియా జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అక్షయ ఇంధనానికి మారాలనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంటూ 'భారతదేశం ఇప్పుడు ఓ కొత్త ప్రయాణం ప్రారంభించిందని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యపక్షాలన్నింటి మధ్య క్రియాశీల మద్దతు, సహకారం అవసరం' అని అన్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని చేతలలో చూపుతోందని, ఇందుకు ఇటీవల ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉదాహరణ అని మంత్రి అన్నారు.
ప్రపంచంలో స్థాపిత అక్షయ ఇంధన ఉత్పత్తి సామర్థ్యంలో ఇండియా 4వ స్థానంలో ఉందని, మిత వ్యయంతో దీర్ఘకాలిక సౌర మరియు ప్లవన ఉత్పత్తిని సాధించిందని పెట్రోలియం మంత్రి తెలియజేశారు. 'మనకు అపారమైన సౌరశక్తి , పవర్ గ్రిడ్ లో పుష్కలంగా పెట్టుబడులు ఉన్నాయి. అందువల్ల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో మనకు సహజ ప్రయోజనం ఉంది. గ్రీన్ హైడ్రోజెన్ ఉత్పత్తికి అనువైన వాతావరణం, వనరులు, తగినంత ఉత్పత్తి, పంపిణీకి బలమైన సరఫరా - శృంఖల ఉన్నాయి' అని మంత్రి వెల్లడించారు.
పరిశుభ్రమైన, అక్షయ ఇంధన ఉత్పత్తి రంగంలో ఇండియా సామర్ధ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ వాతావరణపరంగా పావనమైన భారత భూభాగం, ప్రపంచాన్ని మానవాళి జీవనానికి అనువైన ప్రదేశంగా మార్చడంలో భారత ప్రభుత్వానికి గల తిరుగులేని నిబద్ధత చూసి ప్రముఖ ఆర్థిక సంస్థలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని కనబరిచాయని శ్రీ పూరీ తెలిపారు.
ఐరోపా పెట్టుబడి బ్యాంకు (ఈ ఐ బి), ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ డి బి) మరియు ప్రపంచ బ్యాంకు హరిత ఉదజని అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయని పెట్రోలియం మంత్రి తెలిపారు.
'ప్రపంచ వేదికపై భవిష్యత్ ఇంధనాన్ని ఆవిష్కరించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసి పనిచేయడం ప్రముఖమైన విషయం. భారతదేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మార్గాలు కనుగొనేందుకు పరిశ్రమ స్థాయిలో క్రమం తప్పకుండా అనేక సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. హైడ్రోజన్ విస్తరణకు గరిష్ట అవకాశాలతో కొత్త ప్రాజెక్టులను రూపొందించడానికి మేము ప్రయత్నిస్తాము' అని వివరించారు.
గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ పరివర్తన సజావుగా సాగడంలో ప్రభుత్వరంగ సంస్థలు ఆట నియమాలను మార్చడంలో సూత్రధారులని పేర్కొంటూ పెట్రోలియం మంత్రి "ఇప్పుడు పి ఎస్ యులు హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిశ్చయం చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాయి. 2030 నాటికి 10 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని పి ఎస్ యులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అప్పటికి ప్రపంచ హైడ్రోజన్ డిమాండ్ 200 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా” అని శ్రీ పూరి తెలిపారు.
మరియు కేంద్ర సహాయ మంత్రి (ఇండి. ఛార్జ్) సైన్స్ & టెక్నాలజీ, MoS PMO, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అతను స్థోమత, ప్రాప్యత మరియు ఆమోదయోగ్యత అనే మూడు మంత్రాలపై దృష్టి సారించాడు.
ముగింపు సమావేశంలో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర) , ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రోజన్ మిషన్ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా ప్రపంచ వాణిజ్యాన్ని కూడా పెంచుతోందని , ఆత్మనిర్భర్ భారత్ పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మూడు మంత్రాలు సులభత, లభ్యత, స్వీకార్యత/ గ్రాహ్యతపైన తన దృష్టిని కేంద్రీకరించారు.
***
(Release ID: 1938368)
Visitor Counter : 154